Latest Updates
-
వీకెండ్ స్పెషల్: రొటీన్ కు భిన్నంగా ఆంధ్రా స్టైల్ కరివేపాకు తొక్కు చికెన్.. టేస్ట్ చేస్తే వదలరు! -
బుధుడి అరుదైన నక్షత్ర సంచారం..5 రాశుల వారు కుబేరులు కావడం ఖాయం! -
త్వరగా ప్రెగ్నెన్సీ రావాలంటే భార్యాభర్తలు తప్పక చేయాల్సిన 5 పనులు -
మైదా,చక్కెర లేకుండా ఆరోగ్యకరమైన రాగి బూరెలు.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే! -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ హై ప్రొటీన్ జొన్న గుగ్గిళ్లు తినాల్సిందే..ఈజీగా చేసుకోండిలా.. -
స్మోకింగ్ చేసినా కొందరికి క్యాన్సర్ ఎందుకు రాదు? సీక్రెట్ ఇదే! -
వీకెండ్ అయినా, గెస్ట్స్ వచ్చినా..ఎగ్ పులావ్ ఇలా చేస్తే కిచెన్ లోనే ఉండిపోతారు! -
ఆగస్టు నెల రాశి ఫలాలు: ఈ 5 రాశుల వారికి తిరుగులేని విజయం..మీ రాశి ఉందో లేదో చూసుకోండి! -
ఎందుకు నాన్నలకు కూతుళ్లంటే అంత ప్రాణం? -
రీసెర్చ్ ప్రకారం ఒక పురుషుడు ఎంతసేపు శృంగారం చేయగలడు? శీఘ్రస్కలనం గురించి ముఖ్య నిజాలు..
ఎవరూ బద్దలు కొట్టకుండా.. ఇండియన్స్ సెట్ చేసిన వరల్డ్ రికార్డ్స్..!
ప్రపంచంలోనే మంచి స్థానంలో నిలబడే స్థానం వస్తే.. ఇండియన్స్ అలాంటి ఛాన్స్ ఎట్టిపరిస్థితిల్లో మిస్ చేసుకోరు. ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద టెక్ కంపెనీగా ప్రసిద్ధి పొందింది. అంతేకాదు.. ఇండియా చాలా విషయాల్లో, చాలా పనుల్లో వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. వాటిని.. ఇప్పట్లో ఎవరూ క్రాస్ చేయలేరన్న భావన కలిగిస్తాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద జిలేబీ, ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టర్.. ఇలా రకరకాల క్రేజీ విషయాల్లో ఇండియా వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. వాటిని చూస్తే.. ఇండియన్స్ మనం గర్వపడాలనిపిస్తుంది. మరి.. ఎవరూ క్రాస్ చేయలేని.. ఇండియన్ వరల్డ్ రికార్డ్స్ ఏంటో చూద్దామా..

నిర్విరామంగా సోలో డ్యాన్స్
37 ఏళ్ల కళామండలం హేమలత డ్యాన్సింగ్ క్వీన్ ఆఫ్ కేరళగా పాపులర్ అయింది. ఈమె 123 గంటలా 13 నిమిషాలు.. అంటే,.. 5 రోజులకంటే.. ఎక్కువ సేపు నిద్ర లేకుండా.. కేవలం డ్యాన్స్ చేయడం నిజంగా గ్రేట్ కదూ..
Image Courtesy

హైవేలో 3డీ ఆర్ట్
గుజరాత్ కి చెందిన సౌమ్య థాకూర్, శకుంతల పాండ్య అతి పెద్ద త్రీడీ జీబ్రా క్రాసింగ్ పెయింటింగ్ తో అందరినీ ఆకట్టుకున్నారు. వీళ్లు రోడ్ సేఫ్టీ గురించి వివరిస్తూ.. ఈ ఆర్ట్ వేశారు.
Image Courtesy

ముక్కుతో టైప్ చేయడం
హైదరాబాద్ కి చెందిన కుర్షీద్ హుస్సేన్.. ఏడేళ్ల క్రితం రికార్డ్ ని బ్రేక్ చేశాడు. తన ముక్కుతో ఎక్కువ అక్షరాలు ట్రై చేసి.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. కేవలం 47 సెకన్లలో 103 అక్షరాలను టైప్ చేశాడు. అంటే వేళ్లతో టైప్ చేసేదానికంటే వేగంగా టైప్ చేశాడు.

అతిపెద్ద ప్లాస్టిక్ బాటిల్ రీసైక్లింగ్
బిస్లరీ కంపెనీ.. 1.1 మిలియన్ ఉపయోగించిన బాటిల్స్ ని రీసైక్లింగ్ కోసం కలెక్ట్ చేసింది. 105 స్కూల్స్ 2 లక్షల మంది విద్యార్థుల సహాయంతో ఇన్ని బాటిల్స్ కలెక్ట్ చేసింది.

అతిపెద్ద మీసం
58 ఏళ్ల రామ్ సింగ్ చౌహాన్ అనే వ్యక్తి.. 1970 నుంచి ఇప్పటి వరకు తన మీసాలను పెంచుతూ.. 14 అడుగుల పొడవు పెంచాడు.
Image Courtesy

అతిపెద్ద జిలేబీ
ముంబైలో 18 కేజీల 9 అడుగుల వెడల్పుతో.. జిలేజీ తయారు చేశారు. దీన్ని సంజీవ్ కపూర్ గెస్ట్ గా వెళ్లారు. 53 నిమిషాలపాటు.. ఈ జిలేబీని తయారు చేశారు.. కానీ.. 40 నిమిషాల్లోలోపే దీన్ని తీనేశారు.
Image Courtesy

ఫిల్మ్ పోస్టర్
కోచీలో గతంలో ఎన్నడూ లేని విధంగా.. సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన బాహుబలి సినిమా పోస్టర్ ని 50 వేల చదరపు మీటర్ల ప్రాంతంలో.. ఏర్పాటు చేసి.. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది.
Image Courtesy

అతిపెద్ద దుర్గావిగ్రహం
కలకత్తాకి చెందిన దేశ్ ప్రియ పార్క్ పూజ కమిటీ.. 88 అడుగులు బై 89 అడుగులతో.. దుర్గాదేవి విగ్రహాన్ని 2015లో దుర్గా పూజ సమయంలో ఏర్పాటు చేశారు. దీని కోసం పెట్టిన ఎఫర్ట్స్ చాలా గొప్పవి. 40 మంది కంటే.. ఎక్కువ మంది 2 నెలలు కష్టపడి 50 లక్షలు ఖర్చు చేసి.. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

అత్యంత ఖర్చుతో కూడిన వివాహం
ఇండియాలో పెళ్లిళ్లు అంటే.. చాలా క్రేజీగా జరుగుతాయి. వ్యాపారవేత్త లక్ష్మీ మిట్టల్ కూతురు వనిషా పెళ్లి ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ అమిత్ భాటియాతో 2014లో జరిగింది. ఈ ఆరురోజు ఈవెంట్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. వీళ్ల పెళ్లికి ఎంత ఖర్చు అయిందో తెలుసా.. 439 కోట్లు.
Image Courtesy



Click it and Unblock the Notifications