Latest Updates
-
ఎండల దెబ్బకు పీసీఓఎస్, పీరియడ్స్ సమస్యలు పెరుగుతున్నాయా? ఈ జాగ్రత్తలు మీకోసమే! -
ఎండల మంటల్లో పెళ్లిళ్లు.. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఈ మార్పులు తప్పనిసరి! -
జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా? -
సూరత్‌లో దారుణం: భార్యను సిమెంట్ బాక్సులో దాచిన భర్త.. బంధాల్లో ఈ 'రెడ్ ఫ్లాగ్స్' కనిపిస్తే జాగ్రత్త! -
షుగర్ ఫ్రీ పుదీనా లస్సీ.. వేసవిలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం! -
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే! -
NEET UG 2026 అడ్మిట్ కార్డులు వచ్చేసాయి.. పరీక్షలో విజయం సాధించాలంటే ఈ చివరి నిమిషం జాగ్రత్తలు తప్పనిసరి! -
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది!
World Radio Day 2022:వరల్డ్ రేడియో డే ఎప్పుడు.. ఎందుకు జరుపుకుంటారంటే...
ప్రపంచ రేడియో దినోత్సవ తేదీ, చరిత్ర, థీమ్, ప్రాముఖ్యత మరియు ఈ దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. అంతేకాదు అందులో చాలా మందికి ఇంటర్నెట్ కూడా అందుబాటులో ఉంది. ఈ జనరేషన్లో ఇంటర్నెట్ అందరికీ అతి చవకగా దొరకడంతో ప్రతి ఒక్కరూ తమ టీవీలకు, ఓటీటీల కనెక్షన్లు తీసుకుని ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇప్పటితరం వారు ఒక్క క్షణం ఇంటర్నెట్ లేకున్నా అల్లాడిపోతారు. అలాంటిది ఒకప్పుడు ఇవేవీ అందుబాటులో ఉండేవి కావు. అయితే ఇవేవీ లేని రోజుల్లో ఎంటర్ టైన్మెంట్ ఎలా దొరికేదో తెలుసా..అప్పట్లో టీవీలు, ఓటీటీలు, ఇంటర్నెట్లు ఏవీ ఉండకపోయినా, ఆ కాలం వారు అద్భుతంగా కాలక్షేపం చేసేవారు.

అదెలాగంటే రేడియో ద్వారా. ఒకప్పుడు కేవలం రేడియో మాత్రమే వినోదాన్ని అందించిన ఏకైక సాధనంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల మన్ననలను చూరగొంది. అంతేకాదు రేడియో ద్వారా అప్పట్లో ఎన్నో సంచలనాలను ప్రారంభమయ్యాయి.

ముఖ్యంగా మన దేశంలో స్వాతంత్య్ర పోరాటంలో గోవా ప్రాంతంలో, పలు ప్రజా ఉద్యమాల్లో రేడియో అందరికీ మరింత చేరువైంది. ఈ సందర్భంగా రేడియో గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

అతి తక్కువ కాలంలోనే...
తర్వాత ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళల్లో అనేక రకాల భాషల్లో వార్తలను ప్రసారం చేస్తూ.. పాటలు, జానపద గీతాలు, శాస్త్రీయ-లలిత సంగీతం, వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు, క్విజ్, కథానిక, సినిమాలకు సంబంధించిన ఆడియోలన్నింటినీ ప్రసారం చేసిన రేడియో అందరికీ అతి తక్కువ కాలంలోనే చేరువైపోయింది. కొన్నేళ్ల క్రితం చిన్నపిల్లల నుండి పెద్దలు, పండు ముసలివాళ్ల వరకు అందరూ రేడియోకు బాగా కనెక్ట్ అయ్యారు.

రేడియోను తొలిసారిగా..
అందరినీ ఎంతగానో ఆకట్టుకున్న రేడియోను ఆంగ్లేయులు భారతదేశంలోని మహారాష్ట్రలోని ముంబైలో తొలిసారిగా ప్రారంభించారు. అందరి కంటే ముందు 1886 సంవత్సరంలో హెన్రిచ్ హెర్ట్జ్ అనే శాస్త్రవేత్త రేడియో తరంగాలను కనుగొన్నారు. ఆ తర్వాత మార్కోనీ రేడియోను కనిపెట్టారు. అనంతరం 2012 సంవత్సరంలో ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం చేయడం వల్ల రేడియో డేను ప్రపంచ వ్యాప్తంగా యునెస్కో(UNESCO) సభ్యత్వమున్న అన్ని దేశాల్లో ‘వరల్డ్ రేడియో డే'ను అధికారికంగా నిర్వహిస్తున్నారు.

భిన్నమైన కార్యక్రమాలు..
వరల్డ్ రేడియో డే సందర్భంగా ప్రతి ఏటా సెమినార్లు, చర్చలు, రేడియో చరిత్ర, వైభవం, ప్రస్థానం వంటి ప్రత్యేకమైన కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. Seeking Modern Applications for Real Transformation(SMART) భాగస్వామ్యంతో మన దేశంలో రేడియో డేను నిర్వహిస్తున్నారు. ఇందుకు ఆలిండియా రేడియో సహకారం కూడా అందిస్తోంది. గత ఏడాది గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 215 రేడియో స్టేషన్లు ఉన్నాయి. ప్రతి ఏటా రేడియో డే సందర్భంగా ఫిబ్రవరి 13, 14వ తేదీల్లో అంటే రెండురోజుల పాటు ‘న్యూ వరల్డ్, న్యూ రేడియో' థీమ్ తో భారీగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

మంచి పాపులారిటీ..
ఒకప్పుడు ఓ ఊపు ఊపిన రేడియో ఇప్పుడు ఇంటర్నెట్, ఇతర టెక్నాలజీ కారణంగా మూలన పడుతూ వచ్చింది. అయితే ఇప్పటికీ దీన్ని చిన్న చిన్న పల్లెటూళ్లలో ఆస్వాదించడాన్ని మనం చూస్తు ఉంటాం. రేడియో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్' కారణంగా ఆలిండియా రేడియోకు మంచి పాపులారిటీ వచ్చింది. అంతేకాదు సోషల్ మీడియా ద్వారా కూడా రేడియోకు ప్రాధాన్యత పెరుగుతోంది.

ప్రత్యేక థీమ్ లతో..
ప్రతి సంవత్సరం వరల్డ్ రేడియో డేని ప్రత్యేక థీమ్ లతో నిర్వహిస్తుంటారు. గత ఏడాది కూడా మూడు ప్రత్యేక థీమ్ ‘ఎవల్యూషన్, ఇన్నోవేషన్, కనెక్షన్ పేరుతో వీటిని నిర్వహించారు. దీని వెనుక ఉన్న ఆంతర్యం అత్యధిక ప్రజలు రేడియోను మరింత ఎక్కువగా ఉపయోగించేలా చేయడమే. ఇప్పటికీ అత్యంత ఎక్కువ మందికి సమాచారాన్ని చేసే అత్యంత ఉత్తమమైన సాధనం రేడియోనే అని యునెస్కో తేల్చింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుమూలల దీనికి రీచ్ ఉన్నది. దీన్ని ఎప్పుడైనా.. ఎక్కడైనా సులభంగా వినొచ్చు. దీన్ని మన వెంట తీసుకెల్లొచ్చు. అంతేకాదు ఇది స్మార్ట్ ఫోన్ తో పాటు చిన్న ఫోన్లలో కూడా అందుబాటులో ఉంటుంది. ఎఫ్ఎం వచ్చాక రేడియోకు మళ్లీ పూర్వ వైభవం వచ్చింది.
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో 13వ తేదీన ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ఆంగ్లేయులు మన భారతదేశంలో తొలి రేడియో స్టేషన్ ను మహారాష్ట్ర రాజధాని ముంబైలో ప్రారంభించారు.



Click it and Unblock the Notifications