Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్‌తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
2023 లో 15 లాంగ్ వీకెండ్స్.. ఇప్పుడే ట్రిప్స్ ప్లాన్ చేసేసుకోండి
2023లో ఒకటి లేదా రెండు రోజులు లీవ్ తీసుకుంటే చాలా లాంగ్ వీకెండ్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేయవచ్చు. 2023లో దాదాపు 15 లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పనిలో ఒత్తిడి, వ్యాపారంలో ప్రెజర్ నుండి బయటపడాలంటే ఔటింగ్ వెళ్లడం మంచిది. ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటే ఆహ్లాదానికి ఆహ్లాదం, ఒత్తిడి నుండి కూడా బయటపడవచ్చు. ట్రిప్పులకు వెళ్లేందుకు ఉద్యోగులకు సరైనా సమయంలో సెలవులు దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కొందరు టూర్లను వాయిదా వేసుకుంటారు. 2023లో మీరు ఏదైనా ట్రిప్పులకు వెళ్లేటప్పుడు ఇలాంటి ఇబ్బంది పడకుండా వచ్చే ఏడాదిలో ఎన్ని లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయో ఇప్పుడు చూద్దాం.

2023లో ఒకటి లేదా రెండు రోజులు లీవ్ తీసుకుంటే చాలా లాంగ్ వీకెండ్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేయవచ్చు. 2023లో దాదాపు 15 లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జనవరి:
1. డిసెంబర్ 31 శనివారం రోజు వస్తోంది. జనవరి 1వ తేదీ ఆదివారం అవుతోంది. శుక్రవారం లేదా, సోమవారం ఒక్కరోజు లీవ్ తీసుకుంటే మూడ్రోజులు కొత్త సంవత్సరాన్ని ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు. ఎక్కడికైనా ట్రిప్పుకు కూడా వెళ్లొచ్చుయ
2. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పెద్ద పండగ. రకరకాల పిండి వంటకాలతో నోరూరించే పండగ సంక్రాంతి. ఆంధ్రప్రదేశ్‌లో అయితే కోడి పందెలు, బసవన్నల పరుగులు చూస్తూ చాలా ఎంజాయ్ చేయవచ్చు. తెలంగాణలో అయితే చకినాలు, గారెప్పలు, బూరెలు తింటూ పతంగులు ఎగురవేస్తూ సంక్రాంతిని ఆస్వాదించవచ్చు.
జనవరి 14న శనివారం భోగి వస్తోంది. అంటే జనవరి 15న సంక్రాంతి ఆదివారం వస్తోంది. సోమవారం సెలవు పెట్టేస్తే ఏంచక్కా సొంతూర్లకు వెళ్లి సంక్రాంతిని ఫుల్‌గా ఎంజాయ్ చేయవచ్చు.
3. జనవరి 26 గణతంత్ర దినోత్సవం గురువారం వస్తోంది. 27వ తేదీ - శుక్రవారం, 28వ తేదీ - శనివారం, 29వ తేదీ - ఆదివారం. శుక్రవారం అంటే జనవరి 27వ తేదీ సెలవు పెట్టేస్తే మొత్తం నాలుగు రోజులు ఎక్కడికైనా ఔటింగ్ వెళ్లొచ్చు.

ఫిబ్రవరి
1. ఫిబ్రవరి 18న మహాశివరాత్రి శనివారం వస్తోంది. మరుసటి రోజు ఎలాగూ ఆదివారం. శుక్రవారం లేదంటే సోమవారం లీవ్ పెట్టెస్తే మూడు రోజుల శివరాత్రి తీర్థయాత్రలకు వెళ్లొచ్చు.

మార్చి
మార్చిలో లాంగ్ వీకెండ్‌లు లేవు. హోలీ మార్చి 8 బుధవారం వస్తోంది. బ్యాంకు ఉద్యోగులకు ఎలాగూ సెలవు ఉంటుంది. మళ్లీ మార్చి 11వ తేదీ ఆదివారం తర్వాత రెండో శనివారం కావడంతో బ్యాంకులు మూతపడతాయి.
1. 8 మార్చి, బుధవారం - హోలీ
2. మార్చి 22, బుధవారం - ఉగాది
3. మార్చి 30, గురువారం - శ్రీరామ నవమి

ఏప్రిల్
ఏప్రిల్ 4వ తేదీన అంటే మంగళవారం మహవీర్ జయంతి వస్తోంది. ఏప్రిల్ 7వ తేదీన గుడ్ ఫ్రైడే ఉంది. 8వ తేదీ, 9వ తేదీ వీకెండ్స్. మూడ్రోజుల వీకెండ్స్ వచ్చినట్లే. బుధవారం, గురువారం కూడా లీవ్ పెట్టేస్తే మొత్తం 6 రోజులు ఫ్రెండ్స్‌తో లేదా ఫ్యామిలీతో ఏదైనా ట్రిప్ ప్లాన్ చేయొచ్చు.
1. ఏప్రిల్ 14వ తేదీ - డాక్టర్ అంబేద్కర్ జయంతి
2. ఏప్రిల్ 22వ తేదీ - ఈద్ ఉల్ ఫితర్

మే
మేడే సోమవారం రోజు వస్తోంది. అంతకుముందు శని, ఆదివారాలు ఎలాగూ వీకెండ్స్ కాబట్టి సోమవారంతో కలిపితే మూడ్రోజులు సెలవులు ఉన్నట్లే. ముందు వచ్చే శుక్రవారం లేదంటే మంగళవారం రోజు సెలవు తీసుకుంటే నాలుగు రోజులు రెచ్చిపోవచ్చు.
1. మే 1వ తేదీ - మేడే
2. మే 5వ తేదీ - బుద్ధ పూర్ణిమ

జూన్
జూన్ లో లాంగ్ వీకెండ్స్ ఏమీ లేవు. రథయాత్ర హాలిడే ఉంటుంది కానీ మనదగ్గర ఏమీ ఉండదు. 29 వ తేదీ బక్రీద్ గురువారం వస్తోంది.
1. జూన్ 29వ తేదీ - బక్రీద్

జులై
జులైలో చెప్పుకోదగ్గ హాలిడేలు ఏం లేవు. శనివారం రోజు జులై 29 నాడు వస్తుంది.
1. జులై 29వ తేదీ - మొహర్రం

ఆగష్టు
1. ఆగష్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం మంగళవారం వస్తోంది. ఆగస్టు 12, 13వ తేదీలు శని, ఆదివారాలు వస్తున్నాయి. సోమవారం అంటే ఆగస్టు 14వ తేదీన సెలవు తీసుకుంటే మొత్తం నాలుగు రోజులు ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు.
2. ఆగస్టు 26, 27 శని, ఆదివారాలు వస్తున్నాయి. 29వ తేదీన ఓనం ఉంటుంది. ఆగస్టు 30న రక్షా బంధన్ వస్తుంది. 28వ తేదీన సెలవు తీసుకుంటే మొత్తం 5 రోజులు ఎక్కడికైనా వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేసి రావొచ్చు.

సెప్టెంబర్
1. సెప్టెంబర్ 7వ తేదీన గురువారం కృష్ణాష్టమి వస్తోంది. 9వ తేదీ శనివారం, 10వ తేదీ ఆదివారం వస్తున్నాయి. 8వ తేదీ అంటే శుక్రవారం సెలవు తీసుకుంటే నాలుగు రోజుల పాటు సెలవులు ఆస్వాదించవచ్చు.
2. సెప్టెంబర్ 19న మంగళవారం వినాయక చవితి వస్తోంది. సెప్టెంబర్ 16వ తేదీ శనివారం, 17వ తేదీ ఆదివారం వస్తున్నాయి. 18వ తేదీ అంటే సోమవారం లీవ్ పెట్టేస్తే వినాయకుడి స్మరణలో తరించవచ్చు.

అక్టోబర్
1. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సోమవారం వస్తోంది. ఒక్కరోజూ కూడా సెలవు పెట్టకుండానే శని, ఆదివారాలతో కలిసి మొత్తం మూడ్రోజులు లాంగ్ వీకెండ్స్. ఒకటీ రెండు రోజులు సెలవు పెట్టేస్తే నాలుగైదు రోజులు ఏదైనా ట్రిప్ ప్లాన్ చేయవచ్చు.
2. అక్టోబర్ 24 దసరా మంగళవారం వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో నవరాత్రులు, దసరా, బతుకమ్మ ఎంత బాగా చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 21వ తేదీ శనివారం, 22వ తేదీ ఆదివారం వస్తున్నాయి. 23వ తేదీ సోమవారం రోజు లీవ్ పెట్టేస్తే నాలుగు రోజులు పిల్లలతో గడపొచ్చు.లేదంటే లాంగ్ టూర్లకు ప్లాన్ చేయవచ్చు.

నవంబర్
నవంబర్ లో వీకెండ్స్ పండగలు వచ్చాయి. నవంబర్ 12వ దీపావళి ఆదివారం వస్తోంది. శనివారం ఎలాగూ సెలవు.

డిసెంబర్
డిసెంబర్ 25న క్రిస్మస్ సోమవారం వస్తోంది. 23న శనివారం, 24న ఆదివారం. శుక్రవారం కూడా లీవ్ పెట్టేస్తే నాలుగు రోజులు క్రిస్మస్ ట్రిప్ కు వెళ్లొచ్చు.



Click it and Unblock the Notifications