Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
Ambedkar Jayanti: ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపే అంబేద్కర్ కొటేషన్స్ ఇవే.. చదివితే రక్తం మరగాల్సిందే!
ఇది మద్యం, అవమానం, అంటరానితనాన్ని తట్టుకుని సమానత్వాన్ని గెలిపించి, అతిపెద్ద రాజ్యాంగ నిర్మాణం చేసిన మహనీయుడి కథ. అంబేడ్కరుడి కథ. భారతదేశంలోని మధ్యప్రదేశ్‌లో గల అంబవాడా అనే ఓ చిన్న గ్రామంలో ఏప్రిల్ 14వ తేదీ 1891 సంవత్సరంలో ఓ నిరుపేద కుటుంబంలో 14వ సంతానంగా అంబేద్కర్ జన్మించారు. సామాజికంగా తక్కువగా భావించే వర్గానికి చెందిన వారు కావడంతో, అతనికి చిన్ననాటి నుంచే వివక్ష ఎదురైంది.
ఆయన పాఠశాలకు వెళ్లినప్పుడు, అందరితో పాటు లోపల కూర్చోబెట్టే పరిస్థితి లేదు. ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు ఎవ్వరూ అతడిని సమానంగా చూడలేదు. తాను నీళ్లు తాగాలంటే, పాఠశాలలో పనిచేసే గుమాస్తా కొంత ఎత్తునుంచి చేతిలో నీళ్లు పోస్తే తాగేవారు. దయ అనే మాట, సమానత్వం అనే భావన ఆ రోజులలో మన దేశంలో చాలా మందికి తెలియదు.

అయితే, ఆ చిన్నారి ఇదంతా తట్టుకోలేదు. ఈ అనుభవాలు అతని మనసులో విప్లవానికి బీజం వేశాయి. అవమానాలను ఆయుధాలుగా మార్చి, చదువు అనే ఆయుధంతో ఆయనే తన సమాజానికి రక్షణ కవచంగా మారిపోయాడు. చదువు, చైతన్యం, న్యాయం ఇవే ఆయన్ను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాయి. ఈ స్టోరీలో అంబేద్కర్ చెప్పిన కొన్ని స్ఫూర్తిని నింపే కొటేషన్స్, మెసేజెస్ గురించి వివరించాము. అవేంటో చూడండి.
సమానత్వం కోసమే..
బాబా సాహెబ్ అని అందరూ గౌరవంగా పిలిచే అంబేద్కర్, తన జీవితాన్ని మానవ సమానత్వం కోసం అంకితం చేశారు. ఆయన పాఠశాలలో ఎదురైన అవమానాలే, ఆయనలో సమాజం మారాలనే సంకల్పాన్ని కలిగించాయి. 1927లో ఆయన చేపట్టిన మహాడ్ ఉద్యమం ద్వారా తొలిసారిగా అంటరాని వారికి ప్రజా నీటి వనరులు వాడే హక్కు కల్పించాలని పోరాటం చేశారు.
అంతటితో ఆగలేదు. 1930లో ప్రారంభించిన కాలరామ్ మందిరం సత్యాగ్రహం ద్వారా దేవాలయాల్లోని ప్రవేశంపై ఉన్న అసమానతలపై గళమెత్తారు. 'ఈ దేవుడి గుడిలో పూజించే హక్కు నాకూ ఉంది' అని అంబేద్కర్ గారు గట్టిగా చెప్పారు. ఆయన కేవలం న్యాయశాస్త్రాన్ని చదివిన విద్యావంతుడే కాదు.. ఒక ఆలోచనాశీలి, సమాజాన్ని మేల్కొలిపే జ్ఞానోదయాన్ని తీసుకొచ్చిన మార్గదర్శి.
రాజ్యాంగ నిర్మాతగా పాత్ర
స్వాతంత్య్రం వచ్చిన తరువాత, భారత రాజ్యాంగ రచనకు ఆయనను ప్రధాన రాజ్యాంగ నిర్మాతగా ఎంపిక చేశారు. సమానత్వం, స్వేచ్ఛ, బంధుత్వం అనే మూల సూత్రాలను రాజ్యాంగంలో నాటారు. కుల, మత, లింగ, జాతి తేడాలు లేకుండా అందరికీ న్యాయం కలగాలన్నదే ఆయన దృష్టి.
అంబేద్కర్ సూక్తులు, మార్గదర్శకాలు
అంబేద్కర్ సూక్తులు, జీవితంపై ఆయన్ను అర్థం చేసుకునే మార్గం లాంటివి. కొన్ని ముఖ్యమైనవి ఇవే:
"జీవితం విలువల కోసం పోరాడినప్పుడే మన జీవితం అర్థవంతం అవుతుంది."
"కులం పునాదుల మీద దేశాన్ని నిర్మించలేం. జ్ఞానాన్ని, నైతికతను ప్రాతిపదికగా పెట్టుకోవాలి."
"మేకలుగా కాదు... పులుల్లా జీవించాలి. భయంతో కాదు, గర్వంతో జీవించాలి."
"విద్యావంతులై ఆత్మగౌరవంతో ముందుకెళితేనే సమాజం ముందుకు పోతుంది."
"వినయం లేని విద్య పశుత్వమే. అలాంటి విద్య సమాజానికి ప్రమాదకరం."
చివరగా..
ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ పుట్టినరోజు. ఇది కేవలం ఓ నాయకుడి జయంతి కాదు. సమానత్వానికి ఒక కొత్త ఆరంభం. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మనకు నేర్పినది ఒక్కటే "మీ హక్కులు మీరే సాధించుకోండి. ఎదురు చూస్తే ఎవ్వరూ ఇవ్వరు." ఈ కథ ఒక మహానుభావుని కాదు... ప్రతి అణగారిన మనిషి పునర్జన్మకథ. అది ఆశ, ఆత్మవిశ్వాసం, అభ్యుదయానికి మార్గం చూపే జ్యోతి.



Click it and Unblock the Notifications