Latest Updates
-
నాటు శైలిలో ఘాటుగా 'రొయ్య పొట్టు చారు'.. పల్లెటూరి రుచుల మజానే వేరు.! -
ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టపడ్డారు..పెళ్లి చేసుకున్నారు..7 నెలలకే స్కూల్ టైతో భర్త గొంతు నులిమి.. -
మెంతులు ఆరోగ్యానికి మంచిదే కాదు... ఈ వ్యాధులు ఉన్నవారికి ముప్పూ తేవచ్చు! -
నానమ్మల కాలం నాటి నల్చిన కారం..చికెన్, మటన్ కూడా పోటికి రావు..రోలు, మిక్సీ కూడా అక్కర్లేదు చేత్తోనే.. -
బాబా వంగా అంచనా..అక్టోబర్ 5వ తేదీ నుంచి ఆ 5 రాశుల వారికి రాజయోగం పక్కా! -
తిండి ఆలస్యమైందని దండన.. జొమాటో డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వైరల్ వీడియో.! -
ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఉలవల కారం పొడి..ఒక్కసారి చేస్తే నెల రోజులు నిల్వ..ఇడ్లీ, వేడి అన్నంలోకి బెస్ట్ -
కోడిగుడ్లతో రొటీన్ కూరలు బోర్.. ఈ 'ఎగ్ బటర్ మసాలా' తప్పక ట్రై చేయండి! -
చంద్ర, కేతు సంయోగంతో సింహ రాశిలో గ్రహణం.. చిక్కుల్లో పడబోయే రాశులు ఇవే.! -
ఫ్రిజ్‌లో ఏ కూరగాయ ఎంత కాలం నిల్వ ఉంటుంది?.. సరైన స్టోరేజ్ పద్ధతులు ఇవే!
Kaikala Satyanarayana: కైకాల ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేసినా, ఆ లోటు మాత్రం ఉండిపోయింది
కైకాల నటనా ప్రతిభను గుర్తించి ఎన్నో అవార్డులు ఇచ్చారు. నంది అవార్డులు, బిరుదులు వచ్చాయి. కానీ ఆ ఒక్కటి మాత్రం ఆయనకు రాలేదు.
Life
oi-Pavan Ch
By Pavan Ch
ప్రముఖ నటుడు, మాజీ పార్లమెంటేరియన్, ఎన్నో అద్భుత పాత్రలు చేసి అన్నింటిలోనూ జీవించేసిన కైకాల సత్యనారాయణ ఈరోజు తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ప్రాణాలు కోల్పోయారు. కైకాల సత్యనారాయణ 6 దశాబ్దాల తన సినీ కెరీర్‌లో 777కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన చివరగగా 2019లో వచ్చిన మహర్షి ేేచిత్రంలో కనిపించారు.

కైకాల నటనా ప్రతిభను గుర్తించి ఎన్నో అవార్డులు ఇచ్చారు. నంది అవార్డులు, బిరుదులు వచ్చాయి. కానీ ఆ ఒక్కటి మాత్రం ఆయనకు రాలేదు. ఇన్ని సినిమాలు చేసి ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ ఆ ఒక్క అవార్డు రాకపోవడంపై కైకాల చాలా సార్లు బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. కైకాల సత్యనారాయణ గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
- కైకాల సత్యనారాయణ 1935 జులై 25న కృష్ణా జిల్లా కవుటారంలో జన్మించారు.
- కైకాల సత్యనారాయణకు 1960లో నాగేశ్వరమ్మతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తెలు.
- 1959లో కైకాలను మొదటిసారిగా DL నారాయణ గుర్తించారు. ఆ తర్వాత చంగయ్య దర్శకత్వం వహించిన తన మొదటి చిత్రం సిపాయి కూతురులో కైకాలకు ఒక పాత్రను ఇచ్చారు. కానీ ఈ సినిమా అంతగా ఆడలేదు.

- ఎన్టీ రామారావుకు చాలా సినిమాల్లో డూప్‌గా నటించారు కైకాల.
- 1960లో అపూర్వ సహస్ర శిరచ్చేద చింతామణిలో నటించే అవకాశాన్ని కైకాలకు ఇచ్చారు ఎన్టీఆర్. ఈ చిత్రానికి SD లాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కైకాల రాజకుమారుడి పాత్రలో కనిపిస్తారు.
- బి. విఠలాచార్య దర్శకత్వం వహించిన కనకదుర్గా పూజా మహిమ చిత్రంలో నెగటివ్ పాత్రలో కనిపించారు.
- తర్వాత కాలంలో విలన్ పాత్రలు ఎక్కువగా చేశారు కైకాల.

- కైకాల సత్యనారాయణకు Rama అనే ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. ఈ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ నుండి కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు లాంటి సినిమాలను తెరకెక్కించారు కైకాల.
- 1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు కైకాల సత్యనారాయణ. మచిలీపట్నం నుండి టీడీపీ పార్టీ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు.
- 2012లో 59వ జాతీయ సినీ అవార్డు దక్షిణాది చిత్రాల జ్యూరీ మెంబర్‌గా పని చేశారు.
- కైకాల సత్యనారాయణ అనేక ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. కైకాలకు 2017లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు వరించింది.

- 1994లో వచ్చిన బంగారు కుటుంబం అనే సినిమాకు కైకాలకు నంది అవార్డు వచ్చింది.
- 2011లో వచ్చిన రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు.
- నటశేఖర, కళాప్రపూర్ణ, నవరస నటనా సార్వభౌమ అనే బిరుదులు ఉన్నాయి.
- ఎన్నో సినిమాల్లో నటించినా, సినీ రంగానికి ఎన్నో సేవలు చేసినప్పటికీ కైకాలకు పద్మ అవార్డు రాలేదు. ఈ అవార్డు రాకపోవడంపై కైకాల పలు సందర్భాల్లో తన అంసతృప్తిని వ్యక్తం చేశారు కూడా.
Comments
English summary



Click it and Unblock the Notifications
