Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
Prabhas in Kannappa : కన్నప్పలో ప్రభాస్‌ది ఏ రోల్..? అదే ఫైనల్ అనుకోవచ్చా..?
రెబల్ స్టార్ ప్రభాస్ మరో మైథలాజికల్ మూవీతో మన ముందుకు రాబోతున్నాడన్న విషయం ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంచు విష్ణు లీడ్ రోల్‌లో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న కన్నప్ప సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది. మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొత్తం ఐదు భాషల్లో కన్నప్ప ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతోంది.
కన్నప్ప బిగ్ అప్డేట్
ప్రభాస్ కన్నప్ప సినిమా షూటింగ్‌లో పాల్గొనడం పెద్ద అప్డేట్‌గా చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ఈ రోజు అంటే మే 9న పోస్ట్ చేశారు. 100 కోట్ల బడ్జెట్‌తో ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై దీన్ని నిర్మిస్తున్నారు. స్టీఫఎన్ దెవస్సి, మనిషర్మ సంగీతాన్ని సమకూర్చుతుండగా, షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేస్తున్నారు.

శివుడిలా ప్రభాస్ లేక అక్షయ్ కుమార్..? ఏది నిజం..
ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాజు కన్నప్ప సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రభాస్ కూడా పెద్దనాన్నలా కన్నప్పలా కనిపించి మళ్లీ కన్నప్పను రీమేక్ చేస్తారని టాక్ నడిచింది. అయితే ఈ కన్నప్ప సినిమాలో మంచు విష్ణు కన్నప్పలా కనిపించనుండగా ప్రభాస్ శివుడిలా కనిపిస్తాడంటున్నారు. మరోవైపు ఇప్పటికే అక్షయ్ కుమార్ శివుడి పాత్ర పోషించి రూ.9 కోట్ల రెమ్యునరేషన్ కూడా తీసుకున్నాడట. మరి రెండింటిలో ఏది నిజమనుకోవాలి. ఈ రోజు ప్రభాస్ కన్నప్ప షూటింగ్‌కి ఎందుకు హాజరై ఉంటాడు.
కన్నప్పలో తనకు పాత్ర కల్పించినందుకు సోషల్ మీడియా వేదికగా మంచు విష్ణుకు అక్షయ్ థ్యాంక్స్ కూడా చెప్పాడు. కన్నప్ప జర్నీలో తనను భాగం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. జై మహాకాల్ అంటూ ట్వీట్ చేశారు.
ప్రభాస్ రోల్ పై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మలయాళ యాక్టర్ మోహన్ లాల్ కూడా ఈ మూవీలో లీడ్ రోల్ ప్లే చేయనున్నారు. ప్రభాస్‌కు నందీవ్వరుడి క్యారెక్టర్ ఇస్తున్నట్టు టాక్ వినిపించింది. అక్షయ్ కుమార్ శివుడిలా, ప్రభాస్ నందీవ్వరుడిలా యాక్ట్ చేయనున్నారని అనుకోవచ్చు. ఇక నయనతార పార్వతి పాత్రలో కనిపించనుంది.
న్యూజీలాండ్‌లో కన్నప్ప
కన్నప్ప షూటింగ్‌ను ఎక్కువ శాతం న్యూజిలాండ్‌లోనే తీసారు. మంచు విష్ణు స్వయంగా ఈ మూవీకి స్క్రీన్‌ప్లేను రాసుకున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్ కన్నప్ప షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు.
శివుడి పాత్రను అక్షయ్ కుమార్ కాకుండా ప్రభాసే వేసి ఉంటారని కూడా లోపల మరో టాక్ వినిపిస్తోంది. ఇది సినిమా రిలీజ్ అయ్యేంత వరకు బయటపడదు. ఓ మై గాడ్ 2లో అక్షయ్ కుమార్ అటు నందిగా, ఇటు శివుడిలా పాత్ర పోషించాడు. ఈ కన్నప్పలో కూడా అక్షయ్ నందీశ్వరుడిలాగే మళ్లీ కనిపించనున్నాడు. ఇక ప్రభాస్‌ను ఇప్పటికే శివుడిలా చాలా మంది ఊహించుకొని వాటికి సంబంధించిన ఫ్యాన్ పోస్టర్లను సోషల్ మీడియాలో, వీడియోలను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు.
కన్నప్ప సినిమాకు ప్రభాస్ పెద్ద అసెట్ గా కనిపించవచ్చు. ఇప్పటి వరకు ప్రభాస్‌ను శివుడి పాత్రలో చూడలేదు. అదే కన్నప్ప ద్వారా జరిగితే ఇక సినిమా పీక్స్‌కు వెళ్లడాన్ని ఎవ్వరూ ఆపలేరంటున్నారు. ప్రభాస్‌ను శివుడిలా చూడడానికైనా థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తారని క్రిటిక్స్ తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు.



Click it and Unblock the Notifications
