Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
అబద్దం చెప్పకుండా ఉండడానికి 7 కీలకమైన కారణాలు
అబద్ధం అనేది ఈరోజుల్లో ప్రతిఒక్కరిలో విస్తరించి ఉన్న ఒక సమస్య. ఇలాంటి ప్రవర్తన మీ జీవితంలో చాలా ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపవచ్చు. దీనివల్ల మీ స్నేహితుల, దగ్గరి, సమీప బంధువుల వద్ద మీపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవడం చాలా తేలిక. దీనితోపాటు, అబద్ధాలు చాలా మానసిక సమస్యలకు, జీవిత సమస్యలకు కారణం కావచ్చు. మీరు ఇప్పటికీ అలాగే ఉంటే, ఎన్నో సంవత్సరాలు ఈ పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. అబద్ధాలు అరికట్టడం, తగ్గించడం ద్వారా ఈ ప్రవర్తన వల్ల వచ్చే పరిస్థితుల చిక్కులను చాలా తేలికగా ఎదుర్కోవచ్చని నా అభిప్రాయం. అబద్ధం వల్ల మీ ఆనందం, ఎంపికలు ప్రభావం కావడానికి వీలులేదు. అబద్ధం అనేది మీ వ్యక్తిత్వాన్ని నెమ్మదిగా చంపుతుందని నేను రుజువు చేస్తాను. నేడు అబద్ధాన్ని ఆపడానికి 7 కీలకమైన కారణాలను పరిశీలించండి.

నిజాయితీ మిమ్మల్ని ధైర్యవంతుణ్ణి చేస్తుంది
అత్యంత ప్రమాదకర అబద్ధం కంటే అత్యంత ఇబ్బందికర నిజం చెప్పడానికి అధిక ధైర్యం అవసరం. మీరు నిజమనేది చాలా బలమైన, తెలివైన వారి ప్రాముఖ్యత అనేది తెలుసుకోవాలి. కొన్నిసార్లు కేవలం నిజం చెప్పడం అనేది చాలా కష్టంతో కూడుకున్నదని నేనూ అంగీకరిస్తాను, ప్రత్యేకించి అది అనుభూతులు, సంబంధాల విషయానికి వస్తే, కానీ మీరు వ్యవహరించే వ్యక్తి ఖచ్చితంగా మీ ధైర్యాన్ని అభినందిస్తారు.

ఇది నమ్మకాన్ని చెడకొడుతుంది
"నువ్వు నన్ను మోసం చేసావని నేను బాధపడ్డాను, ఇప్పటినుండి నేను నిన్ను నమ్మను అనేది నన్ను బాధిస్తుంది" అని ఒకప్పుడు ఫ్రైడ్ రిచ్ నీత్జస్కే చెప్పారు. ఈ విషయం అబద్ధాలు ఆడేవాళ్ళను ఎవ్వరూ నమ్మరని తెలియచేస్తుంది. సాధారణంగా అబద్ధం చెప్పలనుకునేవారు అధికారాన్ని కోల్పోతారు, వీడు అబద్ధాల కోరు అనే పేరుని సంపాదించుకుంటారు. ఎవరైతే నిజం చెప్తారో వారు ఎప్పుడూ ఇతరులచే ఎక్కువగా అభిమాని౦చబడతారు. నిజాయితీగా ఉండడం అనేది మీ కారెక్టర్ ని మంచిగా చేసి, మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపోదిస్తుంది.

ఒత్తిడి తగ్గుతుంది
ఎప్పుడైతే మీరు నిజం చెప్తారో, అప్పుడు మీకు ఒత్తిడి, బాధ తక్కువగా ఉంటాయి, ఎందుకంటే మీరు అబద్ధాల గురించి విపరీతంగా బాధపడనవసరం లేదుకాబట్టి. దానితోపాటు, నిజం చెప్పడం అనేది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఒత్తిడిని తగ్గించి, ఆలోచనను పదును చేస్తుంది. మీరుగనక మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవాలి అనుకుంటే, నిజాయితీగా ఉండడాన్ని మీ జీవితంలో ఒక భాగంగా అలవరుచుకోండి. మనుషులు ఒత్తిడి లేని జీవనశైలిని పొందాలంటే వారి శరీరం "సంతోషాన్ని ఇచ్చే హార్మోన్లు" ఎండార్ఫిన్లను ఉత్పత్తి చేస్తుంది. నిజం చెప్పడం వల్ల మీరు ఎంతో విశ్రాంతిగా, ప్రశాంతంగా ఉండవచ్చు.

అంతర్గత సంఘర్షణలు
అబద్ధం అనేది మీకు వివిధ రకాల అంతర్గత సంఘర్షణలను, ఒత్తిడిని కలిగిస్తుంది, అది అనేక సమస్యలతో మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. అబద్ధం చెప్పడం వల్ల ప్రమాదం ఉంది, ఒక్క విషయానికి అనేక అబద్ధాలు చెప్పవలసి వస్తుంది. ఇది మీ అంతర్గత సంఘర్షణకు కారణమై, ఈ విషయంలో మీరు ఏమీ చేయలేక పోతారు. ముందుముందు ఇది మీ నమ్మకంపై, ఆత్మగౌరవం పై ప్రభావం చూపిస్తుంది.

అబద్ధం అనేది ఒక పెద్ద సమస్యకు చిహ్నం
అన్నివేళలా అబద్ధం చెప్పే ఒక రకమైన వ్యక్తులు ఉన్నారు. ఈ విషయంపై ఎంత తీవ్రమైన చర్చ జరిగిందనేది విషయం కాదు. ఇలాంటి వారు తరచుగా అబద్ధాలు చెప్పి దానిని ఒక చెడ్డ అలవాటుగా మార్చుకుంటున్నారు. మీకు ఒక సమస్య ఎదురైనపుడు, మీకు ఒక వృత్తిపరమైన సహాయాన్ని అడగవచ్చు. ఇది మానసిక పరిస్థితి నుండి బైటపడడానికి ఒక అవకాశం ఇస్తుంది.

మీరు విజయాన్ని సాధించలేరు
అబద్ధం చెప్పెవల్లందరూ వారి జీవితపు "విజయవంతమైనదనే" చరిత్రను సృష్టిస్తారని మీకు తెలుసనీ నేను నమ్ముతాను, కానీ వారు తమ జీవితంలో విజయాన్ని కోల్పోతున్నారని తెలుసుకోలేకపోతున్నారు. ఇలాంటి విజయాలు వట్టివి అని నమ్మడానికి ప్రయత్నించండి, మీనుండి మీరు పారిపోకండి. మీరు అబద్ధం చెప్పడం వదిలేస్తే, ఒక మంచి జీవితం జీవించడానికి అవకాశం దొరికినట్లే.

అబద్ధం మీ సమస్యలను పరిష్కరించదు
అబద్ధం మీ అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని నమ్ముతున్నారా? ఒకవేళ అవును అయితే, మీరు చాలా తప్పుచేస్తున్నారు, ఇది సమస్యను పెంచుతుంది. నిజాయితీ అనేది ఎటువంటి పరిస్థితులలోనైనా మంచి పద్ధతి అనేది మీరు గుర్తుంచుకోండి. ఈ చెడు ఆటను ఆపేయండి, నిజం చెప్పండి, మీ పనులతో పరిస్థితులను ఎదుర్కోండి.
అబద్ధం చాలా ప్రమాదకరమైనది, నాశనం చేస్తుంది. మీరు సంతోషంగా, విజయవంతంగా ఉండాలంటే ఈ చెడ్డ అలవాటును మానుకోవడం మంచిది. ఎన్ని అబద్ధాలు చెప్తారు? ఎలా మీరు ఈ అలవాటుపై పోరాడతారు?



Click it and Unblock the Notifications
