Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు ఇదే..మస్క్,బెజోస్,అంబానీ,అదానీ కాదు..ఓనర్ ఎవరో తెలుసా?
ప్రస్తుతం కారు కూడా నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఫ్యామిలీతో కలిసి లేదా ఫ్రెండ్స్ తో కలిసి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లాలంటే కారు తప్పనిసరిగా అయిపోయింది. మార్కెట్ లో ప్రస్తుతం అనేక రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. డ్రైవర్ లేకుండా నడిచే కార్లు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. అయితే అసలు ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు ఏది? దీని ధర ఎంత? ఈ కారు ఎవరి దగ్గర ఉంది అని ఎప్పుడైనా ఆలోచించారా?సాధారణంగా ఈ ప్రశ్న ఎవరినైనా అడిగితే జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ లేదా ముఖేష్ అంబానీ,గౌతమ్ అదానీ పేరు చెబుతుంటారు. అయితే ఈ ఖరీదైన కారు వీరెవరిదగ్గర లేదు. మరి ఈ కాస్ట్లీ కారు ఎవరి దగ్గర ఉందో ఇక్కడ చూడండి.
ధర ఎంతంటే
ప్రపంచంలోనే అత్యంత ఖరీరైన కారు 'రోల్స్ రాయిస్ లా రోస్ నోయిరీ డ్రాప్ టెయిల్(Rollys-Royce Noire Droptail). ఈ అతి విలాసవంతమైన కారు ధర దాదాపు రూ.250 కోట్లు. దీంతో ఈ భూమ్మీద తయారుచేయబడిన అత్యంత ఖరీదైన కారుగా ఇది నిలిచింది.

ఈ ఖరీదైన కారు ఓనర్ ఎవరు
ప్రపంచ కుబేరులైన ముఖేష్ అంబానీ,గౌతమ్ అదానీ,జెఫ్ బెజోస్,ఎలాన్ మస్క్ వీళ్లెవరు కూడా ఈ కారు ఓనర్ కాదంట. అయితే ఈ కారుని కోనుగోలు చేసిన వ్యక్తి పేరుని అధికారికంగా ప్రకటించలేదు. అయితే అమెరికాలోని కాలిఫోర్నియా పెబెల్ బీచ్ లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఈ కారుని కొనుగోలు దారుడికి కంపెనీ ప్రతినిధులు అందజేశారు. ఈ కారు డిజైన్, ప్రత్యేకత, దాని యజమాని ఎవరన్న రహస్యం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఫీచర్లు ఇవే
ఈ కారు అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉంది. లగ్జరీ,డిజైన్ కు తిరుగులేదు. కేవలం 4.8 సెకన్ల వ్యవధిలో 0 నుంచి 97 కి.మీ/గంటకు వేగాన్ని అందుకుంటుంది. ఇది గంటకు 200 కి.మీ గరిష్ఠ వేగాన్ని సాధించగలదు. ఇలాంటి నాలుగు కార్లు మాత్రమే తయారుచేయబడతాయి. ప్రతి కారు ఓనర్ స్పెసిఫికేషన్లకు అనుగుణంగా పూర్తిగా కస్టమైజ్ చేయబడుతుంది
ఈ కారు డిజైన్ ఎక్కడి నుంచి ప్రేరణ పొందింది
ఫ్యాన్స్ దేశంలో పండించబడే వెల్వెట్ బ్లూమ్ అయిన బ్లాక్ బక్కారా రోజ్ ప్రేరణతో ఈ కారు డిజైన్ చేయబడింది. ఈ కారు లోపలి భాగంలో రెండు సీట్లు మాత్రమే ఉంటాయి. అయితే యజమాని ఎవరో ఇంకా వెల్లడికానప్పటికీ ఈ కారు ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకరి దగ్గర ఉండవచ్చని ఊహాగానాలు సూచిస్తున్నాయి.



Click it and Unblock the Notifications
