Latest Updates
-
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా..
International Mother Language Day: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం దీని వెనక కన్నీళ్లు పెట్టించే చరిత్ర
ప్రపంచ మాతృభాష దినోత్సవాన్ని 1999 నవంబర్ 17వ తేదీ నాడు ప్రకటించింది. తదుపరి ఏడాది అంటే 2000 ఫిబ్రవరి 21వ తేదీ నుండి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభమైంది.
మనిషి తన భావాలను, ఆలోచనలు, భావోద్వేగాలను వ్యక్తపరిచే సాధనమే భాష. మనిషి తన జీవితంలో మొదట నేర్చుకునే భాషను మాతృభాష అంటారు. తల్లి తన బిడ్డకు ఏ భాషలో తొలి పలుకులు నేర్పిస్తుందో అదే మాతృభాష. ఎవరికైనా మాతృభాషలో ఏదైనా విషయాన్ని త్వరగా, కచ్చితంగా, మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. అందుకే మాతృభాషను విడిచి ఇతర భాషల వెంట పడటం మానుకోవాలని అంటారు. జీవితంలో పైకి ఎదగాలంటే ఇతర భాషలను నేర్చుకోక తప్పదు. భాషతోనే సంస్కృతి, సాంప్రదాయాలు ముడిపడి ఉంటాయి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటాం. మాతృభాష, సాంస్కృతిక వైవిధ్యంపై అవగాహన పెంపొందించడం, బహు భాషావాదాన్ని ప్రోత్సహించడమే దీని ప్రధాన ఉద్దేశం.

ప్రపంచ మాతృభాషా దినోత్సవం:
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించిన యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్- యునెస్కో.. ప్రపంచ మాతృభాష దినోత్సవాన్ని 1999 నవంబర్ 17వ తేదీ నాడు ప్రకటించింది. తదుపరి ఏడాది అంటే 2000 ఫిబ్రవరి 21వ తేదీ నుండి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభమైంది.

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం చరిత్ర:
విభజన తర్వాత బంగ్లాదేశ్ ను తూర్పు పాకిస్థాన్ గా పిలిచేవారి. పాకిస్థాన్ లో ఎక్కువ మంది ఉర్దూ మాట్లాడేవారు వారి మాతృభాష ఉర్దూ. కానీ తూర్పు పాకిస్థాన్ లో ఎక్కువ మంది బెంగాలీ మాట్లాడేవారు. వారి మాతృభాష బెంగాలీ. కానీ భారత దేశ విభజన తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం తూర్పు పాకిస్థాన్ పై వివక్ష చూపించింది. అక్కడి ప్రజలు మాట్లాడే భాషకు సరైన గుర్తింపు ఇవ్వలేదు. ప్రభుత్వ భాష ఉర్దూగా మారిపోయింది. బలవంతంగా ఉర్దూను రుద్దే ప్రయత్నం జరిగింది. దీంతో తూర్పు పాకిస్థాన్ లోని ప్రజలు తిరగబడ్డారు. తమ మాతృభాషను కాపాడుకునేందుకు ఉద్యమించారు.
సాధారణ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, అధ్యాపకులు ఉద్యమం చేశారు. 1952 నుండి నాలుగేళ్ల పాటు ఈ పోరు ఉద్ధృతంగా సాగింది. ఈ ఉద్యమాన్ని అణచి వేసేందుకు పాక్ ప్రభుత్వం బల ప్రయోగం చేసింది. ఫిబ్రవరి 21న పోలీసులుతో కాల్పులు జరిపించింది. ఇందులో నెత్తురు ఏరులై పారింది. మాతృభాష పరిరక్షణ కోసం ఉద్యమించిన వారిలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
చివరికి దిగివచ్చిన పాక్ సర్కారు.. 1956లో బెంగాలీ, ఉర్దూ భాషలను అధికార భాషలుగా గుర్తించింది. తర్వాత యునెస్కో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని నిర్వహించాలని ఆలోచిస్తున్నప్పుడు ఫిబ్రవరి 21న జరపాలన్న బంగ్లాదేశ్ అభ్యర్థనను అన్ని దేశాలు ఆహ్వానించాయి. అలా ఫిబ్రవరి 21వ తేదీన మాతృభాష దినోత్సవం జరుపుకుంటాం.

మాతృభాష దినోత్సవం రోజు సెలవు:
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం రోజు బంగ్లాదేశ్ లో అధికారిక సెలవు దినం. ఈ రోజు మాతృభాష కోసం ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకుంటారు. మాతృభాషను ప్రోత్సహించడానికి, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడటానికి ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

అంతర్జాతీయ మాతృభాషా స్మారక చిహ్నం:
తూర్పు పాకిస్థాన్ లో మాతృభాష కోసం చేసిన ప్రాణత్యాగాన్ని గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. వారికి నివాళిగా సిడ్నీలోని యాష్‌ఫీల్డ్ పార్క్‌లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ స్మారక చిహ్నాన్ని నిర్మించింది.

అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం థీమ్:
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం 2023 థీమ్ ను యూఎన్ "మల్టిలింగ్వల్ ఎడ్యుకేషన్ - ఏ నెసెసిటీ టూ ట్రాన్స్‌ఫామ్ ఎడ్యుకేషన్" గా ప్రకటించింది.



Click it and Unblock the Notifications
