Latest Updates
-
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.!
స్త్రీలకు ఎక్కడ పుట్టుమచ్చ వుంటే ఏమవుతుందో తెలుసా..?
మానవుడి జాతకాన్ని నిర్ణయించడంలో పుట్టు మచ్చలు కూడా ప్రముఖ పాత్రను పోషిస్తాయ్. శరీరంపై అక్కడక్కడా వున్న పుట్టుమచ్చలు అందాన్ని పెంచడమే కాదు, అదృష్ట, దురదృష్టాలను కలిగిస్తాయ్. కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాన్ని ఇవ్వగా మరికొన్ని పుట్టుమచ్చలు ఇద్దరికీ వేరే ఫలితాన్ని కలిగిస్తాయ్. రంగు, ఆకారం, అవి వుండే స్థానాలను బట్టి లాభ ఫలితాలు వుంటాయని పండితులు చెబుతున్నారు. మన శరీరంలో వున్న పుట్టుమచ్చలు మనకు చాలా విషయాలను తెలియజేస్తాయ్. పుట్టు మచ్చ యోక్క స్థానం, ఆకారం, పరిమాణాన్ని పై ఆధారపడి మీరు దాని ప్రతికూల సానుకూల ప్రభావాలను అర్థం చేసుకోవచ్చు. మనిషి జీవితంలో పుట్టుమచ్చలు చాలా కీలకంగా వ్యవహరిస్తాయ్. ప్రత్యేకంగా స్త్రీలలో ఎక్కడెక్కడ పుట్టు మచ్చ వుంటే ఎలాంటి ప్రభావం వుంటుందో తెలుసుకుందాం.

స్త్రీలకు రెండు కనుబొమ్మల మధ్యలో పుట్టుమచ్చ వుంటే ధనప్రాప్తి, మంచి భర్త, మంచి సంతానం కలుగుతుంది. ఎటువంటి కష్టాలు లేకుండా మంచి ప్రశంసలతో గౌరవించబడతారు. కుడి, లేదా ఎడమ కనుబొమ్మపై పుట్టు మచ్చవున్న స్త్రీలు ఎక్కువ ధనాన్ని, కీర్తిని సంపాదిస్తారు. వారికి చాలా అదృష్టం కూడా వస్తుంది.
స్త్రీలకు కుడికన్ను మూలలో పుట్టుమచ్చ వుంటే వారు పురుషులను బాగా ఆకర్శించగలుగుతారు. అలాంటి స్త్రీల ప్రేమ అదృష్టం చాలా బలంగా వుంటుంది. వారు జీవితంలో కోరుకున్న భాగస్వామిని పొందుతారు. అలాంటి మహిళలు తమ సంబంధాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని గుర్తుంచుకోవాలి. లేదంటే వారి భాగస్వామి దృష్టిని మరల్చవచ్చు.
స్త్రీలకు చేతిపైన గానీ లేక నుదుటిపైన గానీ సకల శుభాలు ఆరోగ్యం కలుగుతుంది. స్త్రీల భుజంపై పుట్టుమచ్చ వుంటే శుభసూచకంగా చెబుతారు. వారి జీవితంలో అన్ని భౌతిక ఆనందాలను పొందుతారు. ఖరీదైన దుస్తులను ఇష్టపడతారు. చెవిలో పుట్టుమచ్చ వున్న స్త్రీలు చాలా అదృష్టవంతులు, తెలివైన వారు, ప్రతిభావంతులు, వారిని నాయకత్వ సామర్ధ్యాలు వుంటాయ్. జీవిత నిర్ణయాలను చక్కగా తీసుకుంటారు.
నుదుటిపై పుట్టుమచ్చ వున్న స్త్రీలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు. వారు తెలివైన వారు, దూరదృష్టి కలవారు, అలాగే తమ లక్ష్యాల పట్ల సున్నితంగా వుంటారు. జీవితంలో తమ స్థానాన్ని సొంతంగా సాధిస్తారు. మహిళలకు నుదుటి ఎడమవైపు వుంటే అపరాధంగా భావించాలి. వీరు డబ్బును బాగా ఖర్చు పెట్టే ధోరణిని కలిగి వుంటారు. అదే పుట్టుమచ్చ కుడివైపు వుంటే వారు గొప్ప మానసిక శక్తిని కలిగి వుంటారు.
స్త్రీలకు పెదవులపై పుట్టుమచ్చ వుంటే వారు భోజనప్రియులు. ఎక్కువగా స్నేహితులతో కలిసి వుంటారు. నాలుకపై పుట్టుమచ్చ వుంటే సంగాతంలో మంచి స్థానానికి చేరుకుంటారని అర్థం. ఎడమ దవడపై పుట్టుమచ్చ వుంటే వారి అందరితో సామాన్యంగా వ్యవహరిస్తూ సున్నితంగా వుంటారు. కుడి దవడపై పుట్టుమచ్చ వుంటే అనారోగ్య సమస్యలు వుంటాయ్. గడ్డంపై పుట్టుమచ్చ వుంటే నెమ్మదస్తులు అని అర్థం.
స్త్రీలకు తొడమీద పుట్టుమచ్చ వుంటే అదృష్టం కలిసి వస్తుంది. మహిళలకు కాళ్ల మీద పుట్టు వుంటే వారు తమ సొంత కాళ్లపై నిలబడతారని అర్థం. వేళ్ల మీద పుట్టుమచ్చ వుంటే వారు ఎవరి మీదా ఆధారపడకుండా వుంటారు. వీపుపైన పుట్టుమచ్చ వుంటే వారు ఎక్కువ నిజాయితీతో వుంటారని అర్థం చేసుకోవాలి. ఛాతి మీద పుట్టుమచ్చ వుంటే వారికి ఎటువంటి ఆనందం, భాగ్యం వుండదు. కుడిరొమ్ము కింద పుట్టుమచ్చ వుంటే అదృష్టం కలిగి సంతోషంగా వుంటారు.



Click it and Unblock the Notifications
