Latest Updates
-
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.!
ముక్కు షేప్ లోనే ఉంది అసలు రహస్యం
మనుషుల వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలంటే.. వారితో స్నేహం చేయాలా ? అవసరం లేదు.. ముక్కు ఆకారాన్ని చూసి కూడా.. వాళ్ల మనస్తత్వం చెప్పేయచ్చంటున్నాయి అధ్యయనాలు. ఎదుటివాళ్ల ఆలోనలు, అభిప్రాయాలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటాయి. కానీ.. వ్యక్తిత్వం మాత్రం మార్చలేనిది. అందుకే అది తెలిసుకోవాలంటే.. ముక్కు ఆకారాన్ని గమనించండి.
Read more:ముఖ భాగాలలో ముక్కు ప్రధానం!
మనసులోని భావాలు సందర్భాన్నిబట్టి మారవచ్చు. ఒక్కో సమయంలో ఒక్కోలా భావాలు మారిపోతుంటాయి. కాబట్టి ముఖం చూసి అంచనా వేయడం కష్టమే. కానీ ఎప్పటికీ ఒకేలా ఉండే ముక్కు చూసి సరిగ్గా అంచనా వేయవచ్చంటున్నాయి అధ్యయాలు. ఇంతకీ ఏ ఆకారం ముక్కు గలవాళ్లు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారో తెలుసుకుందామా...

చిన్న ముక్కు
చిన్న ముక్కు ఉన్నవాళ్లు చాలా స్నేహపూర్వకంగా.. ఆనందంగా ఉంటారు. కానీ.. త్వరగా కోపానికి గురవుతారు. భావోద్వేగాలు ఎక్కువ. సమస్యలు ఎదురయైనా.. ఎక్కువ ఇబ్బందులు పడరు.

పెద్ద ముక్కు
వీళ్లు కాస్త మొండిగా వ్యవహరిస్తారు. కొత్త కొత్త అలవాట్లు, పనులు, టూర్ ల ద్వారా వాళ్ల ప్రపంచాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటారు. పొడవాటి ముక్కు ఉన్నవాళ్లు ఇమ్మెచ్యూర్ గా ఉంటారు. సంతోషంగా ఉండలేరు. రిలేషన్స్ ని స్ట్రాంగ్ చేసుకోవడంలో వీళ్లు విఫలమవుతారు.

వంగినట్లుగా ఉండే ముక్కు
వంగినట్లుగా ఉండే ముక్కు గలవాళ్ల వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది. వీళ్ల అభిరుచులు అందరినీ ఎట్రాక్ట్ చేస్తాయి. పద్ధతులను రాసుకుని పెట్టుకోవడం వల్ల ఇతరులను కలిసినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

క్రిందవైపుకి ఉంటే
వీళ్లు ఎక్కువగా అసంతృప్తి ఫీలవుతుంటారు. నిరాశావాదులుగా చెప్పవచ్చు. భవిష్యత్ గురించి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ఎక్కువగా తనచుట్టూ ఉన్నవాళ్లతో గొడవపడటం.. పోట్లాడటం చేస్తుంటారు.

గ్రీక్ నోస్
గ్రీక్ నోస్ అంటే.. నిటారుగా.. స్ట్రెయిట్ గా.. ఉంటుంది. వీళ్లు చాలా సృజనాత్మకంగా ఆలోచిస్తారు. ఇతరులకు సహాయం చేయాలన్న గొప్ప ఆలోచనలతో ఉంటారు.

పాయింటెడ్ నోస్
వీళ్ల వ్యక్తిత్వం చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. తమ గురించి ఎక్కువగా చాటిచెప్పుకుంటారు. కారణాలు వెతుక్కుంటూ ఉంటారు. కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తూ ఉంటారు.

గ్రూవ్ నోస్
ముక్కుకి పైపెదవికి మధ్యలో ఉండే దాన్ని గ్రూవ్ అంటారు. ఇలాంటి ముక్కు ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తపరులు, ఆలోచనాపరులు. ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించడాన్ని ఇష్టపడతారు.

పర్ఫెక్ట్ నోస్
ఈ ముక్కు చాలా సూటిగా.. అందంగా ఉంటుంది. ఈ ముక్కు ఉన్న వాళ్లు అనుకున్నది ఫలించదు. ఈ ముక్కు ఆకారం చాలా అరుదుగా ఉంటుంది. చాలామంది ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఫర్ఫెక్ట్ ముక్కును పొందుతారు.



Click it and Unblock the Notifications
