Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
Telangana CM KCR:చింతమడక నుండి ఛీఫ్ మినిస్టర్ వరకు కేసీఆర్ ప్రస్థానమిలా...
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) చేసిన పోరాటం మరువలేనిది. ఆ ఉద్యమ పోరాట ఫలితమే కేసీఆర్ ను ఆ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేలా చేసింది.
తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి... ''తెలంగాణ కోటి రతనాల వీణ'' ''నీళ్లు.. నిధులు.. నియామకాలు''తో పాటు తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా ఉంచి కొత్త రాష్ట్రం సాధించడంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) చేసిన పోరాటం మరువలేనిది.

ఆ ఉద్యమ పోరాట ఫలితమే కేసీఆర్ ను ఆ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేలా చేసింది. సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 17వ తేదీన 68 నుండి 69వ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్న సందర్భంగా చింతమడక నుండి చీఫ్ మినిస్టర్ వరకు ఆయన ప్రస్థానం ఎలా సాగింది... ఆయన ఎన్నెన్ని కష్టాలు అనుభవించారు.. ఏమేమీ సాధించారు అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

వరుసగా 2 సార్లు సీఎం...
కొత్త రాష్ట్రం తెలంగాణలో ముఖ్యమంత్రిగా వరుసగా రెండు సార్లు ఏకపక్షంగా విజయం సాధించి కేసీఆర్ చరిత్ర స్రుష్టించారు.

కేసీఆర్ జననం...
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 1954 సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు అప్పటి మెదక్ జిల్లా చింతమడక గ్రామంలో జన్మించారు. అదే గ్రామంలో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు.

సిద్ధిపేటలో ఉన్నత విద్య..
ఆ తర్వాత ఉన్నత విద్య నిమిత్తం సిద్ధిపేట చేరుకున్నాడు. సిద్ధిపేటలో డిగ్రీ కాలేజీలో చేరాడు. అక్కడే చరిత్ర, రాజనీతి శాస్త్రంలో డిగ్రీని పూర్తి చేశాడు. అయితే కేసీఆర్ కు తెలుగుపై చాలా పట్టు ఉంది. తెలంగాణ యాసలో ఆయన లాగా తెలుగు ఇప్పటికీ ఎవ్వరూ మాట్లాడలేరు. తన మాటలతో.. జోకులతో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాడు.

1969లో వివాహం..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చాలా చిన్న వయసులోనే వివాహం అయ్యింది. అది కూడా తన 15వ ఏటలోనే అంటే 1969లో శోభను వివాహం చేసుకున్నాడు. ఆయనకు కేటీఆర్, కవితలు జన్మించారు. వీరిద్దరూ కూడా టీఆర్ ఎస్ పార్టీలో చాలా కీలకంగా పని చేస్తున్నారు. కేటీఆర్ ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, మంత్రిగా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. అయితే కవిత మాత్రం నిజామాబాద్ నుండి పోటీ చేసి ఓడిపోయారు.

అప్పుడే రాజకీయాల్లోకి...
తన విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే కేసీఆర్ రాజకీయాల వైపు అడుగులు వేశారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడిగా పని చేశారు.

గురువులంటే గౌరవం...
తెలంగాణ సీఎం కేసీఆర్ కు చిన్నతనం నుండే తన గురువులు అంటే ఎంతో గౌరవం. అయితే తన రాజకీయ గురువుగా మాత్రం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మదన్ మోహన్ అని అందరూ చెబుతుంటారు. 1970 నుండి 1983 వరకు ఆయన దగ్గరే పని చేసినట్లు అందరూ చెబుతుంటారు.

అన్నగారి పార్టీలో..
1983లో నందమూరి తారక రామారావు పార్టీ ఏర్పాటు చేసిన వెంటనే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 1983లో తొలిసారిగా సిద్ధిపేట నుండి తన రాజకీయ గురువు మదన్ మోహన్ పై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి కేవలం 877 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ కేసీఆర్ ఓడిపోలేదు.

1985లో తొలిసారి ఎమ్మెల్యేగా..
1985 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మాత్రం సిద్ధిపేట నుండి కేసీఆర్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి శాసనసభ్యుడిగా శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1989, 1994, 1999 వరకు టీడీపీ నుండి కేసీఆర్ విజయం సాధించారు. ఆ తర్వాత టీఆర్ ఎస్ స్థాపించి ఆ పార్టీ నుండి ఉపఎన్నికలు.. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు.

చంద్రబాబు కేబినేట్ లో మంత్రిగా..
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినేట్ లో కేసీఆర్ రవాణ శాఖ మంత్రిగా పని చేశారు. 1997 నుండి 1999 వరకు కేసీఆర్ మంత్రిగా పని చేశారు.

మంత్రి పదవి రాలేదని...
1999 సంవత్సరంలో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. అయితే అప్పుడు కేసీఆర్ కు మంత్రి పదవి ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చాడు. ఈ కోపంతోనే కేసీఆర్ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. అయితే వీటన్నింటినీ కేసీఆర్ కొట్టిపారేశారు.

2001లో టీఆర్ ఎస్..
2001 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. అంతకుముందు టీడీపికి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక ఆటు పోట్లను ఎదుర్కొన్నాడు. అయినా ఆటంకాలన్నీ అధిగమిస్తూ పార్టీని ముందుకు నడిపాడు. ఈ క్రమంలోనే ఇతర పార్టీలతో కేసీఆర్ పొత్తులు కూడా పెట్టుకున్నాడు. చివరికి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగింది.

కేంద్ర మంత్రిగా..
2004లో టీడీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004లో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐలతో కలసి పోటీ చేసి గెలిచింది. అయితే టీఆర్ ఎస్ నుండి కేసీఆర్, నరేంద్రలు కేంద్ర మంత్రులుగా ఎంపీలుగా గెలిచారు. దీంతో వీరు యూపీఏ ప్రభుత్వంలో చేరారు. అప్పుడే కేసీఆర్ కు కేంద్ర మంత్రిగా అవకాశం లభించింది.

కాంగ్రెస్, కేసీఆర్ కు గ్యాప్...
2004-06 మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీకి, కేసీఆర్ కు మధ్య గ్యాప్ బాగా పెరిగింది. దీంతో ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. యూపీఏ నుండి కూడా బయటకు వచ్చారు. మళ్లీ ఉపఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించారు.

2009లో మహాకూటమి..
2009 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, టీఆర్ ఎస్, సీపీఐ, సీపీఎం మహాకూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. అయితే అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మళ్లీ విజయం సాధించింది. టీడీపీ ప్రతిపక్షానికే పరిమితమైంది.

ఆమరణ నిరాహార దీక్ష..
2009 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ సీఎం రాజశేఖరరెడ్డి సెప్టెంబర్ 2వ తేదీన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించాడు. ఆ తర్వాత అదే ఏడాది నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యాడు. ‘‘కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో‘‘ అన్న స్టాండ్ ను తీసుకున్నాడు. ఆయనను అరెస్టు చేసినా.. జైల్లోనే దీక్షను కొనసాగించాడు. ఆ తర్వాత ఖమ్మం ఆసుపత్రికి తరలించినా అక్కడ కూడా దీక్షను కొనసాగించాడు.

డిసెంబర్ 9వ తేదీన..
దీంతో దిగి వచ్చిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని ప్రకటించింది. అప్పుడు కేసీఆర్ నిమ్స్ లో దీక్షను విరమించారు.

2014లో తెలంగాణ బిల్లు...
ఎట్టకేలకు 2014 పార్లమెంటు చివరి సమావేశాల్లో తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపింది. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఒంటరిగా పోటీ చేసి గెలిచింది. కాంగ్రెస్ 21, టిడిపి 15 స్థానాలకే పరిమితం అయ్యాయి.

ముందస్తు ఎన్నికలకు..
అయితే రెండోసారి మాత్రం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాడు. నిర్ణీత షెడ్యూల్ కంటే కొన్ని నెలల ముందే 2018లో డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చాడు.
1985 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మాత్రం సిద్ధిపేట నుండి కేసీఆర్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి శాసనసభ్యుడిగా శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1989, 1994, 1999 వరకు టీడీపీ నుండి కేసీఆర్ విజయం సాధించారు. ఆ తర్వాత టీఆర్ ఎస్ స్థాపించి ఆ పార్టీ నుండి ఉపఎన్నికలు.. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డు నెలకొల్పారు. అంతేకాదు 2018 సంవత్సరంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి.. తిరుగులేని మెజార్టీ సాధించి, రెండోసారి కూడా విజయవంతంగా ముఖ్యమంత్రిగా పాలన చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 1954 సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు అప్పటి మెదక్ జిల్లా చింతమడక గ్రామంలో జన్మించారు. అదే గ్రామంలో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు.ఆ తర్వాత ఉన్నత విద్య నిమిత్తం సిద్ధిపేట చేరుకున్నాడు. సిద్ధిపేటలో డిగ్రీ కాలేజీలో చేరాడు. అక్కడే చరిత్ర, రాజనీతి శాస్త్రంలో డిగ్రీని పూర్తి చేశాడు. అయితే కేసీఆర్ కు తెలుగుపై చాలా పట్టు ఉంది. తెలంగాణ యాసలో ఆయన లాగా తెలుగు ఇప్పటికీ ఎవ్వరూ మాట్లాడలేరు. తన మాటలతో.. జోకులతో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాడు.



Click it and Unblock the Notifications











