Latest Updates
-
ఒంట్లో వేడిని తగ్గించే, ఇమ్యూనిటీ పెంచే సూపర్ టేస్టీ చిన్న ఉల్లిపాయల సాంబార్.. -
ప్రెగ్నెన్సీ ప్రయత్నాల్లో ఉన్నారా.. పీరియడ్స్‌లో ఈ మార్పులను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
Viral Video: సాఫ్ట్ వేర్ జాబ్ దండగ..ఈ ఐడియా సూపర్!..పెట్టుబడి లేకుండా 3 గంటల పనితో నెలకు రూ. 70 వేల ఆదాయం -
పూజలో ఉపయోగించే ఐదు దీపాల అర్థం ఏమిటి? -
నెలకు రూ.2.8 లక్షల జీతం..పని ఏంటంటే ఇతరుల తరపున 'బ్రేకప్' చెప్పడమే! -
ప్రొటీన్ పవర్.. అదిరిపోయే ఫ్లేవర్..అఫ్ఘానీ సోయా కర్రీ తయారీ విధానం ఇదే.. -
ఏం తిన్నా పొట్ట ఉబ్బరంగా అనిపిస్తోందా? అసలు కారణం ఫుడ్ కాదు.. -
చేపల కూర అంటే ఇలా ఉండాలి భయ్యా.. ఘుమఘుమలాడే బిహారీ స్టైల్ ఫిష్ కర్రీ! -
సాధారణ నొప్పులే కదా అని లైట్ తీసుకుంటున్నారా? క్యాన్సర్ ముప్పు కావచ్చు! -
భార్యతో రోజూ గొడవనా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే హ్యాపీగా ఉంటారు!
గాంధీజీ హత్యకు సంబంధించి ఇప్పటికీ వీడని మిస్టరీ...!
ఈ ప్రశ్న దాదాపు 71 సంవత్సరాల తరువాత రావడం గమనార్హం. ఈ కేసు దర్యాప్తు తిరిగి ప్రారంభించడానికి ప్రధాన కారణం ఏంటంటే.. గాంధీజీ హత్యలో రెండో వ్యక్తి ఎవరు? అనే విషయంపై అన్వేషణ ప్రారంభమైందట.
బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఆయుధం పట్టకుండా కేవలం అహింస అనే ఆయుధంతోనే గడగడలాడించాడు గాంధీజీ. ఆయన సత్యాగ్రహ సిద్ధాంతం అహింస యోధుల్ని తయారు చేసింది. సత్యం, అహింస మార్గంలోనే రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరు గాంచిన బ్రిటీష్ వారి కోటలను బద్ధలుకొట్టారు.

అంతేకాదు భారతదేశానికి బ్రిటీష్ పాలకుల నుండి విముక్తి కల్పించడంలో కీలక పాత్ర పోషించిన మహానేత గాంధీ. అహింసతోనే జీవితాంతం జీవించాలని కోరుకున్న మహాత్మ గాంధీ జీవితం మాత్రం హింసతోనే ముగిసింది. గాంధీజీ గాడ్సే చేతిలో హత్యకు గురయ్యాడు. అయితే గాంధీజీ హత్యలో కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అవి ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీలుగానే మిగిలిపోయాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం...

ఆ రోజు సాయంత్రం..!
గాంధీజీ 1948, జనవరి 30వ తేదీన సాయంత్రం సమయంలో బిర్లా హౌస్ ప్రాంగణం నుండి ప్రార్థనా స్థలానికి వెళ్తున్నాడు. అత్యధిక సంఖ్యలో గాంధీజీ కోసం అక్కడికి చాలా మంది చేరుకున్నారు.సరిగ్గా అదే సమయంలో నాథూరామ్ వినాయక్ గాడ్సే గాంధీజీని హత్య చేశాడు. అంతే గాంధీజీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

నాలుగో బుల్లెట్!
మహాత్మ గాంధీజీని నాథూరామ్ గాడ్సే తన తుపాకి నుండి మూడు బుల్లెట్లు ఉపయోగించాడని చాలా మంది చెబుతున్నారు. అయితే గాంధీజీ శరీరం నుండి నాలుగో బుల్లెట్ కూడా బయటికి వచ్చినట్లు అతి కొద్ది మందికే తెలుసు. మరి ఆ నాలుగో బుల్లెట్ ఎక్కడిది?

గాడ్సే ఒక్కడే కాదు..!
గాంధీజీ హత్య పథకంలో గాడ్సే ఒక్కడే కాదు. ఇంకా ఎవరో ఉన్నారని పరిశోధకులు అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే గాడ్సే తుపాకి నుండి కేవలం మూడు బుల్లెట్లే బయటికి వచ్చిన విషయాన్ని వారు ధ్రువీకరించారు. అయితే గాంధీ శరీరంలో నాలుగు బుల్లెట్లు ఉన్నట్లు అనుమానాలు రావడంతో వారు కేసును తిరిగి ప్రారంభించారు.

రెండో వ్యక్తి ఎవరు?
అయితే ఈ ప్రశ్న దాదాపు 70 సంవత్సరాల తరువాత రావడం గమనార్హం. ఈ కేసు దర్యాప్తు తిరిగి ప్రారంభించడానికి ప్రధాన కారణం ఏంటంటే.. గాంధీజీ హత్యలో రెండో వ్యక్తి ఎవరు? అనే విషయంపై అన్వేషణ ప్రారంభమైందట. అయితే అతను కూడా కచ్చితగా సజీవంగా ఉండే అవకాశం లేదు.

రివ్యూ..!
పంకజ్ అభినవ్ భారత్ సంస్థ సహ వ్యవస్థపాకుడు మరియు విశ్లేషకుడు. గాంధీజీ శరీరం నుండి నాలుగో బుల్లెట్ గుర్తించింది ఈయన అంట. అయితే మరి కొందరు గాంధీజీని అస్సలు తుపాకీతో కాల్చలేదని వాదిస్తున్నారు. అందుకు ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ హత్యలో కుట్ర ఉందని చెబుతున్నారు.

ఆధారాలు ఇవేనా?
గాంధీజీ శరీరంలో నాలుగు బుల్లెట్లు దూసుకెళ్లి, అతను మరణించినట్లు కొన్ని వార్తాపత్రికల వద్ద ఆధారాలు బలంగా ఉన్నాయి. మరో సాక్ష్యం ఏమిటంటే గాంధీ బుల్లెట్ మరణానికి ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారంట.

ప్రజల సాక్ష్యం..!
70 సంవత్సరాల తర్వాత ఈ విషయం బయటికి రావడంతో ఇది కొంత వివాదస్పదంగా మారింది. ఇదే నిజమని పంకజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే గాడ్సే గాంధీని మూడుసార్లు కాల్చాడని అనుమానం వ్యక్తం చేశారు. అయితే నాలుగో బుల్లెట్ గాంధీ శరీరంలోకి ఎలా వచ్చింది. ఆ రెండో వ్యక్తి ఎవరు అనే ప్రశ్న ఇంతవరకు బయటకు రాలేదు.

ఆత్మహత్య!
గాంధీజీని మూడు సార్లు కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సే నాలుగోసారి తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడని ది గార్డియన్ జనవరి 31, 1948న నివేదించింది. అయితే ఇదంతా నిజం కాదని మరి కొందరు చెప్పారు.

పై భాగంలో!
గాంధీజీ దగ్గరి బంధువు, మేనకోడలు వరుస అయిన మనుబెన్ గాంధీ రాసిన డైరీలో మూడు బుల్లెట్ల గురించి పంకజ్ వివరణ అనంతరం ఆమె తన డైరీలో ఇలా వివరించారు. గాంధీ కాల్పుల తర్వాత అతని అంత్యక్రియలకు స్నానం చేయడానికి భౌతికకాయం ఇచ్చినప్పుడు అతని పైభాగంలో బుల్లెట్ చిక్కుకున్నట్లు చెప్పారు.

ఆ బుల్లెట్ ఎక్కడిది?
అయితే గాంధీజీ శరీరంలోకి నాలుగో బుల్లెట్ ఎక్కడి నుండి వచ్చింది. ఎవరు కాల్చారు? నాలుగు బుల్లెట్లు అని ఎందుకు లెక్కించబడింది? అనే అంశాలతో పాటు ఈ హత్య కేసులో చాలా ప్రశ్నలు తలెత్తాయి. అయినా ఇంత పెద్ద కుట్ర జరుగుతోందని, నెహ్రూ ప్రభుత్వం గాంధీజీకి తగిన రక్షణ ఎందుకు కల్పించలేకపోయింది? దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఏమైనా ఉందా? అనే ప్రశ్నలకు ఇంతవరకు సమాధానమే దొరకలేదు.



Click it and Unblock the Notifications