Latest Updates
-
ప్రభుత్వ హాస్పిటల్స్ దుస్థితికి ఇదే నిదర్శనం.. ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్ కి ఎయిమ్స్ డైరెక్టర్! -
మెతుకు మిగల్చకుండా తినే రుచి..తమిళనాడు స్పెషల్ దిండిగల్ తలపకట్టి చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
క్రంచీ, టేస్టీ జీడిపప్పు పకోడి..మస్త్ కిక్కిచ్చే స్నాక్ ఈజీగా చేసుకోండిలా.. -
కరివేపాకు మరమరాలు..మూవీ, వెబ్ సిరీస్ చూస్తూ తినడానికి బెస్ట్ టేస్టీ,హెల్తీ స్నాక్ ! -
డీప్ ఫ్రై లేని హెల్తీ స్నాక్..సూపర్ టేస్టీ సగ్గుబియ్యం పొంగనాలు ఈజీగా ఇంట్లో చేసుకోండిలా.. -
ఈ చిన్న సీక్రెట్ తెలిస్తే..ఇంట్లోనే క్షణాల్లో రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ,సాఫ్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ -
వంకాయ దోసకాయ పచ్చడి..ఏంట టేస్ట్ రా బాబు మైండ్ నుంచి పోవట్లేదు అనాల్సిందే! -
తల్లిదండ్రులూ బీ అలర్ట్..పిల్లలకు సిరప్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి -
భూటాన్ స్పెషల్ ఎగ్ ఏమా దత్షీ..స్వర్గానికి బెత్తెడే దూరం! -
పండుగ రోజే దారుణం..భర్త డోర్ ఓపెన్ చేయగానే ప్రియుడితో సరసాలాడుతూ భార్య..రెండ్ హ్యాండెడ్ గా దొరకడంతో..
క్రిస్మస్ చెట్టుకూ ఓ చరిత్ర ఉంది తెలుసా.!
'కిస్మ్రస్ చెట్టుగా పచ్చని 'కొనిఫెరన్'ను ఉపయోగించటం ఆనవాయితీగా వస్తోంది. 16వ శతాబ్ధంలో జర్మనీలోనూ, 15వ శతాబ్ధంలో లివోనియా (ప్రస్తుతం ఈస్తోనియా, లాత్వియా)లో మొదట క్రిస్మస్ చెట్టును అలంకరించడం అనే సంప్రదాయం మొదలైందంటారు.
క్రిస్మస్ రోజుల్లో ఈ చెట్టుని ఇంటికి తెచ్చి కొవ్వొత్తులు లేదా విద్యుద్దీపాలతో, రకరకాల వస్తువులతో అందంగా అలంకరిస్తారు. క్రిస్మస్ చెట్టు పైభాగంలో నక్షత్రా (స్టార్) న్ని ఏర్పాటు చేస్తారు. చారిత్రకంగా క్రిస్మస్ చెట్టుని పరిశీలిస్తే ఈ సంప్రదాయం 1781లో బెన్షివిక్ సైనికుల ద్వారా కెనడాలోకి ప్రవేశించిందంటారు. 'జనరల్ ఫెడరిక్ అడాల్ఫ్ రెడిజిల్' అనే సైనికాధికారి ఇచ్చిన క్రిస్మస్ విందులో అతిథులను అబ్బురపరచటం కోసం 'ఫర్' చెట్టుని కొవ్వొత్తులతో, పండ్లతో అలంకరించాడట! 19వ శతాబ్ద ప్రారంభంలో ఈ సంప్రదాయం ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత రష్యాలాంటి దేశాల్లోనూ సంపన్న కుటుంబాలవారు క్రిస్మస్ చెట్టుని ఉపయోగించటం మొదలుపెట్టారు.
1816లో 'నస్సావో-విల్బర్గ్' యువరాణి 'హెన్రేటా' క్రిస్మస్ చెట్టుని వియన్నా దేశానికి పరిచయం చేసింది. ఆతర్వాత కాలంలో ఈ సంప్రదాయం ఆస్ట్రియాకి విస్తరించింది. ఫ్రాన్స్ దేశంలోకి 1840లో డచ్ వారి ద్వారా ఈ చెట్టు వచ్చింది. బ్రిటన్ దేశంలోకి 19వ శతాబ్ద ప్రారంభంలో క్రిస్మస్ సంప్రదాయంలో భాగమైంది. రాణి విక్టోరియా.. తనకు చిన్నప్పటి నుంచి ఈ చెట్టుతో అనుబంధం ఉన్నట్లు ఒక పత్రికలో పేర్కొన్నారు. ఆ తర్వాత కాలంలో ప్రపంచవ్యాప్తంగా కిస్మస్చెట్టు ప్రసిద్ధిచెందింది.

ఈ క్రిస్మస్ చెట్టు చరిత్ర ఇలా వుంటే మరో కథ ఒకటి చెప్తారు. ఆ కథేంటంటే..
''చాలా ఏళ్ళ క్రితం క్రీస్తు పుట్టినరోజున చర్చికి వెళ్లి, రకరకాల బహుమతులు ఇచ్చే సంప్రదాయం ఉండేది. అలా ఒక ఊరిలో ఉండే ప్లాబో అనే పేద పిల్లవాడికి ఏమివ్వాలో తెలియలేదు. ఏది కొనాలన్నా చేతిలో పైసా లేదు. ఏం చేయాలో తోచని ప్లాబో తన ఇంటిముందు ఓ అందమైన మొక్క కనిపించింది. దానిని తీసి, ఓ చిన్న కుండీలో పెట్టుకుని చర్చికి తీసికెళ్లాడు. అక్కడ ఎన్నో విలువైన కానుకలతో వచ్చిన వారంతా ప్లాబో చేతిలోని కుండీని చూసి ఎగతాళి చేశారు. ప్లాబో సిగ్గుపడుతూనే దానిని క్రీస్తు ప్రతిమ దగ్గర పెట్టాడు. ఆశ్చర్యంగా.. ఆ చిన్న మొక్క అప్పటికప్పుడు పెద్ద మొక్కగా ఎదిగి, బంగారు వృక్షంగా మారిపోయిందట! ప్రేమతో ఆ పేద బాలుడు తెచ్చిన కానుకే విశిష్టమైనది అయ్యింది. అందరూ ఆ బాలుడిని ఎగతాళి చేసినందుకు సిగ్గుపడ్డారు. మంచి మనస్సుతో ఇవ్వడం ముఖ్యమని అందరూ తెలుసుకున్నారు. ఇక అప్పటి నుంచి ప్రతిఏటా అందరూ క్రిస్మస్ చెట్టుని అలకరించడం మొదలుపెట్టారంట!''



Click it and Unblock the Notifications
