Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఏడాదిలో పొడవైన రోజు జూన్ 21.. ఈ రోజు ఎందుకంత ప్రత్యేకమో తెలుసా?
సంవత్సరంలో 365 రోజులు.. లీపు సంవత్సరంలో 366 రోజులు ఉంటాయని తెలిసిందే. అయితే సంవత్సరంలోని అన్ని రోజులూ ఒకేలా ఉండవు. కొన్ని రోజుల్లో పగటి సమయం ఎక్కువ ఉంటే, కొన్ని రోజుల్లో రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. అయితే ఏడాదిలో నాలుగు రోజులు మాత్రం చాలా ప్రత్యేకమైనవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అవి మార్చి 21, జూన్ 21, సెప్టెంబర్ 23, డిసెంబర్ 22. ఇవాళ జూన్ 21వ తేదీ. ఈ రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. ఇది మిగతా రోజులకు చాలా భిన్నం. ప్రతి సంవత్సరంలో జూన్ 21వ తేదీన పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. అలాగే రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. అందుకే జూన్ 21ని పొడవైన రోజుగా పిలుస్తారు.

అన్ని రోజుల కంటే ఎక్కువ పగటి సమయం:
రోజులో 24 గంటలు ఉంటే.. 12 గంటలు పగటి సమయం, 12 గంటలు రాత్రి సమయం ఉంటుంది. సాధారణ రోజుల్లో ఇలాగే ఉంటుంది. అయితే జూన్ 21వ తేదీ ప్రత్యేకత ఏంటంటే.. ఈ రోజు పగటి సమయంలో 12 గంటలు కంటే ఎక్కువ ఉంటుంది. 13 గంటల 7 నిమిషాల సుదీర్ఘ పగటి సమయం ఈరోజు ఉంటుంది. ఈ రోజు ఉత్తరార్థగోళంలో కర్కటాక రేఖకి లంబంగా సూర్యుడు వస్తాడు.
అందువల్ల పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రోజు మిట్టమధ్యాహ్నం ఎక్కువ సేపు ఉంటుంది. ఈ సమయంలో నీడలు కనిపించవు. 2023 సంవత్సరానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ సంవత్సరం జూన్ 21 తో పాటు జూన్ 22 తేదీ కూడా పగటి సమయం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా 1975 లో జరగ్గా.. మళ్లీ 2023 లో జరుగుతున్నట్లు వెల్లడించారు.
సూర్యోదయం అరుణాచల్ ప్రదేశ్‌లో కాదు!
సాధారణంగా మన దేశంలో మొదటి సూర్యోదయం అరుణాచల్ ప్రదేశ్ లో జరుగుతుందని తెలిసిందే. దోంగ్ గ్రామంలో రోజులో తొలిసారి సూర్యుడు కనిపిస్తాడు. అయితే జూన్ 21వ తేదీన మాత్రం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో తొలి సూర్యోదయం జరుగుతుంది.
జూన్ 21నే ఎందుకు:
ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం, సూర్యుడు ఉత్తర అర్థగోళం నుండి ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ వైపునకు భారతదేశం మధ్యలో దాటుతాడు. ఆ రోజున సూర్యకిరణాలు భూమిపై ఎక్కువ సమయం పడటానికి కారణం ఇదే. ఈరోజున సూర్య కాంతి 15 నుండి 16 గంటల వరకు భూమిపై పడుతుంది. అందుకే జూన్ 21వ తేదీన సంవత్సరంలో పొడవైన రోజు కావడానికి కారణం. ఈ దృగ్విషయాన్ని సమ్మర్ అయనాంతం అంటారు.
ఏడాదికి రెండుసార్లు:
అయనాంతం ఒక ఖగోళ సంఘట. ఇది సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుంది. వేసవికాలంలో ఒకసారి సూర్యుడిని ఉత్తర లేదా దక్షిణ ధ్రువం నుండి చూసినప్పుడు సంవత్సరంలో పొడవైన రోజు నమోదు అవుతుంది. ఈరోజున, అంటే జూన్ 21వ తేదీన సూర్యుని కిరణాలు భూమిపై ఎక్కువ కాలం ఉంటాయి.
రెండో ఖగోళ సంఘటన:
అదే సమయంలో రెండో ఖగోళ సంఘటన డిసెంబర్ 22వ తేదీన జరుగుతుందది. ఈరోజున పగలు తక్కువ సమయం మరియు రాత్రి ఎక్కువ సమయం ఉంటుంది. ఈరోజున సూర్యకిరణాలు భూమిపై కొద్దిసేపు మాత్రమే ఉంటాయి. పగలు మరియు రాత్రి వ్యవధిలో గొప్ప వ్యత్యాసం ఉండేది సంవత్సరంలో కేవలం రెండు రోజులే.



Click it and Unblock the Notifications