Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
అలర్ట్: జీవితంలో ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిన వ్యక్తులు!
మన పురాణ కథలు, కావ్యాలు మన జీవితంలో చాలా నేర్పిస్తాయి. అవన్నీ మనకు ప్రోత్సాహకాలు, అనుభవాలను వివరించే గొప్ప కథలు. అందుకే.. మహాభారతంను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచిస్తూ ఉంటారు. మహాభారతం ద్వారా మనం ఎన్నో లైఫ్ లెసెన్స్ ని తెలుసుకుంటూ ఉంటాం.
ముఖ్యంగా భీష్ముడు.. చాలా గొప్ప వక్త, సాహసం కలిగిన యుద్ధ వీరుడు. ఈయన బాణాలపై పడుకున్నప్పుడు.. యుధిశ్రితుడికి కొన్ని లైఫ్ లెసెన్స్ వివరించాడు. ముఖ్యంగా జీవితంలో ఎలాంటి వ్యక్తులు, ఎలాంటి స్వభావం కలిగిన వాళ్లకు దూరంగా ఉండాలి అనే విషయాన్ని చాలా క్లియర్ గా వివరించాడు. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే.. కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉండాలని సూచించారు. మరి ఎవరికి దూరంగా ఉండాలో తెలుసుకుందామా..

తన మరణం
భీష్ముడికి.. తన మరణం ఏ సమయంలో సంభవించాలో తానే నిర్ణయించుకునే శక్తి ఉంది. మరణానికి దగ్గర అయినప్పుడు జీవితంలో కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉండాలని సూచించారు.

లేజీగా ఉండేవాళ్లకు
లేజీగా ఉండే వ్యక్తులకు చాలా దూరంగా ఉండాలని సూచించారు. ఎందుకంటే.. వాళ్లు వాళ్ల సోమరితనాన్ని ఇతరులకు అంటేలా చేస్తారు. కాబట్టి లేజీగా ఉండేవాళ్లతో ఫ్రెండ్ షిప్ చేయకండి.

నమ్మకం లేనివాళ్లకు
నాస్తికత్వం అనేది వేరేవిషయం. కానీ.. ఆధ్మాత్మిక, మానసికతపై ఎలాంటి నమ్మకం లేకుండా ఉండటమనేది చాలా భయంకరమైన విషయం. కేవలం తన గురించి ఆలోచించే వ్యక్తులతో స్నేహం మంచిది కాదు.

దూకుడు స్వభావం
చాలా దూకుడు స్వభావం ఉండే వాళ్లు, రెచ్చగొట్టే తత్వం ఉండేవాళ్లు చాలా డేంజరస్. కాబట్టి వాళ్లతో ఫ్రెండ్ షిప్ కి దూరంగా ఉండటం మంచిది. కాబట్టి అలాంటి వాళ్లకు దూరంగా ఉండండి.

ద్వేషపూరిత వ్యక్తులు
ద్వేషం, స్వార్థం కలిగిన వాళ్లు.. ప్రతిదాన్ని నెగటివ్ గానే చూస్తారు. అలాంటి వ్యక్తులు మీతో ఫ్రెండ్ షిప్ చేస్తే.. వాళ్ల నెగటివిటీని మీకు పాస్ చేస్తారు. జీవితంలో ప్రతిసారి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్లకు దూరంగా ఉండాలి.

ఫ్రెండ్స్
ప్రతి ఒక్కరికీ జీవితంలో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉండాలి. కానీ.. తన చుట్టూ జరుగుతున్న విషయాలపై అన్ని సందర్భాల్లో అలర్ట్ గా ఉండాలి. ఇది సత్యం.

టాస్క్
ఒక వ్యక్తి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే.. తనకు అప్పగించిన ధర్మమే స్నేహితుడని భీష్ముడు వివరించాడు. ఒకవేళ మీకు ఏదైనా టాస్క్ ఇచ్చి పూర్తిచేయాల్సి వచ్చినప్పుడు.. అది ఖచ్చితంగా పూర్తి చేయాలి. ముందుగా మీ పనికి ప్రాధాన్యత ఇవ్వాలి.

ఇతర స్నేహితులు
ప్రతి వ్యక్తి నాలుగు రకాల స్నేహితులను కలిగి ఉండాలి. సాధారణ, ఫ్యామిలీ ఫ్రెండ్స్, న్యాచురల్ ఫ్రెండ్స్, ఆర్టిఫిషియల్ ఫ్రెండ్స్. ఈ నాలుగు రకాల స్నేహితులు జీవితంలో.. విభిన్నమైన ప్రయోజనాల కోసం సహాయపడతారు.

మగవాళ్లు పనిచేయాలి
మగవాళ్లు ఖచ్చితంగా ఎప్పుడూ కష్టపడి పనిచేయాలి. డబ్బు సంపాదించాలి. తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్లకు మంచి భవిష్యత్ ని ఇవ్వాలి.

డబ్బుని జాగ్రత్తగా చూసుకోవాలి
మగవాళ్లు తమ డబ్బుని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. అది ఎక్కడ దాచిపెట్టే విషయాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఎవరికీ చెప్పకూడదు.

అందరికీ రక్షణ
ఒక వ్యక్తి ఖచ్చితంగా.. ఎప్పుడూ.. తనను సంరక్షించుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులను కూడా సంరక్షించుకోవాలి. తన కుటుంబాన్ని సంరక్షించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లవచ్చు.

అతిపెద్ద ధర్మం
జీవితంలో అతిపెద్ద ధర్మం.. జాలి, దయాగుణం కలిగి ఉండటం. ఇతరులు సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్లను ప్రొటెక్ట్ చేయడం మంచిదే.. కానీ.. మీ జీవితాన్ని రిస్క్ లో పెట్టుకోకూడదు.

నరకం
తమ చుట్టూ ఉండేవాళ్ల కోసం ఫలితం లేకుండా ఉండేవాళ్లు, క్షమాగుణం లేనివాళ్లు.. డైరెక్ట్ గా నరకానికి వెళ్తారని భీష్ముడు వివరించాడు.

ఇబ్బందికరమైన జీవితం
సంతోషం, బాధ, ప్రశాంతమైన విషయం, అప్రశాంతమైన జీవితం.. అన్నింటినీ.. గొప్ప వ్యక్తులు ఖచ్చితంగా అంగీకరిస్తారు. దేవుడి నిర్ణయాన్ని ప్రశ్నించరు.

కలవడం, విడిపోవడం
జీవితంలో ఏ ఒక్క వ్యక్తితోనే ప్రేమగా ఉండకపోతే.. మీ లైఫ్ లో మనుషులు కలుస్తారు, విడిపోతారు. అంతేకానీ.. మీతో ఎవరూ.. లైఫ్ లాంగ్ ఉండలేరు. కాబట్టి ప్రేమగా ఉండాలి. ప్రేమను పంచాలి.

సున్నితంగా, కఠినంగా
మానసికంగా ఒక వ్యక్తి సున్నితంగా, కఠినంగా రెండు విధాలుగా ఉండే వ్యక్తులకు ఎప్పుడు కోపం వస్తుందో.. మళ్లీ ఎప్పుడు నెమ్మదిగా ఉంటారో అర్థం కారు. ఇలాంటి వ్యక్తులు శత్రువులపై విజయాన్ని ఎఫెక్టివ్ గా పొందుతారు.

పని పూర్తిచేయడం
తమకు అప్పగించిన పనిని పూర్తిగా పూర్తి చేయాలి. ఎట్టిపరిస్థితుల్లో మధ్యలో వదిలిపెట్టకూడదు. పూర్తి చేయడంలో జాగ్రత్త వహించాలి. చిన్న ముళ్లైనా.. శరీరంలో నొప్పి పుట్టించే పవర్ కలిగి ఉంటుంది. కాబట్టి.. చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఎక్స్ పెక్టేషన్స్
ఇతరుల నుంచి ఏమీ ఆశించని వ్యక్తులు.. సంతోషంగా నిద్రపోతారు.. అలాగే.. జీవితంలో చాలా సంతోషాన్ని పొందుతారు.

హార్ట్ బ్రేక్
నిజమైన ప్రేమను తెంచుకోవడం చాలా కష్టం. కానీ ఒక్కసారి తెగిపోయిందంటే.. మళ్లీ అతికించడం కూడా చాలా కష్టం. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా.. ఎల్లప్పుడూ రిలేషన్ లో ఉండాలి.

హ్యాపీ లైఫ్
చూశారుగా జీవితంలో ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి, ఎవరితో.. ఎలా ఉండాలో. ఈ టిప్స్ ఫాలో అవుతూ.. మీ జీవితాన్ని హ్యాపీగా మార్చుకోండి.



Click it and Unblock the Notifications