Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
బడ్జెట్ 2016-2017: కొండెక్కనున్న లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ ధరలు
ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ ఫీవర్ ఒకవైపు వేడిపుట్టిస్తుంటే.. ఇండియాలో బడ్జెట్ మరో వైపు హీటెక్కిస్తోంది. లేడీస్ అండ్ జెంటిల్ మెన్ తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఈ ఏడాది బడ్జెట్ లో ఉన్నాయి. 2016- 2017 బడ్జెట్ వార్తా విశేషాల్లో లైఫ్ స్టైల్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవి ఎలా ఉన్నాయో చూద్దాం..
ఈ ఏడాది 2016-2017 బడ్జెట్ లో ఏ ప్రొడక్ట్స్ పెరుగుతున్నాయి.. ఎక్కడ ట్యాక్స్ పెరుగుతుందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తూ ఉంటారు. బడ్జెట్ లో ఎక్కువగా మధ్యతరగతి వాళ్లపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అలాగే ఎక్కువ జీతాలు పొందే వాళ్లపైనా ప్రభావం ఉంటుంది.
తక్కువ జీతాలు ఉంటే.. ఎక్కువ టాక్స్ పడతాయి. దీనివల్ల చాలా ఇబ్బందిపడాల్సి వస్తుంది. అయితే కొన్ని రకాల వస్తువులు ఈసారి పెరిగే అవకాశాలున్నాయి. 2016-2017 సంవత్సరంలో ఎలాంటి వస్తువులు పెరిగే అవకాశముందో ఇప్పుడు చూద్దాం...

పాల ఉత్పత్తులు
మిల్క్ ప్రొడక్ట్స్ అయిన పనీర్, చీజ్, ఐస్ క్రీమ్, పెరుగు వంటి రకరకాల ఉత్పత్తులు ఈ ఏడాది పెరిగే అవకాశం ఉంది.

పొగాకు ఉత్పత్తులు
2016-2017 సంత్సరంలో పొగాకు ఉత్పత్తులు పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కనీసం దీనివల్ల అయినా స్మోకింగ్ చేసేవాళ్ల సంఖ్యం దేశంలో తగ్గుతుందేమో చూడాలి.

బంగారం
పసిడి ప్రియులకు అశుభవార్త. ఎందుకంటే.. గతేడాదితో పోల్చితే ఈ సారి దిగుమతి ఖర్చు పెరిగింది. కాబట్టి ఖచ్చితంగా దిగుమతి చార్జీలు పెరుగుతాయి. దీంతో బంగారం రేట్ చాలా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.

ఆల్కహాల్
పార్టీలకు ప్లాన్ చేసే ముందు బడ్జెట్ గురించి ఒక్కసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే.. ఈ ఏడాది ఆల్కహాల్ రేట్స్ భారీగా పెరగబోతున్నాయి.

కాస్మొటిక్స్
లేడీస్ మీరు అలర్ట్ అవ్వాల్సిందే.. ! మీకో బ్యాడ్ న్యూస్. ఎందుకంటే.. అందానికి మెరుగులు దిద్దే.. కాస్మొటిక్ ప్రొడక్ట్స్ రేట్స్ పెరిగిపోనున్నాయి. అయితే కాస్త తక్కువగానే పెరిగే అవకాశాలున్నాయి.

ఎలక్ట్రానిక్ గూడ్స్
ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా ఈసారి షాక్ ఇవ్వబోతున్నాయి. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిచిన్ వంటివ ఎలక్ట్రానిగ్ గూడ్స్ వ్యయం పెరగనున్నాయి. కాబట్టి వీటిని కొనే ముందు ఒక్కసారి మీ బడ్జెట్ చూసుకోవడం మంచిది.

ఆటోమొబైల్స్
పెట్రోల్, డీజిల్ రేట్స్ పెరిగినప్పుడు వాహనాలు కొనడం అంత ఈజీ కాదు. టూవీలర్స్, ఫోర్ వీలర్స్ రెండింటి వ్యయాలు.. ఈ ఏడాది పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ట్రాఫిక్ అయినా తగ్గుతుందని ఆశిద్దాం..

గాడ్జెట్స్
లేటెస్ట్ టెక్నాలజీతో.. మీరు అప్ డేట్ అవ్వాలనుకుంటే.. మీ బడ్జెట్ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే.. ఈ ఏడాది గ్యాడ్జెట్స్ రేట్ విపరీతంగా పెరిగిపోనుంది.

హోం లోన్స్
డ్రీమ్ హౌస్ ఈ సారి కూడా డ్రీమ్ గానే మిగిలే అవకాశాలున్నాయి. ఈ ఏడాది హోం లోన్స్ ఖరీదు ఖచ్చితంగా పెరగనుంది.

ఎసెన్షియల్ ఆయిల్స్
ఎసెన్షియల్ ఆయిల్స్ అయిన లావెండర్, టీ ట్రీ వంటి ఆయిల్స్ కి ఎక్కువ డిమాండ్ ఉండటం వల్ల వీటి ఖరీదు కూడా పెరగనుంది. దీనివల్ల మళ్లీ బ్యూటీ ప్రొడక్ట్స్ ఖర్చు పెరిగిపోతుంది.

ట్రావెల్ ఎక్స్ పెన్సెస్
ఈ ఏడాది ట్రిప్స్, ట్రావెల్స్ చేయాలంటే.. ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంట.. ఈ సారి ట్రావెల్స్ ఎక్స్ పెన్సెస్ కూడా పెరిగిపోతాయి.

ఆర్గానిక్ ఫుడ్స్
మార్కెట్ లో ఆర్గానిక్ ఫుడ్స్ కి డిమాండ్ ఉండటం వల్ల వీటి ఖరీదు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.



Click it and Unblock the Notifications











