Latest Updates
-
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.!
Aditi Ashok:200 నుండి 2వ ప్లేసులోకొచ్చింది... గోల్ఫ్ లో గోల్డ్ మెడల్ కొట్టేస్తానంటోంది...!
అదితి అశోక్ ఎవరు? గోల్ఫ్ ఛాంపియన్ అయిన ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్కడ 200వ స్థానం.. ఎక్కడ 2వ స్థానం.. మనం కాగితంపై చూసినా కూడా చాలా దూరం కనిపిస్తుంది. అలాంటి గోల్ఫ్ గేమ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి భారతీయ మహిళ అదితి అశోక్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.

గోల్ఫ్ ర్యాంకింగ్స్ లో 200వ స్థానం నుండి రెండో స్థానానికి ఎగబాకింది. అంతేకాదు టోక్యో ఒలింపిక్స్ 2020లో తన పేరిట ఓ పతకం కూడా కన్ఫార్మ్ చేసుకుంది.

ఇక మన దేశం తరపున గోల్ఫ్ లో మెడల్ సాధించిన తొలి మహిళగా రికార్డు నెలకొల్పనుంది. ఈ సందర్భంగా గోల్ఫ్ ప్లేయర్ అదితి అశోక్ ఎవరు? ఆమె డెస్టినీ ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

5 ఏళ్ల వయసులోనే..
అదితి అశోక్ పుట్టింది బెంగళూరు నగరంలో. ఈమె తండ్రి పేరు గుడ్లమాని అశోక్.. తల్లి పేరు మహేశ్వరి. ఈమె అనుకోకుండా అయిదేళ్ల వయసులోనే గోల్ఫ్ క్రీడ పట్ల ఆకర్షితురాలైంది. గోల్ఫ్ అంటే ఏంటో తెలియని సాధారణ మధ్య తరగతి కుటుంబం వీరిది. ముందు తనను సరదాగానే ప్రోత్సహించినా.. తను మాత్రం గోల్ఫ్ నే కెరీర్ గా ఎంచుకుంది.

ఇల్లు తాకట్టు..
గోల్ఫ్ క్రీడ చాలా ఖరీదైనది. ఆటలో తన కూతురుకు ఉన్న ఆసక్తిని గమనించిన అతని తండ్రి కూతురి కోసం తన ఇంటిని కూడా తాకట్టు పెట్టేశాడు. తనే క్యాడీగా ఆమె వెంట ఉండేవాడు.(క్యాడీ అంటే ప్లేయర్ వెంట ఉంటూ బ్యాగులు, ఇతర పనులు చేసే వ్యక్తి).

తల్లి సైతం..
అదితి తల్లి మహేశ్వరి సైతం తన కూతురి క్యాడీగా మారిపోయింది. వాస్తవానికి ఆమె కెరీర్ మీద ఎక్కువ శ్రద్ధ చూపించింది తల్లే. రియో ఒలింపిక్స్ తర్వాత కూడా అదితి కొన్ని అద్భుతమైన విజయాలు సాధించింది. కానీ మన దేశంలో ఈ గోల్ఫ్ గేమ్ పై ఎవ్వరికీ పెద్దగా ఆసక్తి లేకపోవడంతో.. ఎవ్వరూ తనపై పెద్దగా ఆసక్తి చూపలేదు. పైగా మీడియా, అధికారులు సైతం ఆమెను లైట్ గా తీసుకున్నారు. అందుకే అదితిని ఎవ్వరూ పట్టించుకోలేదు.

అందరి చూపు..
అయితే ఒలింపిక్స్ లో మనోళ్లందరి చూపు వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, హాకీ మీద పెరిగింది. అయితే అదితి అశోక్ సడెన్ గా 200 ర్యాంకు నుండి రెండో ర్యాంకుకు వచ్చి చేరింది. దీంతో ఈ గేమ్ లో ఓ పతకం వస్తుందని అందరికీ తెలిసిపోయింది. అంతే అందరి చూపు ఒక్కసారిగా అదితి వైపు పడింది. దీంతో అందరూ అదితికి ఆల్ ది బెస్ట్ చెప్పడం స్టార్ట్ చేశారు. ఇక కన్నడిగులు అయితే..
నమ్మ బెంగళూరు.. నమ్మ ఇండియా.. నమ్మ అదితి అంటూ తనను ఆకాశానికెత్తేస్తున్నారు.

ప్రధాని మోడీ ప్రశంసలు..
అదితి సాధించిన విజయం దేశానికే గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రశంసలు కురిపించారు. ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు కూడా అదితి అశోక్ కు అభినందనలు తెలుపుతున్నారు. 23 సంవత్సరాల వయసులోనే ఇంతటి గొప్ప విజయం సాధించినందుకు తమకెంతో సంతోషంగా ఉందని నెటిజన్లు అంటున్నారు.

అదితి గురించి ఆసక్తికరమైన విషయాలు..
* అదితి అశోక్ 18 ఏళ్ల వయసులో 2016 రియో గేమ్స్ లో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కురాలు.
* తను ఐదేళ్ల వయసులో గోల్ఫ్ ఆట పట్ల ఆకర్షితురాలైంది. ఓ రోజు రెస్టారెంట్లో కిటికీలో నుండి గోల్ప్ క్రీడాకారులను చూసిన తర్వాత తను ఈ ఆట గురించి తెలుసుకుంది.
* ఆసియా యూత్ గేమ్స్ (2013), యూత్ ఒలింపిక్ గేమ్స్ (2014), ఏషియాన్ గేమ్స్ (2014)తో పాటు ఒలింపిక్స్ లో పాల్గొన్న మొట్టమొదటి భారతీయ మహిళా గోల్ఫర్ అదితి.
* లల్లా ఐచా టూర్ స్కూల్ టైటిల్ గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలు ఈమె. ఈ విజయంతో తను యూరోపియన్ టూర్ కార్డుకు టిక్కెట్ సంపాదించింది.
* మహిళల ఇండియన్ ఓపెన్లో విజయం సాధించిన తర్వాత లేడీస్ యూరోపియన్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలు కూడా అదితినే.
*2017లో తొలి ఇండియన్ లేడీస్ ప్రొఫెషనల్ గోల్ఫ్ అసొసియేషన్ (LPGA)క్రీడాకారిణిగా నిలిచారు. లూయిస్ సగ్స్ రూకీ ఆఫ్ ది ఇయర్ స్టాండింగ్ లో తనకు 8వ స్థానం దక్కింది.
* రోరే మెక్ ల్రాయ్, యూరోపియన్ టూర్లో 14 టైటిల్స్ మరియు 2PGA ఛాంపియన్ అంటే అదితికి ఇష్టమట.
All Images Aditi's Wall



Click it and Unblock the Notifications