Latest Updates
-
జలుబు వల్ల వచ్చే తీవ్రమైన తలనొప్పిని తగ్గించే బెస్ట్ చిట్కా ఇదే -
నార్త్ ఇండియా స్టైల్ పుట్టగొడుగులు బంగాళదుంప మసాలా..తరతరాలకు గుర్తుండిపోయే రుచి! -
విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఉసిరి సూప్..చలికాలంలో దీన్ని మించింది లేదు! -
పురుషుల దినోత్సవం స్పెషల్ స్వీట్..నోట్లో వెన్నలా కరిగిపోయే క్రీమీ రబ్రీని ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
చాక్లెట్ బ్రౌనీ చీజ్ కేక్ రెసిపీ.. పురుషుల దినోత్సవాన మీ ప్రియమైన వారికి ఇలా స్వీట్ సర్ ప్రైజ్ ఇవ్వండి! -
International men's day: ప్రతి పురుషుడు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన టెస్టులు ఇవే! -
పిల్లల ఆట అనుకుంటున్నారా? పెద్దలు ఉయ్యాల ఊగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే! -
చలికాలం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్..ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు పాలకూర దోసె చేసుకోండిలా.. -
చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు! -
కేరళ స్పెషల్ మలబార్ చికెన్ బిర్యానీ.. బ్యాచిలర్లు కూడా చిటికెలో చేసేయొచ్చు!
టీ తాగితే ఎముకలు కరిగిపోతాయా? ఈ విషయాలు మీకు తెలుసా?
మనదేశంలో టీ తాగే అలవాటు లేనివాళ్లు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. ధనికులైనా, పేదలైనా, మిడిల్ క్లాస్ ఎవ్వరైనా సరే ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు తాగే ఏకైక డ్రింక్ టీ. అలసిపోయిన మైండ్ ను రీఫ్రెష్ చేయడానికి, ఉత్సాహాన్ని నింపడానికి టీ ఒక అద్భుత పానీయం.
అయితే తరచుగా మనల్ని వేధించే ఒక సందేహం..అతిగా టీ తాగితే శరీరంలోని కాల్షియం తగ్గిపోయి, ఎముకలు గుల్లబారుతాయా? దీని వెనుక ఉన్న అసలు వాస్తవం ఏమిటో తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం.

టీ తాగితే ఎముకలు బలహీనపడతాయా?
టీలో కెఫిన్ ఉంటుంది. ఈ కెఫిన్ మోతాదు శరీరంలో పెరిగినప్పుడు, మూత్రం ద్వారా కొద్దిపాటి కాల్షియం బయటకు పోయే మాట వాస్తవమే. కానీ రోజుకు రెండు మూడు కప్పుల టీ తాగినంత మాత్రాన మీ శరీరంలోని కాల్షియం మొత్తం కరిగిపోదు. మీ రోజువారీ ఆహారంలో తగినంత కాల్షియం ఉన్నట్లయితే ఈ టీ ప్రభావం మీ ఎముకల మీద ఏమాత్రం పడదు.
అసలు ప్రమాదం ఎప్పుడు వస్తుందంటే..
మీరు పాలు, పెరుగు, జున్ను, రాగి, నువ్వులు, ఆకుకూరలు వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను పక్కనబెట్టి కేవలం టీ, కాఫీలను మోతాదుకు మించి తాగినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. శరీరంలో కాల్షియం లోపించినప్పుడు, దానికి తోడు కెఫిన్ ఎక్కువగా చేరితే దీర్ఘకాలంలో ఎముకలు కచ్చితంగా బలహీనపడతాయి.
అతిగా టీ తాగడం వల్ల కలిగే 3 ప్రధాన నష్టాలు
నిద్రకు శత్రువు: సాయంత్రం లేదా రాత్రి వేళల్లో టీ ఎక్కువగా తాగితే, అందులోని కెఫిన్ మీ నిద్రను దూరం చేస్తుంది. నిద్రలేమి అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
గ్యాస్, అసిడిటీ: ముఖ్యంగా ఉదయం పరగడుపున టీ తాగడం వల్ల ఛాతీలో మంట, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణకోశ సమస్యలు వేధిస్తాయి.
ఐరన్ లోపం (రక్తహీనత): టీలో ఉండే టానిన్స్ మనం తినే ఆహారంలోని ఐరన్ ను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంది.
టీ ప్రియులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
-భోజనం చేసిన వెంటనే టీ తాగకూడదు. రెండు భోజనాల మధ్య విరామ సమయంలో టీ తాగడం ఉత్తమం.
-పాలు కలిపిన టీలో కొంత కాల్షియం ఉన్నప్పటికీ, దానినే శరీరానికి ప్రధాన కాల్షియం వనరుగా భావించవద్దు.
-టీలో చక్కెర మోతాదును వీలైనంత వరకు తగ్గించుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
-ఒక కప్పు టీ మీ ఎముకలను బలహీనపరచదు. కానీ సరైన పోషకాహారం తీసుకోకుండా, అతిగా టీ మీద ఆధారపడటమే అసలు ప్రమాదం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
