Latest Updates
-
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.?
బాత్‌రూమ్‌లో దుర్వాసన.. సువాసన వెదజల్లే ఫ్రెషనర్స్ ఇంట్లోనే 5 నిమిషాల్లో రెడీ.!
తరచూ వానల కారణంగా ఇంటాబయటా ఎక్కువసేపు తడిగా, తేమగా ఉంటుంది. ఇక, బాత్‌రూమ్స్ విషయానికొస్తే ఆరడానికి టైం పడుతుంది. దీంతో తడి కారణంగా త్వరగానే దుర్వాసన వస్తుంటుంది. ఈ క్రమంలో దుర్వాసన పోగొట్టేందుకు ఎయిర్‌ఫ్రెష్‌నర్‌లను వాడుతుంటారు. అయితే ఇవి ఖరీదైనవి కావడమే కాకుండా త్వరగా వాటి పవర్ తగ్గిపోతుంది. అయితే ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో ఎయిర్‌ఫ్రెషన్‌నర్స్ తయారుచేసుకోవచ్చు. వీటి ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సహజమైన సువాసనను అందించి బాత్‌రూమ్‌ను తాజాగా ఉంచుతుంది.

వేసవి కాలం, చలికాలంతో పోలిస్తే వర్షాకాలంలో ఇంట్లో ఒకరకమైన వాసనతో పాటు బాత్‌రూమ్ ఎక్కువగా దుర్వాసనను వెదజల్లుతుంటుంది. నిత్యం శుభ్రంగా ఉంచినా తేమ కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా, తలుపులు ఎక్కువ సేపు మూసి ఉంచుతున్న కారణంగా దుర్వాసన ఇంకా అధికమవుతుంది. అందుకే ఈ కాలంలో బాత్‌రూమ్, రూమ్ ఫ్రెష్‌నర్స్‌కి డిమాండ్ ఎక్కువ. ఖరీదైన ఉత్పత్తులను కొనకుండా ఇంట్లోనే లభించే ఈ చవకైన వాటితో ఎయిర్‌ఫ్రెష్‌నర్స్‌ని తయారుచేసుకోండి.
నిమ్మకాయ- బేకింగ్ సోడా
ఒక చిన్న బౌల్‌లో 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా తీసుకుని.. దానికి 8 నుంచి 10 చుక్కల నిమ్మ ఎసెన్షియల్ ఆయిల్ లేదంటే తాజా నిమ్మరసం కలపాలి. అవకాశం ఉంటే ఈ మిశ్రమంలో లావెండర్ లేదా పిప్పరమెంట్ ఆయుల్‌ను కొన్ని చుక్కలు కలుపుకోవచ్చు. ఇప్పుడు మిశ్రమాన్ని గాలి ప్రసరించే చిన్న బాక్స్ లేదా గిన్నెలో పోసి బాత్‌రూమ్‌లో ఒక మూల ఉంచాలి. బేకింగ్ సోడా దుర్వాసనను పీల్చుకుని తాజాగా ఉంచుతుంది. నిమ్మరసం సువాసనను వెదజల్లుతుంది.
స్ప్రే ఫ్రెషనర్లు
బాత్‌రూమ్ దుర్వాసన వచ్చినప్పుడు తక్షణ ఫలితం కోసం స్ప్రే చేసుకోవచ్చు. అందుకోసం ఒక స్ప్రే బాటిల్‌లో కప్పు నీరు, టేబుల్ స్పూన్ తెల్ల వెనిగర్, నిమ్మరసం 10-15 చుక్కలు కలపండి. తర్వాత బాటిల్‌ను షేక్ చేయండి. మిశ్రమం అంతా బాగా కలుస్తుంది. దీనిని టాయిలెట్ సీటు, వాష్‌బేసిన్, బాత్రూమ్ మూలలపై తేలికగా స్ప్రే చేయడం ద్వారా బ్యాక్టీరియా నశిస్తుంది. దుర్వాసన రాకుండా చూస్తుంది. తాజా సువాసనను అందిస్తాయి.

కర్పూరం- లవంగాలు
ఒక చిన్న గిన్నెలో ఐదు కర్పూరపు బిల్లలను పొడి చేసి వేసుకోవాలి. వీటిలో ఒక పది లవంగాలు వేయాలి. ఇంట్లో అందుబాటులో ఉంటే యూకలిప్టస్ లేదా లెమన్ గ్రాస్ నూనెను కలుపుకోవచ్చు. ఈ మిశ్రమం బాత్‌రూమ్‌లో ఎక్కువ కాలం తాజా సువాసనను వెదజల్లుతుంది. కర్పూరం గాలిని తాజాగా ఉంచుతుంది. లవంగాలలు దుర్వాసనను తగ్గిస్తాయి. వర్షాకాలంలో ఈ కాంబినేషన్ ప్రభావవంతంగా పనిచేస్తుంది.
కేవలం బాత్‌రూమ్ ఫ్రెష్‌నర్స్‌ని తయారుచేసుకుని ఉపయోగిస్తే సరిపోదు. ఫలితం కనబడాలంటే బాత్‌రూమ్‌ను క్రమం తప్పకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఫ్లోర్, టాయిలెట్, డ్రెయిన్‌ను రెగ్యులర్‌గా శుభ్రం చేస్తుండాలి. వెంటిలేటర్ నుంచి గాలి ప్రసరణ సరిగా ఉండేలా చూడాలి. బాత్‌రూమ్‌లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్నట్లయితే వినియోగించుకోవాలి. అప్పుడు ఈ ఫ్రెషనర్‌ను ప్రతి పదిరోజులకోసారి మార్చడం ద్వారా ఫలితాలుంటాయి. సువాసన తగ్గినట్లు అనిపిస్తే కొంచెం ఎసెన్షియల్ ఆయిల్‌ను కలుపుకోవచ్చు. ఇలా ఈ పద్ధతులు పాటించడం ద్వారా బాత్‌రూమ్ దుర్వాసన రాకుండా ఇంట్లో వారికి వైరల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుకోవచ్చు.



Click it and Unblock the Notifications
