Latest Updates
-
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు
శ్రేయా ఘోషాల్ బర్త్ డే స్పెషల్ : ఆమె ప్రతి పాటలోనూ అందమైన ప్రతిబింబం కనిపిస్తుంది...
ప్రముఖ భారత గాయని శ్రేయా ఘోషాల్ పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్లో ఒక హిందూ కుటుంబంలో 1984లో మార్చి 12వ తేదీన జన్మించారు.
మన దేశంలోని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మరాఠీ, పంజాబీ, ఒరియా, అస్సామీ, బెంగాలీ, మళయాళంతో పాటు మరెన్నో భాషలలో శ్రేయా ఘోషల్ పాటలంటే ప్రతి ఒక్కరూ పరవశించిపోతారు. ఎందుకంటే ఆమె స్వరంలో అంత మాధుర్యం ఉంటుంది.

కోకిల సైతం ఆసూయపడేంత అద్భుతంగా ఆమె గానం అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె ఏ భాషలో పాట పాడినా.. ఆ ప్రాంతానికే చెందిన అమ్మాయేమో అనుకునేంత అద్వితీయంగా తన గానంతో శ్రోతలను మెప్పిస్తారు. ఆమెకు భాషభేదమెరుగని స్వరం ఆమె సొంతం. అందుకే ఆమె భాషలతో తేడా లేకుండా తేనెలూరే స్వరమాధుర్యంతో సినిమా, సంగీత ప్రియుల హృదయాల్లో ఆమె చెరగని ముద్ర వేసింది.
సంప్రదాయ పాటలైనా, పాశ్చాత్య పాటలైనా, ప్రేమ గీతాలైనా, విరహ పాటలైనా, అంతేకాదు ఐటమ్ సాంగ్స్ తో ఆమె ఏ పాట పాడినా ఆమె గొంతులో పడితే ఆణిముత్యాలై ఆహూతుల మదిని పులకరించాల్సిందే.. సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శ్రేయా ఘోషల్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆ గాయని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం....

శ్రేయా ఘోషాల్ జననం...
ప్రముఖ భారత గాయని శ్రేయా ఘోషాల్ పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్లో ఒక హిందూ కుటుంబంలో 1984లో మార్చి 12వ తేదీన జన్మించారు. ఆమె తండ్రి బిశ్వజీత్ ఘోషాల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (భారతీయ అణుధార్మిక శక్త్యుత్పాదక సంస్థ)లో ఇంజనీరుగా పని చేసేవారు. ఆమె తల్లి సర్ మిష్తా ఘోషాల్ సాహిత్యంలో పోస్ట్ - గ్రాడ్యూయేట్.

తొలి గురువు ఎవరంటే..
శ్రేయాఘోషాల్ తొలి గురువు తన తల్లే. తన నాలుగో ఏట నుండే తన తల్లి దగ్గర హర్మోనియం నేర్చుకోవడం మొదలుపెట్టింది. తర్వాత మహేష్ చంద్రవర్మ వద్ద హిందుస్థానీ సంగీతాన్ని నేర్చుకుంది.

చిన్నతనం నుంచే..
అలా చిన్నతనం నుంచే గాయనిగా ఎంతో ప్రతిభ చూపిన శ్రేయా ఘోషాల్ కెరీర్ 1996లో మలుపు తిరిగింది. ఆ ఏడాది ఓ ప్రైవేటు టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే ‘సరిగమప‘ పిల్లల పాటల కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా అందులో విజేతగా కూడా నిలిచింది. ఆమె ప్రతిభను చూసిన సినీ ప్రముఖులు ఆమెకు సంగీతంలో 18 నెలల పాటు శిక్షణ ఇచ్చారు.

దేవదాసుతో వెండితెరకు..
ప్రముఖ దర్శకుడు శ్రేయా ఘోషాల్ ను వెండితెరకు పరిచయం చేశారు. ఈ చిత్రంలో శ్రేయా ఘోషాల్ ఐదు పాటలను పాడటంతో పాటు కథానాయిక పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పింది. ఆ సినిమాలోని ‘‘బైరీ పియా..‘‘ అనే పాటకు ఆమెకు భారత జాతీయ చలన చిత్ర పురస్కారంతో పాటు ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిలింఫేర్ అవార్డును కూడా దక్కించుకుంది.

తెలుగులో మహేష్ పాటతో..
తొలి రోజుల్లో నేపథ్య గాయనిగా హిందీ ఇండస్ట్రీకే పరిమితమైన శ్రేయా ఘోషాల్.. తర్వాత దక్షిణ భారతదేశంలోనూ అడుగుపెట్టారు. మన తెలుగులో మహేష్ బాబు నటించిన ‘ఒక్కడు‘లో ‘నువ్వేం మాయ చేశావో గాని..‘‘ అనే పాటతో తెలుగు వెండితెరను తన స్వరంతో అందరినీ అద్భుతంగా ఆకట్టుకుంది.

ఎన్నో అవార్డులు..
అనేక భాషలలో తన గాన ప్రతిభ చూపిన శ్రేయా ఘోషాల్ ఇప్పటివరకు నాలుగు జాతీయ పురస్కారాలు, ఐదు ఉత్తరాది, నాలుగు దక్షిణాది ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకుంది.

2015లో వివాహం..
శ్రేయా ఘోషాల్ తన చిన్ననాటి స్నేహితుడు శైలాదిత్యను వివాహం చేసుకున్నారు. అయితే ఆమెకు తన భర్త అంటే ఎంతగానో ఇష్టమట. తన గురించి గొప్ప భర్త, కొడుకు, తమ్ముడు, అన్న, స్నేహితుడివి అంటూ ఓ సారి సోషల్ మీడియా వేదికంగా తనంటే ఎంత ప్రేమో చాటి చెప్పింది.

కళ్లు కాయలు కాసేలా..
ముఖ్యంగా రొమాంటిక్ పాటలతో కవ్వించాలంటే ప్రతి ఒక్కరి మదిలో మెదిలే తొలిపేరు శ్రేయా ఘోషాలే. అందుకే సినీ ప్రముఖులందరూ తమ సినిమాల్లో శ్రేయాతో ఒక్క పాటైనా పాడించుకోవాలని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటారు.
అనేక రకాలైన భాషలలో ఎన్నో గానాలతో అందరినీ అలరించిన.. అలరిస్తున్న స్వరమాధురి.. గాన గంధర్వ కోకిల అయిన శ్రేయా ఘోషాల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు..



Click it and Unblock the Notifications
