మహిళల పరుసులో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువులు

By Super

ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో హ్యాండ్ బ్యాగ్స్ ను ఉపయోగించడం ఎక్కువ. సాధారణంగా అమ్మాయిలు, డ్రెస్సింగ్, మేకప్, అలంకరణ వస్తువుల తర్వాత వారు వినియోగించే హ్యాండ్ బ్యాగులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందానికి, ఫ్యాషన్ కి తగ్గ హ్యాండ్ బ్యాగులను ఎంపిక చేసుకోవడం కూడా ఒక కళే. హ్యాండ్‌ బ్యాగ్... లోపల సూపర్‌మ్కాటే ఉన్నా చూపరులకు అందంగా కనిపించాలి. అమ్మాయిలకు అదనపు ఆకర్షణగా నిలవాలి. ఇలాంటి యాక్ససరీస్‌ తో కూడా సెంటరాఫ్ అట్రాక్షన్ అవ్వాలంటే ఎంపిక బాగుండాలి.

నేటి ఆధునిక కాలంలో మహిళల హ్యండ్ బ్యాగ్ వాడకం చాలా పెరిగింది. అన్నిరకాల స్ధాయిల వారికి, చిన్న వారి దగ్గర నుంచి పెద్ద వారి వరకు అందరికీ హ్యండ్ బ్యాగ్ కానీ, పర్సు కానీ వుండాలి. చేతిలో అవి వుంటే వారికి ఇక నిశ్చింత. హ్యాండ్ బ్యాగ్ చేతిలో వుంటే ఒక తోడు వుందన్న అనుభూతి కలుగుతుంది. సందర్భాన్ని బట్టి మనం ధరించే బ్యాగ్ మన స్టైల్ స్టేట్మెంట్ నే మార్చేస్తుంది. నలుగురిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. హ్యాండ్ బ్యాగులను సందర్భాన్ని బట్టి ఎత్తుకెళ్ళినప్పుడే ఆఫీస్ అయినా, ఫంక్షనయినా మీ చుట్టూ తిరుగుతుంది. మీ అవసరయ్యే వస్తువలన్నీ అందులోనే ఇనుమడింపజేసేస్తుంటారు. అంతే కాదు మీ వస్తువలకు ఇది సేఫ్ గా మరియు సెక్యూర్ గా నిలుస్తుంది. మరి అలాంటి హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యంగా ఉండాల్సిన కొన్ని వస్తువును ఈ క్రింది విధంగా సూచించడం జరిగింది...

వీటితో అమ్మాయిలకు అదనపు ఆకర్షణ: క్లిక్ చేయండి

లిప్ స్టిక్ :

లిప్ స్టిక్ :

మహిళలు వినియోగించే హ్యాండ్ బ్యాగ్ లేదా పర్స్ లో ఉండాల్సిన వస్తువులో ఒకటి లిప్ స్టిక్ , ఎందుకంటే ముఖంలో ఎక్కువగా ఫోకస్ చేసే ప్రదేశం పెదాలు , కాబట్టి, ప్రతి రోజూ మీకు మేకప్ వేసుకొనే తీరిక లేదా టైమ్ లేనప్పడు ఒక్క లిప్ స్టిక్ చాలు మిమ్మల్ని గ్లామరస్ గా చూపించడానికి . మేకప్ లేకున్నా మీ స్కిన్ టోన్ కు సరిపోయే లిప్ స్టిక్స్ ను ఎంపిక చేసుకొని బ్యాగ్ లో ఉంచుకుంటే మీకు అవసరం అయినప్పడు ఇవి ఉపయోగపడుతాయి. మిమ్మల్ని మరింత బెస్ట్ గా కనబడేలా చేస్తాయి.

డబ్బు:

డబ్బు:

మహిళల హ్యాండ్ బ్యాగ్ లో ఉండాల్సిన మరో అత్యవసరమైనది డబ్బు, చాలా వరకూ తల్లి వారి పిల్లల కోసం బయట వెళ్ళేప్పుడు ‘డబ్బు 'ఇస్తుంటారు , అయితే అదే డబ్బును అబ్బాయిలకు ఇవ్వడం వల్ల మొత్తం తప్పదారిపడుతారు . అందుకనీ తల్లల్లు చేయాల్సినవి చాలా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్ లో ఎంత పడితే అంత డబ్బు ఉచుకోవడం మీకు కానీ పిల్లలకు కానీ సురక్షితం కాదు, మీ అవసరాన్ని బట్టి, డబ్బును ఉంచుకోవడం మంచిది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ పనిచేయడం చోట డబ్బు అవసరం తప్పనిసరిగా ఉంటుంది.

 టాంపన్స్ లేదా ప్యాడ్స్

టాంపన్స్ లేదా ప్యాడ్స్

ముఖ్యంగా మహిళలు ఎదుర్కొనే సమస్య, నెలసరి సమస్య. ప్రతి ఒక్కరూ డేట్స్ లో అవగాహన కలిగి ఉండాలి. లేదా శరీరంలో మార్పులు హార్మోనుల ప్రభావం వల్ల వారికే తెలియకుండా ఎప్పుడుపడితే అప్పుడు పీరియడ్స్ అయ్యే వారికి ఇది ఒక ముందు జాగ్రత్త. కాబట్టి, ప్యాడ్స్ ను ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్ లో ఉంచుకోవడం వల్ల నలుగురిలో మర్యాదపూర్వకంగా ఉండగలుగుతారు.

బేబీవిప్స్:

బేబీవిప్స్:

మీకు పిల్లలున్న లేదా లేకున్నా కొన్ని సందర్భాల్లో బేబీ విప్స్ తో మీకు అవసరం ఉండవచ్చు . కాబట్టి మీ హ్యాండ్ బ్యాగ్ లో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువుల్లో ఇవి కూడా ఒకటి. ఒకటి రెండు బేబీ విప్స్ మీ బ్యాగులో ఉంచుకోవడం తప్పనిసరి.

ఆస్ప్రిన్ లేదా టైలినోల్:

ఆస్ప్రిన్ లేదా టైలినోల్:

ఎన్ని సార్లు మీరు బయట వెళుతుంటారు, తలనొప్పితో బాధపడుతుంటారు. ఇలాంటి సమస్య ఎదుర్కొనే వారిలో మీరు ఒక్కరైతే మీ బ్యాగ్ లో తప్పనిసరిగా ఆస్ప్రిన్ లేదా పెయిన్ రిలీఫ్ టాబ్లెట్ లేదా ఇతర హోం రెమెడీలు ఉంచుకోవడం వల్ల ప్రయాణంలో మీ అసౌకర్యాన్ని అరికట్టుకోవచ్చు.

ఒక పెన్:

ఒక పెన్:

ఇది చూడటానికి ఒక చిన్న కామన్ సెన్స్, మీకు పెన్ లేదా పెన్సిల్ అవసరం అవుతుంటాయి. అవి పర్సులో లేనప్పడు పర్సు అంతా ఇటూ అటూ గలికేస్తుంటారు. చివరకు ఐలైనర్ లేదా ఐపెన్సిల్స్ ను వాడేస్తుంటారు. కాబట్టి, కొన్ని పెన్నులు మీ బ్యాగ్ లో ఉంచుకోవడం మంచిది.

ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఇన్ఫర్ఫేమషన్:

ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఇన్ఫర్ఫేమషన్:

మళ్ళీ, మరో ముఖ్యమైన విషయం, చాలా సాధరణమైనటువంటివి మీ ఐడెంటిఫికేషన్ వివరాలను ఒక చోటో వ్రాసి ఉంచుకోవాలి. అందులో ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ . ప్రమాధవశాత్తు మీకైనా జరిగినా లేదా మీ పర్సు మిస్ అయినా ఎవరైనా గుర్గుంచడానికి పనికొస్తుంది. అన్ని ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ లేదా ప్రమాధకర పరిస్థితి ఏర్పడినప్పుడు ఇవి ఉపయోగపడుతాయి.

పెప్పర్ స్ప్రే:

పెప్పర్ స్ప్రే:

ప్రస్తుత రోజుల్లో జరుగుతున్న ధారుణాలను ద్రుష్టిలో ఉంచుకొని, వ్యక్తిగత సంరక్షణ కోసం మరియు మేస్ లేదా పెప్పర్ స్ప్రే ఉంచుకోండం మంచిది. ఈ మోడ్రన్ ‘ఆయుధం' అత్యంత ప్రమాధకరం కాకపోయినా, ఎమర్జెన్సీ సమయంలో తక్షణం తప్పించుకోవడానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

హ్యాండ్ సానిటైజర్:

హ్యాండ్ సానిటైజర్:

మీరు ఎక్కడికైన వెళ్ళినప్పుడు, లేదా కిరాణకొట్టుకు వెళ్ళినప్పుడు చేతులతో వస్తువులను తీసుకోవడం, పెట్టడం చేస్తుంటారు, కానీ చేతులను శుభ్రం చేసుకోవడం లేదా తుడవటం వంటివి చేయరు. లేదా మిమ్మల్ని ఇతరులు పరిచేయం చేసుకోవడం షేక్ హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంటాయి. అందుకు మరియు మరికొన్ని ఇతర కారణాల వల్ల మీ హ్యాండ్ బ్యాగ్ లో తప్పనిసరిగా సానిటైజర్ ను ఉంచుకోవడం చాలా అవసరం. ఇది మీకు మీ ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తుంది.

సేఫ్టీ పిన్స్:

సేఫ్టీ పిన్స్:

ప్రస్తుత రోజుల్లో వస్తున్న రెడీమేడ్ దుస్తులు కానీ, లేదా సరిగా స్టిచ్ చేయని దుస్తులు కానీవ్వండి ఒకానొక సందర్భంలో చిరగడం వల్ల చూడటానికి అసహ్యంగా,అసౌకర్యంగా ఉంటుంది . కాబట్టి, ఎమర్జెన్సీకి మీ పర్స్ లో సేఫ్టీ పిన్నులుంచుకోవడం చాలా అవసరం. మీరు పనిలో ఉన్నప్పుడు ఇలా అత్యవంతసరంగా ఏదైనా జరిగినప్పడు సేఫ్టీ పిన్నులు లేదా చిన్న సూదుల కిట్ అవసరం అవుతుంది.

Desktop Bottom Promotion