Latest Updates
-
కూరలను కూడా పక్కన పెట్టి కడుపు నిండా తినేలా చేసే కాలీఫ్లవర్ పచ్చడి.. ఆవకాయ కంటే ఈజీగా.! -
దివ్యమైన మంగళ గోచారం: 55 రోజుల పాటు ఈ నాలుగు రాశుల వారికి రాజయోగమే.! -
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే.. -
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది!
మ్యూజిక్ లవర్స్ ని ఎట్రాక్ట్ చేసే విభిన్నమైన సంగీత వాయిద్యాలు..
మ్యూజిక్ వింటూ ఈ ప్రపంచాన్నే మరిచిపోవచ్చు. ఎంతో ఆహ్లాదంగా, అలసటను మరిచిపోయి, ఈ లోకాన్ని మైమరిచిపోయే ఎంజాయ్ చేసే అద్భుతం మ్యూజిక్. ఎలాంటి బాధలో ఉన్నా.. కాసేపు వినసొంపైన మ్యూజిక్ వింటే చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది.
అంతేకాదు.. ప్రకృతిలో వినిపించే మృదంగాలు కూడా మనకు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. నీటి బిందువుల చప్పుడు, కోయిన కూనిరాగాలు ్ఊడా మనసుపొరల్లో ఆనందాన్ని కలిగిస్తాయి. ఇలాంటివన్నీ ప్రకృతి నుంచి వచ్చే చక్కటి శబ్ధాలు.
అయితే కొంతమంది మ్యూజిక్ అంటే ప్రాణం ఇస్తారు. అందుకే.. ఆ ఫీల్డ్ లో వాళ్లు రాణిస్తారు. మరికొందరికి పియానో, గిటార్ అవసరం లేకుండానే అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేయగలుగుతారు. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా ?
ఇవాళ అలాంటి అద్భుతమైన, మీరు ఊహించని, ఫన్నీ, క్రేజీ సౌండింగ్ సంగీత వాయిద్యాలను పరిచయం చేస్తున్నాం. ఇవన్నీ రకరకాల వస్తువులతో తయారు చేశారు. మరి అలాంటి విభిన్నమైన వాయిద్యాలను మీకూ చూడాలని ఉందా..

విభిన్నమైన మ్యూజిక్ ఇన్ట్రుమెంట్స్
దీన్ని పూర్వకాలానికి చెందిన ఏరోఫోన్స్ గా పిలుస్తారు. 40 వేల సంవత్సరాల క్రితం దీన్ని ఉపయోగించేవాళ్లు. దీన్ని నార్త్ ఆస్ట్రేలియాకి చెందిన అబోరిజినల్ వ్యక్తులు రూపొందించారు. ఈ వాయిద్యాన్ని ఇప్పటికీ కొంతమంది వాయిస్తున్నారు.

నికెల్ హల్ప్రా
స్వీడెష్ కి చెందిన మ్యూజికల్ ఇన్ట్రుమెంట్. 16 స్ట్రింగ్స్, 37 కీస్ ఉంటాయి. ఇది కూడా.. పూర్వకాలానికి చెందిన సంగీత వాయిద్యం అయినప్పటికీ.. ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు.

కాజోన్
ఇది చెక్క బాక్స్. దీన్ని పర్క్యూజన్ ఇన్ట్రుమెంట్ గా ఉపయోగిస్తారు. ఈ మ్యూజికల్ ఇన్ట్రుమెంట్ ఆఫ్రికన్ బానిసలు రూపొందించారు.

సింగింగ్, రింగింగ్ ట్రీ
స్టీల్ పైప్స్ ఉపయోగించి, రకరకాల పొడవులు, వెడల్పు కలిగిన పైపుల ద్వారా దీన్ని రూపొందించారు. ఈ వాయిద్యాన్ని మైక్ టాన్ కిన్, అన్నా లియో అనే వ్యక్తులు రూపొందించారు.

సింబలామ్
ఈ వాయిద్యం హంగరీ ప్రాంతంలో చాలా ఫేమస్. ఇందులో మెటల్ స్ట్రింగ్స్ ఉపయోగించారు. దీన్ని వాయించడం, వచ్చే మ్యూజిక్ అంతా విభిన్నమే.

కాంట్రాబాస్ బాలాలైకా
రఫ్యన్ ఫోక్ ఇన్ట్రుమెంట్ ఇది. దీన్ని 17వ శతాబ్దంలో రూపొందించారు. ఇది త్రిభుజాకారంలో ఉంటుంది. చూడ్డానికి గిటార్ లాగే ఉంటుంది. దీన్ని చేతివేళ్ల సహాయంతో వాయిస్తారు.

స్టైలో ఫోన్
ఈ వాయిద్యాన్ని 1967లో కనుగొన్నారు. దీనికి అనలాగ్ స్టైలస్ ఉంటాయి. బ్రెయిన్ జార్వ్స్ అనే వ్యక్తి రూపొందించాడు. ఇది చాలా విభిన్నమైన సంగీత వాయిద్యం.



Click it and Unblock the Notifications
