Latest Updates
-
ఒక్క ముద్దలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.. వయసు మళ్లినవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ కుర్మా.! -
చర్మ అలెర్జీలకు గుడ్ బై!.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఇవే! -
పైసా లేదని పెళ్లిళ్లు చేసుకోరు, కానీ పిల్లల్ని కంటారు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా.? -
తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే తంజావూర్ అడై.. ఒక్కటి తిన్నా చాలు.! -
లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట! -
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.! -
పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు! -
కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా.? -
చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి! -
డా. మంతెన ఆరోగ్య చిట్కాలు.. అన్ని విటమిన్లనూ ఒకే కప్పులో అందించే ప్రకృతి రహస్యం ఇదే.!
నిద్రించే భంగిమ.. భార్యభర్తల బంధాన్ని తెలుపుతుందా ?
భార్యాభర్తలు నిద్రపోయే విధానాన్ని బట్టి వాళ్ల రిలేషన్ షిప్ స్టేటస్ తెలుసుకోవచ్చని మీకు తెలుసా ? నిజమే.. మీరు పడుకునే విధానం.. ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని వివరిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరు చాలా అన్యోన్యంగా.. రొమాంటిక్ పడుకుంటారు. మరికొందరు.. దూరదూరంగా పడుకుంటారు. అయితే ఏ పొజిషన్ లోపడుకునే వాళ్ల సంబంధ బాంధవ్యం ఎలా ఉంటుందో పసిగట్టేస్తున్నాయి స్టడీస్.
READ MORE: నిరంతరం ఆరోగ్యంగా ఉండటానికి నిద్రభంగిమ ఎలా ఉండాలి
బాడీ ల్యాంగ్వేజ్ ని బట్టి ఇద్దరు తమ భావోద్వేగాలను ఎలా పంచుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చట. మీ భాగస్వామి మీ పట్ల ఎలాంటి అనుబంధం ఏర్పరచుకున్నారు ? ఎంతవరకు ప్రేమను పంచగలుగుతున్నారో కూడా తెలుసుకోవచ్చట. మరి మీరు బెడ్ ని ఎలా షేర్ చేసుకుంటున్నారా ? మీ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది అని తెలుసుకోండి.

క్లోజ్ గా
ఈ పొజిషన్ లో మీ భర్త మీకు దగ్గరగా ఉంటారు. అంటే చాలా సన్నిహితంగా, సెక్యూర్ గా ఉంటారు. ఒకేసారి సాన్నిహిత్యాన్ని, రక్షణను కల్పిస్తూ ఉంటారు. ఈ పొజిషన్ మిమ్మల్ని నమ్ముతున్నానని తెలుపుతుంది.

కాళ్లు దూరంగా
ఒకరి కాళ్లు మరొకరు తాకకుండా.. దూరంగా పడుకునే వాళ్లు ఇద్దరూ స్వతంత్రంగా ఉంటారు. ఒకరిపై ఒకరు ఆధారపడకుండా ఉంటారు.

ఫేస్ టు ఫేస్
ఫేస్ టు ఫేస్ పడుకునే వాళ్లు రిలేషన్ చాలా బావుంటుంది. మీ భాగస్వామి కళ్లు మిమ్మల్ని రాత్రంతా చూడాలని భావిస్తున్నాయని తెలుపుతాయి. ఒకవేళ సడెన్ గా మీవైపు ఫేస్ చేసి పడుకున్నారంటే.. మీ నుంచి సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నారని అర్థం.

హగ్
ఈ పొజిషన్ ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని తెలుపుతుంది. ఇది ఎక్కువగా.. రిలేషన్ షిప్ ఏర్పడిన కొత్తలో ఉంటుంది. ఈ పొజిషన్ లో ఎక్కువ ప్రేమను పంచుకుంటారు.. కోరుకుంటారు.

ఒకరినొకరు సన్నిహితంగా
ఈ పొజిషన్ లో నిద్రపోవడం రిలేషన్ షిప్ లో చాలా పాపులర్. భార్య వైపు తిరిగి భర్త నిద్రించడం.. ద్వారా వాళ్ల మధ్య రిలేషన్ స్ట్రాంగ్ గా ఉందని తెలుపుతుంది.

భుజానికి ఆనుకుని
భాగస్వామి భుజాలకు ఆనుకుని నిద్రించడం ద్వారా వాళ్ల మధ్య రిలేషన్ మరింత పెరుగుతుంది. చాలా కేరింగ్ గా, సాన్నిహిత్యంగా, చాలా ఆనందంగా ఉన్న బంధాన్ని వివరిస్తుంది.

చెస్ట్ పై నిద్రించడం
భాగస్వామి చెస్ట్ పై నిద్రించే పొజిషన్ ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకాన్ని వివరిస్తుంది. భాగస్వామికి వెనకవైపు కౌగిలించుకుని పడుకుంటే.. తనకు రక్షణ కల్పిస్తున్నారని అర్థం. అదే మీ భాగస్వామికి ముఖం చేసి పడుకుంటే.. అతనిపై ఆధారపడ్డారని అర్థం. అదే భాగస్వామి చెస్ట్ పై నిద్రిస్తుంటే.. సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారని అర్థం.

ఇరువైపులా
ఒక్కొక్కరు ఒక్కో వైపు పడుకుంటే.. ఇద్దరి మధ్య నమ్మకం ఉందని.. సంబంధాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారని తెలుపుతుంది.

లెగ్ హగ్
కాలి స్పర్శతో.. భాగస్వామి మీద ఉన్న ప్రేమను వివరిస్తారు. మరో కోణం.. ఇద్దరి మధ్య ఉన్న క్లోజ్ నెస్ కి లెగ్ హగ్ సీక్రెట్ కోడ్.

ఒకరినొకరు పట్టిచుకోకుండా
భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు పట్టించుకోకుండా.. ఎవరిపాటికి వాళ్లు నిద్రించడంలో చాలా అర్థాలున్నాయి. రిలేషన్ లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, పొత్తులు కుదరనప్పుడు, ఇద్దరి మధ్య గొడవలు ఉన్నప్పుడు ఈ పొజిషన్ ని ఎంచుకుంటారు.



Click it and Unblock the Notifications
