Latest Updates
-
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి
చైనాకు సంబంధించిన కొన్ని వింతైన మరియు ఆశ్చర్యకరమైన విషయాలు
చైనా దేశంలో ప్రముఖ బ్రాండ్స్ కు చెందిన దాదాపు అన్ని వస్తువుల నకలు లభ్యమవుతుందన్న విషయం తెలిసిందే. అయితే చైనీస్ ఉత్పత్తులకు గ్యారంటీ లేదని ఎంతమంది చెబుతున్నా మనలో చాలా మంది చైనీస్ వస్తువులకు ఆకర్షితమవుతాము.
ఇంకా చెప్పాలంటే, భారత మార్కెట్లో కూడా చైనా వస్తువులు దర్శనమిస్తున్నాయి కూడా. అంతే కాదు, వివిధ దేశాలలో కూడా చైనీస్ ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయి. ఈ విషయం, చైనా శక్తిన ఈ తెలియచేస్తోంది. నకలు వస్తువులే అయినా ప్రజలను ఆకర్షించేటటువంటి ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంలో చైనా శక్తివంతమైన పాత్ర పోషిస్తోంది.
చైనా ఎంతో సుందరమైన ప్రదేశం. అయితే, చైనాకు చెందిన మరిన్ని ఆకర్షణీయమైన సంగతులు మరింతగా అందరినీ ఆకర్షిస్తుంటాయి.
చైనీస్ ప్రజలు కేవలం తమ అందంతోనే కాకుండా తమ తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తుంటారు. వీరిని వారి పేర్లతో అలాగే వారి ముఖకవళికలతో గుర్తించడం బయటివారికి కొంచెం కష్టంగా ఉంటుంది. వీరందరూ చూడడానికి దాదాపు ఒక్కలాగే ఉంటారు. అలాగే వీరి పేర్లు కూడా పలకడానికి అలాగే గుర్తుంచుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటాయి.
వ్యూహాలను రచించడంలో వారికెవరూ సాటి రారు. అందుకే, వారు సూపర్ పవర్ గా అభివృద్ధి చెందుతున్నారు. ఈ ఆర్టికల్ లో చైనాకు చెందిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను మీతో పంచుకుంటున్నాము.
చైనాకు చెందిన ఆశ్చర్యకరమైన విషయాలు

మీ వర్జినిటీని తిరిగి పొందండి
పెళ్లికానీ అమ్మాయి తన వర్జీనిటీని పోగొట్టుకుంటే తిరిగి చైనాలో వర్జినిటీని పొందవచ్చు. చైనీస్ మహిళలు ఈ సౌలభ్యం కోసం ఎంతో ఖర్చు చేసి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు. ఆ విధంగా పోగొట్టుకున్న కన్నెపొరను తిరిగి పొందుతారు.

మూత్రంలో గుడ్లను ఉడకపెడతారు
చైనాలో మూత్రంలో గుడ్లను ఉడకపెడతారు. ఇందుకోసం, పూర్తి రోజుకు చెందిన పదేళ్లలోపు పిల్లల మూత్రాన్ని స్కూల్ టాయిలెట్స్ నుంచి సేకరిస్తారు. ఇటువంటి గుడ్లను తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వీరు నమ్ముతారు.

ఎక్కడైనా నిద్రపోవచ్చు
చైనా ప్రజలు నిద్రకు అమితమైన ప్రాధాన్యతనిస్తారు. ప్రత్యేకించి వీరు మధ్యాహ్నం నిద్రను అస్సలు నిర్లక్షయం చేయరు. మధ్యాహ్నం లంచ్ చేసిన తరువాత నిద్రకై వారికి ఒకవేళ సరైన ప్లేస్ దొరకకపోతే వారు వీధుల్లో కూడా నిద్రిస్తారు. స్కూల్స్ లో కూడా లంచ్ అయిన తరువాత కనీసం ముప్పై నిమిషాలు ఒక చిన్న మధ్యాహ్నపు కునుకు తీయడానికి పిల్లలకు విరామం ఇస్తారు.

కుక్కలను భుజిస్తారు
చైనాలో విశేషంగా జరిగే డాగ్ ఫెస్టివల్ సందర్భంగా చైనా ప్రజలు కుక్కలను భుజిస్తారు. కుక్కల మాంసం శరీరంలోని వేడిని పెంచి ఆరోగ్యంతో పాటు అదృష్టాన్ని ఆకర్షిస్తుందని చైనీయుల నమ్మకం.

బాయ్ ఫ్రెండ్స్ ను అద్దెకిస్తారు
చైనాలోని ఒంటరి మహిళలు బాయ్ ఫ్రెండ్ ను అద్దెకు తీసుకోవచ్చు. ప్రత్యేకించి, లూనార్ న్యూ ఇయర్ సందర్భంగా ఒంటరిగా ఉండే మహిళలకు కళంకమని అక్కడి వారి నమ్మకం. అందుకని, వారి బంధుమిత్రుల నోళ్లు మూయించడం కోసం చైనాలోని ఒంటరి మహిళలు ఈ సందర్భంగా బాయ్ ఫ్రెండ్స్ ను అద్దెకు తీసుకోవడాన్ని ఇష్టపడతారు.

పిల్లలను కనడానికి ముందస్తు అనుమతి
చైనాలోని పిల్లలను కనాలంటే అక్కడి ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతిని పొందాలి. పిల్లలను పొందాలనుకుంటే జంటలు పిల్లల కోసం ప్లాన్ చేయడానికి కనీసం మూడు నెలల ముందునుంచే అనుమతి పత్రాన్ని నింపి దరఖాస్తు చేయాలి. అంతే కాదు, వన్ చైల్డ్ పాలసీని అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం ఒంటరి పిల్లలు తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారని తెలుసుకుని దాదాపు ముప్పై ఐదేళ్ల తరువాత మరలా ఆ పాలసీని వెనక్కు తీసుకుంది.

నంబర్ టూ కోసం స్ప్లిట్ ప్యాంట్స్
చైనాలోని పిల్లల కోసం స్ప్లిట్ ప్యాంట్స్ ను ఎక్కువగా వాడతారు. వెనుకవైపు చీలికలా ఉండటం వల్ల పిల్లలు నంబర్ టూకి ఈజీగా వెళ్ళవచ్చు. చైనాలోని స్ప్లిట్ ప్యాంట్స్ ను పిల్లలకై వాడటం అత్యంత సాధారణమైన విషయం.



Click it and Unblock the Notifications
