Latest Updates
-
అల్లు అర్జున్ రిలేషన్ షిప్ సీక్రెట్..భార్యాభర్తల గొడవలకు బన్నీ ఇచ్చిన సాలిడ్ సొల్యూషన్ ఇదే! -
పెళ్లైన తర్వాత కూడా ఇంకొకరివైపు మనసు ఎందుకు వెళ్లిపోతోంది -
హైదరాబాద్ అనగానే బిర్యానీనే కాదు.. ఈ ఖట్టీ దాల్ -తలా హువా గోష్ట్ కాంబో రుచి అదిరిపోతుంది! -
సాయంత్రం ఆకలి తగ్గించే సోయా చాప్..! ఆయిల్ తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ లవర్స్ కోసం నెక్స్ట్ లెవెల్ రెసిపీ.. మలేషియన్ ఫ్రైడ్ చికెన్ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
కడుపు నిండుతోంది.. కానీ పోషకాలేవి? భారతీయుల ఆహారపు అలవాట్లపై ICMR షాకింగ్ నిజాలు! -
నోరూరించే జామకాయ ఊరగాయ..అన్నం, చపాతీల్లోకి కేక.. 10 నిమిషాల్లోనే చేసుకోండిలా.. -
నాగ దోషంతో ఇబ్బందులు పడుతున్నారా? ఈ 5 శక్తివంతమైన మంత్రాలు జపిస్తే చాలు -
ఎండలో నుంచి ఇంటికి రాగానే ఈ పనిచేస్తున్నారా?.. ఈ రిస్క్ తప్పదు.! -
లంచ్ బాక్స్‌లోకి చిటికెలో చేసుకునేలా.. వెల్లుల్లి ఘాటుతో ఎగ్ మసాలా రైస్.!
Oneindia Rebranding: వన్ఇండియా సరికొత్త ‘లోగో’తో పాఠకులకు చేరువైంది..
ప్రతి భారతీయుడికి డిజిటల్ మీడియా రంగంలో సేవలందించేందుకు నిబద్ధతతో, బహుభాషా వార్తల వెబ్‌సైట్ వన్‌ఇండియా సరికొత్త లోగోతో పాఠకుల ముందుకు వచ్చింది. వన్‌ఇండియా తన సమగ్ర రీబ్రాండింగ్‌ను ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించింది. ఈ కొత్త లోగోతో వన్ఇండియా అపరిమితమైన అవకాశాలపై దృష్టి సారిస్తూ డిజిటల్ స్పేస్‌లో కొత్త ఆవిష్కరణలు తెర మీదకు తీసుకువచ్చింది.
వన్‌ఇండియా: 'దేర్స్ ఓన్లీ వన్‌ఇండియా' అనే క్యాప్షన్‌తో 'వన్‌ఇండియా' డిజిటల్ మీడియా కొత్త అవకాశాలను పాఠకులకు అందిస్తోంది. ఈ పునఃరూపకల్పనతో అపరిమిత అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. డిజిటల్ మీడియా రంగంలో అన్ని సేవలను ప్రతి భారతీయునికి చేరేలా చూడటానికి వన్ ఇండియా సిద్దం అయ్యింది.

వన్‌ఇండియా కొత్త రూపాల్లో పాఠకులకు చేరువైంది
జనరేషన్ జర్నీ: 1999లో Indiainfo.comగా ప్రారంభించబడింది, వన్ఇండియా ప్రారంభంలో ఈతరం (Gen-X) దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుండి వన్ఇండియా 25 సంవత్సరాల పాటు Gen-Z తరంతో మరియు అంతకు మించి నిమగ్నమై ఉంది. ఈ చారిత్రాత్మక ప్రయాణం విభిన్న పాఠకుల యొక్క మారుతున్న అవసరాలు, ఆలోచనలకు అనుగుణంగా OneIndia నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
వన్ఇండియా బ్రాండ్:
వన్ఇండియా యొక్క నిబద్ధత అనేది సంబంధిత, విలువైన, ప్రామాణికమైన, నాణ్యత కలిగిన విలువలు కలిగిన ప్రమాణాలతో నిబద్దతను ప్రతిధ్వనించే కంటెంట్‌ని సృష్టించడం. వన్‌ఇండియా యొక్క ఈ రీబ్రాండింగ్ వారి జ్ఞానం, అనుభవం, సామాజిక స్థితిని మెరుగుపరుచుకోవాలనే తపనతో ఉన్న పాఠకులకు శక్తివంతమైన కంటెంట్ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. విభిన్న పాఠకులకు ప్రత్యేక ప్రాధాన్యతలు, ఆసక్తులతో ప్రతిధ్వనించే అనుకూలమైన కంటెంట్‌ను అందించడం ద్వారా OneIndia వ్యక్తిగతీకరించిన, సమర్థవంతమైన పాఠకులను సొంతం చేసుకుంది.
వన్ఇండియా యొక్క పునఃరూపకల్పన లోగో బహుభాషా కనెక్టివిటీని కూడా సూచిస్తుంది. ఇది సమగ్రమైన, పారదర్శకమైన గుర్తింపు, విలువలు, బ్రాండ్ సారాంశాన్ని కలిగివుంది. ఈ ప్రత్యేకమైన మార్పు ఆధునిక, సంబంధిత వన్ఇండియా తన ప్రత్యేకతను చాటుకుంటుంది.

బహుభాషా డిజిటల్ మీడియాలో వన్ ఇండియా మొదటిది:
భారతీయులు ఇష్టపడే భాషలో ఆకర్షణీయమైన కంటెంట్‌ను అందించే భారతదేశపు ప్రముఖ డిజిటల్ మీడియాగా OneIndia నిలిచింది. OneIndia ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ భాషల్లో అందుబాటులో ఉంది. 200 మిలియన్లకు పైగా నెలవారీ పాఠకులతో OneIndia దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒక ఇంటర్నెట్ వినియోగదారులను వార్తల ప్రపంచానికి కనెక్ట్ చేస్తుంది.
ఇది దేశంలోని ఇంటర్నెట్ వినియోగిస్తున్న జనాభాలో 25% మందికి వన్‌ఇండియా డిజిటల్ మీడియా సేవలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా విస్తృతంగా వైవిధ్యభరితమైన పాఠకులను సొంతం చేసుకుంది. సమర్ధవంతంగా విలువైన వార్తలను ఎప్పటికప్పపుడు పాఠకులకు అందిస్తూ తన శక్తి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ డిజిటల్ రంగంలో వన్ఇండియా కీలక పాత్ర పోషించగలుగుతోంది.
ప్రకటనదారులకు అవకాశాలు:
OneIndia అనేది నెటిజన్లు, ప్రకటనకర్తల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాన్ని ప్రోత్సహించడానికి రూపొందించబడిన ప్లాట్‌ఫారమ్. ఈ ప్లాట్‌ఫారమ్ రెండు వర్గాలకు విలువైన ప్రయోజనాలను పొందేలా నిర్ధారిస్తుంది. సమతుల్యం, సరసమైన వాతావరణాన్ని నిర్వహించడం ద్వారా వన్ఇండియా అందరి కోసం కలుపుకొని ఆకర్షణీయమైన ఫ్లాట్ ఫామ్ సృష్టిస్తుంది.
{image- telugu.boldsky.com}
విభిన్న వార్తల ప్రాంతాలు: వన్‌ఇండియా వివిధ రకాల ప్రత్యేక పోర్టల్‌లకు నిలయంగా మారింది. వీటిలో ప్రతి ఒక్కటి నిర్దిష్టంగా వివరాలను అందిస్తుంది. పాఠకుల కోసం మొత్తం అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.
* ఫిల్మీబీట్ (ఎంటర్‌టైన్‌మెంట్),
* డ్రైవ్‌స్పార్క్ (ఆటోమోటివ్),
* గుడ్ రిటర్న్స్ (ఫైనాన్స్),
* మైఖేల్ (స్పోర్ట్స్),
* గిజ్‌బాట్ (టెక్నాలజీ),
* నేటివ్ ప్లానెట్ (ట్రావెల్),
* బోల్డ్‌స్కై (లైఫ్‌స్టైల్),
* కెరీర్‌ఇండియా (విద్య),
* హిట్స్‌ఫీడ్ (వైరల్ కంటెంట్).
ఈ రీబ్రాండింగ్ వన్ఇండియా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. సానుకూల మార్పుకు నాయకత్వం వహించడానికి, సమాజాన్ని ప్రభావితం చేయడానికి మా నిబద్ధతకు ఇది నిదర్శనం. వన్ఇండియా పాఠకులకు సమగ్రమైన వార్తలు, వినోదం, విలువైన కంటెంట్‌ను అందించడానికి అంకితమైన ప్రముఖ డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌గా నిలుస్తుంది. దేశ ఐక్యత కోసం నిస్పక్షపాతంగా ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందించడానికి వన్ ఇండియా పని చేస్తోంది. డిజిటల్ స్పేస్‌లో వన్ఇండియా ఇప్పుడు సరికొత్త లోగోతో పాఠకుల ముందుకు వచ్చింది.



Click it and Unblock the Notifications