Latest Updates
-
తక్కువ నూనె, ఎక్కువ రుచి.. నవరాత్రి స్పెషల్ సగ్గుబియ్యం దోశ..ఎలా చేసుకోవాలంటే -
నోరూరించే హైదరాబాదీ పనీర్ కీమా.. చపాతీ, రోటీ,పూరీల్లోకి దీన్ని మించిన రుచి లేదు! -
పిండి రుబ్బే పనిలేదు..అప్పటికప్పుడు ఐరన్, కాల్షియం నిండిన దూదిలాంటి మెత్తని రాగి ఇడ్లీ ..కొబ్బరి చట్నీతో కేక! -
పరాభవ నామ సంవత్సరానికి స్వాగతం..మీ ఫ్రెండ్స్, బంధువులకు బెస్ట్ ఉగాది విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇలా.. -
Ugadi Pachadi Recipe: కేవలం పచ్చడి కాదు, దివ్యౌషధం..పక్కా కొలతలతో సంప్రదాయ ఉగాది పచ్చడి..ఎలా చేసుకోవాలంటే.. -
ఉగాది పచ్చడి ఎందుకు తినాలి? ఎన్ని రోజులు తినాలి? ఈ రహస్యం మీకు తెలుసా? -
ఉగాది సంప్రదాయ వంటకాలు: జస్ట్ 20 నిమిషాల్లో సజ్జ బూరెలు, కొబ్బరి బూరెలు..ఎలా చేసుకోవాలంటే. -
రాగి పూరీ-ఉల్లిపాయ మసాలా..లెక్కలేకుండా తినేయడం గ్యారెంటీ! -
అన్నం, పప్పు,పరాఠా, రోటీల్లోకి బెస్ట్ కాంబినేషన్..రాజస్థానీ స్పెషల్ వెల్లుల్లి ఎర్ర మిరప చట్నీ -
ఉగాది స్పెషల్..ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ క్రంచీ బేబీ కార్న్ 65..వాహ్ అనిపించే బెస్ట్ స్టార్టర్!
మీ రాశి ప్రకారం, కాబోయే పార్ట్నర్ ను ఎంపిక చేసుకోవడం ఎలా..?
రాశి చక్రం యొక్క లక్షణాల ఆధారంగా సామర్ధ్యం కలిగిన పురుష భాగస్వామిని ఎంచుకొనే సమయం ఆసన్నమైనది. పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు భాగస్వామి యొక్క రాశి చక్రం కీలకమైన పాయింట్ గా ఉంటుంది.
రాశి చక్రం యొక్క అన్ని సంకేతాలు ఇద్దరికి అనుకూలంగా ఉండాలి. ఇతరులకు ప్రతికూలంగా ఉన్నా కొన్ని సంకేతాలు మరింత అనుకూలంగా ఉంటాయి. అప్పుడు మీ జీవితం అన్ని స్థాయిలలోను మీ భాగస్వామితో అనుకూలంగా ఉండటం, సంతోషకరమైన వివాహ జీవితంనకు దారి సుగమం అవుతుంది.
రాశి చక్రం అనుకూలత మీద ఆధారపడి మీకు సరిపడే మీ సంభావ్య భాగస్వామి యొక్క లక్షణాలను తెలుసుకుందాం. ప్రతి రాశిచక్రం సంకేత లక్షణాలు దాని సొంత సమూహాన్ని కలిగి ఉంటుంది. అలాగే మీ భాగస్వామి ఆ లక్షణాలు పరంగా మీకు అనుకూలంగా ఉండాలి. అప్పుడు మీ వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది.
రాశిచక్రం సంకేతాల ఆధారంగా మీ భాగస్వామిని ఎంచుకోండి
ఒకే రాశి చక్రం అయినా సరే పురుషులు మరియు మహిళలు విభిన్నమైన లక్షణాలను కలిగి ఉంటారు. అందువలన, మీరు ఒక నిర్దిష్ట రాశిచక్రం సంకేతాలు కలిగి ఉంటే, అప్పుడు అదే రాశి చక్రం సంకేతాలు కలిగిన భాగస్వామిని ఎంచుకోవటం సరి కాదు. ఎందుకంటే పురుషులకు,మహిళలకు లక్షణాలు వేరువేరుగా ఉంటాయి.
ఈ రోజు మేము మహిళల అభిరుచులకు తగినట్టుగా సరైన భాగస్వామిని ఎంచుకోవడానికి పురుషుల రాశిచక్రం గురించి పూర్తి వివరాలు ఈ వ్యాసంలో చర్చిస్తున్నాం.

మేష రాశి
దీనికి అంగారక గ్రహం అధిపతి. కాబట్టి పురుషులు వారి నియమాల బట్టి వేగంగా కదులుతారు. వారు స్వార్ధంగా ఉన్న కొంత ఉదారత కనపడుతుంది. వారు బహిరంగంగా నమ్మకం మరియు ప్రియమైన వారికీ ప్రేమను చూపుతారు. కానీ వారి డిమాండ్ వారి బంధంలో విపరీతమైన నష్టాన్ని కలిగిస్తుంది.

వృషభ రాశి
ఈ రాశి గలవారు ఆర్ధిక స్థిరత్వం మరియు జీవితం యొక్క సుఖాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. వీరు హాస్యం అనే అద్భుతమైన భావాన్ని కలిగి ఉంటారు. అంతేకాక వీరు సంబంధాల విషయంలో స్వాధీనతా భావం కలిగి ఉంటారు. సాధారణంగా వీరు రిజర్వు మరియు సిగ్గుగా ఉంటారు. వారు జీవితంలో మరొకరి మీద ఆధారపడి ఉంటారు. వారిలో హాస్యం మంచి భావం కలిగి ఉన్నప్పటికీ, వారు తరచుగా వారికి ఉద్దేశించిన మృదువైన భావోద్వేగాలతో జోకుల అర్థం విఫలం అయ్యి బాధపడుతూ ఉంటారు.

మిథున రాశి
మిథునరాశి పురుషులు ఉత్సాహభరితంగా, వినోదంగా, మేధోవంతులుగా ఉన్నప్పటికీ చాలా అనూహ్యంగా ఉంటారు. మిథునరాశి పురుషులు మనోహరంగా అందరిని ఆకట్టుకుంటారు. వారితో గంటల తరబడి మాట్లాడిన బోర్ కొట్టదు. మీ జీవితంలో జరిగే అన్ని విషయాలలోనూ సపోర్ట్ గా ఉంటారు. వీరు ఎక్కువ సృజనాత్మకంగా ఉండుట వలన ప్రత్యేకంగా ఉంటారు.

కర్కాటక రాశి
ఈ రాశి వారు కొంచెం సిగ్గుతో ఎక్కువ రిజర్వ్ మరియు తీవ్ర రక్షణతో ఉంటారు. వీరు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. వీరి భావాలు ప్రమాదాల సమయంలో రక్షించటానికి ఒక కవచంలా సహాయపడతాయి. వారు వారి లుక్స్, బట్టలు మరియు ఇతర ఆస్తుల గురించి చాలా చేతనంగా ఉంటారు. వీరు తల్లికి మరియు భాగస్వామికి ముఖ్యమైన సంబంధాలను ఏర్పాటు చేయటంలో సిద్దహస్తులు.

సింహ రాశి
ఈ రాశి గలవారు ప్రత్యేకముగా ఉంటారు. సజీవ మరియు వెచ్చని మనసుతో ఉంటారు. వీరు ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా నమ్మకంగా మాట్లాడతారు. మీరు సింహ రాశి గల వ్యక్తిని వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు అతనిని మీరు పొగుడుతూ ఉండవలసిందే. వారు తమ లక్ష్యాలను సాధించడానికి వారి ప్రియమైన నుండి ప్రశంసలు మరియు అభిమానం తప్పనిసరి. ఈ వ్యక్తితో వ్యవహరించేటప్పుడు మీరు నాగరికంగా మరియు అతని దుర్భలమైన అహం దెబ్బతీయకుండా అర్థం చేసుకొని ఉండాలి. వీరికి మహిళల మీద ప్రేమ ఉంటుంది కానీ అది వెర్రిగా ఉంటుంది.

కన్యారాశి
వీరిలో జాలి ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా విషయాలలో చాదస్తంగా ఉంటారు. వివాదాలను శాంతియుతంగా తెలివిగా పరిష్కరించటంను ఇష్టపడతారు. వీరు చాలా రొమాంటిక్ గా ఉంటారు. వీరి ఆలోచనలో భావుకత ఉన్నా ప్రేమ వ్యవహారంలో ఈ విలక్షణమైన వివరణ సరిపోదు.వీరు భార్య మీద అమితమైన ప్రేమను కురిపిస్తారు.

తుల రాశి
తుల రాశి పురుషులు చాలా శృంగారంగా మరియు అందంగా ఉంటారు. వారు వారి భాగస్వామి వైపు కొంత విధేయత,లోతైన జ్ఞానం కలిగి ఉంటారు. అలాగే వారు వారి భాగస్వామి నుండి కూడా అదే ఆశిస్తారు. వారు అరుదుగా పిర్యాదులు చేస్తారు. వీరికి వాదనలు ఇష్టం ఉండవు. వీరు ప్రశాంతగా ఉంటారు. అరుదుగా మాత్రమే నిగ్రహాన్ని కోల్పోతారు. ఈ పద్దతిలో ఉండుట వలన మహిళలతో చాట్ మరియు చిరునవ్వు పతనానికి దారి తీస్తాయి. అయితే, వారు ఒక సంబంధంలో కమిట్ అయితే, వారి భాగస్వామి సంరక్షణ పట్ల చాలా నమ్మకంగా ఉంటారు.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారిలో ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది. తన వైపు తప్పు రానంత వరకు నిశ్చలంగా ఉంటారు. వీరి చుట్టూ స్నేహితులు ఈగల్లా ముసురుతారు. వారు ఆర్ధిక నిర్వహణలో బాగుంటారు. వీరు రహస్యంగా ఉన్నప్పటికీ ఎవరిని తొందరగా నమ్మరు. వీరికి ఉద్రేకం ఎక్కువగా ఉండుట వలన ఇంద్రియాలకు సంబంధించిన మరియు శృంగార ఘర్షణలు ఉంటాయి. వీరు తెలివైన మరియు అందమైన మహిళల పట్ల ఆకర్షితులు అవుతారు. వారు నిజంగా మనస్పూర్తిగా సంబంధానికి కమిట్ అయితే మాత్రం ప్రపంచాన్ని ఎదిరించడానికి కూడా సిద్ధపడతారు.

ధనుస్సు రాశి
వీరి జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది. వీరి గుండె నిండా ప్రేమ మరియు నిజాయితీ ఉండటమే కాకుండా రిస్క్ చేయటానికి వెనకడుగు వేయరు. వీరు స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడతారు. అందువల్ల సన్నిహిత సంబంధాల జోలికి వెళ్ళరు. వారు ప్రపంచాన్ని అన్వేషించి అనుభవాల ద్వారా భాగస్వామి అవసరమని అన్పిస్తే అప్పుడు సంబంధంలోకి అడుగు పెడతారు.

మకర రాశి
వీరు సురక్షితమైన స్వభావం మరియు చాదస్తంగా ఉంటారు. వీరు వారి భాగస్వామి విధేయతతో ఉంటేనే వారితో సంబంధానికి రెడీ అవుతారు. వీరు కొంచెం మానసికంగా దూరంగా ఉంటారు. అలాగే ప్రేమను వ్యక్తం చేయటానికి కూడా కొంత సమయం పడుతుంది. సంబంధాలను చాలా తీవ్రంగా చూస్తారు. వీరు సంబందానికి కట్టుబడి ఉంటె మాత్రం చాలా నిజాయితీగా ఉంటారు.

కుంభ రాశి
కుంభ రాశి వారు పట్టుదల మరియు శక్తివంతంగా ఉంటారు. వీరికి గాడ్జెట్లు మరియు యంత్రాలు వైపు ప్రత్యక దృష్టి ఉంటుంది. వారు మాట్లాడే మాటలు మర్యాదపూర్వకంగా మరియు సున్నితంగా ఉంటాయి. వీరు ఉద్రేకంగా ఉండుట వలన కంఫర్ట్ గా ఉండరు. వారు వారి స్వతంత్రం మీద రాజీ పడరు. దాంతో వారి నిబద్ధత ఒక ప్రధాన సమస్య అవుతుంది. ఈ నిబద్ధత శృంగార సంబంధాల విషయంలో ఒక అడ్డంకిగా నిలుస్తుంది.

మీన రాశి
ఈ పురుషులు ఎప్పుడూ వ్యవహార జ్ఞానం మరియు ఆదర్శవాదం మధ్య స్వింగింగ్ అవుతూ ఉంటారు. వారు ఒక బలమైన సిక్స్త్ సెన్స్ మరియు వారి గట్ భావన మీద పూర్తిగా ఆధారపడతారు. వారు దయ, సున్నితమైన మరియు అభిమానం కలిగి ఉంటారు. వారి సున్నితత్వం, వినయం మరియు శృంగార స్వభావం అందరిని ఆకర్షిస్తుంది. వీరు ప్రేమ మరియు గౌరవం తో స్త్రీలను ట్రీట్ చేసి వారి కలలను సాకారం చేసుకుంటారు.ఇక శృంగారం విషయానికి వస్తే మీనం పురుషులు అల్టిమేట్ గా ఉంటారు.



Click it and Unblock the Notifications











