Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
OG డైరెక్టర్‌కు పవన్ కళ్యాణ్ సర్‌ప్రైజ్... సుజీత్‌కు గిఫ్ట్‌గా లగ్జరీ కారు, ఎన్ని కోట్లో తెలుసా?
రాజకీయాలు, పాలనతో గత మూడేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్నారు సినీనటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన రాజకీయాల్లో పూర్తిగా బిజీ అయ్యే నాటికి పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అవి హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. వీటిని పూర్తి చేసి నిర్మాతకు ఆర్ధికంగా భారాన్ని తగ్గించాలని భావించిన జనసేనాని.. తన బిజీ షెడ్యూల్ మధ్యే కాస్తంత సమయం కేటాయించి వాటిని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.
దీనిలో భాగంగా తొలుత హరిహర వీరమల్లు సినిమాను విడుదల చేశారు. అయితే ఈ చిత్రం ప్రేక్షకులను, పవన్ కళ్యాణ్ అభిమానులను నిరాశ పరిచింది. ఆ వెంటనే కొద్దిరోజుల గ్యాప్‌లో ఓజీగా అభిమానులను పలకరించారు పవర్‌స్టార్. ఇందులో గ్యాంగ్‌స్టర్‌గా తన నట విశ్వరూపం చూపించడంతో పాటు బాక్సాఫీస్‌ను షేక్ చేశారు పవన్ కళ్యాణ్. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదలైన ఓజీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తొలిసారిగా 300 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను క్రాస్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ సినిమా విజయంతో పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. అటు మెగా ఫ్యామిలీ కూడా ఓజీని వీక్షించి సుజీత్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా సుజీత్‌ను పవన్ సర్‌ప్రైజ్ చేశారు. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందించినందుకు గాను సుజీత్‌కు ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా అందించారు పవర్‌స్టార్. ఈ కారును స్వయంగా పవన్ అతనికి అప్పగించారు.
ఈ ఊహించని సర్‌ప్రైజ్‌తో సుజీత్ ఎమోషనల్ అయ్యారు. నా కెరీర్‌లో ఇది బెస్ట్ గిఫ్ట్. సంతోషంతో హృదయం నిండిపోయింది. పవన్ కళ్యాణ్ గారి ప్రేమ, సపోర్ట్ నాకు అన్నీ ఎక్కువ. చిన్ననాటి నుంచి అభిమానిగా ఉండటం నుంచి ఇప్పటికీ పవర్‌స్టార్‌కు రుణపడి ఉంటాను అని సుజీత్ తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్‌తో ఉన్న ఫోటోలను ఈ మేరకు షేర్ చేశారు. అందులో సుజీత్ ... పవన్ కళ్యాణ్ స్వయంగా డోర్ తీసి సుజీత్‌ని కూర్చోబెట్టారు. అలాగే వీరిద్దరూ స్టైలీష్‌గా నిల్చొని ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఓజీ బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్, ప్రీక్వెల్ కూడా తెరకెక్కించేందుకు సుజీత్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్‌తో బిజీగా ఉన్నారు.
ల్యాండ్ రోవర్ డిఫెండర్ ప్రత్యేకతలు
ల్యాండ్ రోవర్ ఆధునిక మోడల్స్‌లో కుర్రకారును ఆకట్టుకుంటోంది. వివిధ వెరియెంట్స్‌లో డిఫెండర్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం 15 విభిన్న వేరియంట్లు, 6 రంగుల్లో లభ్యమవుతోంది. పీ 300, మిల్డ్ హైబ్రిడ్, పవర్‌ఫుల్ వీ 8 ఇంజిన్లను వాడుతున్నారు. ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్సన్, 6డీ డైనమిక్స్ సస్పెన్షన్... అదిరిపోయే డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. డిఫెండర్ ఆక్టా, డిఫెండర్ 90, డిఫెండర్ 110, డిఫెండర్ 130 తదితర మోడల్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. దీని ఎక్స్ షోరూం ధర కోటి రూపాయల పైనే ఉంటుందని టాక్.



Click it and Unblock the Notifications