Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
ప్రముఖ పంజాబీ రచయిత అమృతకు గూగుల్ డూడుల్ నివాళి..
అమృత 16 ఏళ్ల వయస్సులోనే "డేర్డ్ టు లైవ్ ద లైఫ్ ఆఫ్ షి ఇమాజిన్స్"ను రచించింది. 1947లో భారత్-పాక్ విభజన నేపథ్యంలో "అజ్డ్ అఖాన్ వారిస్ షా ను" అనే ఆమె కవితకు విశేషమైన ఆదరణ లభించింది.
భారతదేశంలోనే అత్యంత ప్రముఖ పంజాబీ రచయిత అమృత ప్రీతమ్ శత జయంతి సందర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేక డూడుల్ రూపొందించి ఆమెకు ఘనంగా నివాళి అర్పించింది. ఆమె బ్రిటీష్ ఇండియా పంజాబ్ బోలని గుజ్రాన్ వాలా ప్రాంతంలో జన్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్థాన్ దేశంలో ఉంది.

ఆమె ఆత్మకథ 'కాలా గులాబ్'ని మరిపించేలా గూగుల్ డూడుల్ ని తీర్చిదిద్దింది. కాలా గులాబ్ తో ఆమె జీవితంలోని పలు చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి. వీటి స్ఫూర్తితో మహిళలు తమ సమస్యలపై గళమెత్తడం ప్రారంభించారు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలలో మహిళలు నిర్భయంగా మాట్లాడటానికి అమృత ప్రీతమ్ జీవిత చరిత్ర స్ఫూర్తినిచ్చిందని సాహితీవేత్తలు చెబుతుంటారు.
సాహిత్య అకాడమీ (1956) అందుకున్న తొలి మహిళగా అమృత ఖ్యాతిని గడించారు. దీనితో పాటు జ్ఞానపీఠ్ అవార్డు (1981), పద్మవిభూషణ్ అవార్డులు కూడా ఆమెకు దక్కాయి. ఆమె రచించిన ప్రముఖ నవల 'పింజర్'ను బాలీవుడ్ లో సినిమాగా తెరకెక్కించారు. దీనికి దేశ సమైక్యతా విభాగంలో ఉత్తమ జాతీయ చిత్రంగా అవార్డు కూడా వచ్చింది. దేశ విభజన నేపథ్యంలో వచ్చిన నవలగా దీనికి ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది.
అమృత 16 ఏళ్ల వయస్సులోనే "డేర్డ్ టు లైవ్ ద లైఫ్ ఆఫ్ షి ఇమాజిన్స్"ను రచించింది. 1947లో భారత్-పాక్ విభజన నేపథ్యంలో "అజ్డ్ అఖాన్ వారిస్ షా ను" అనే ఆమె కవితకు విశేషమైన ఆదరణ లభించింది. 20వ శతాబ్దంలో గొప్ప పంజాబీ కవిగా పేరు సంపాదించిన ప్రీతమ్ విభజన సమయంలో 'పింజర్' తో సహా 28 నవలలను ప్రచురించింది. దీన్ని కూడా ఒక చలనచిత్రంగా రూపొందించారు.
ఆరు దశాబ్దాలుగా అమృత ప్రీతమ్ దాదాపు 100 రచనలను చేశారు. 2005లో ఆమె నవల 'ది అస్తి పంజరం' యొక్క అనువాదానికి లా రూట్ డెస్ ఇండెస్ బహుమతి కూడా లభించింది. ఆమెకు భారతదేశంతో పాటు పాకిస్థాన్ దేశంలోనూ చాలా మంది అభిమానులు ఉన్నారు. దేశ విభజన తర్వాత అమృత పాకిస్థాన్ లో నివసించారు. ఆమె పంజాబీ భాషలో ప్రావీణ్యం సంపాదించినప్పటికీ, అమృత ప్రీతం హిందీ, ఉర్దూ భాషాలలో కూడా చాలా రచనలు చేశారు. అలాగే ఆల్ ఇండియా రేడియోలో కూడా అమృత పనిచేశారు. 1986లో ఆమె రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అక్టోబర్ 31, 2005లో ఆమె అనారోగ్యంతో శాశ్వతంగా కన్నుమూశారు.



Click it and Unblock the Notifications

