Latest Updates
-
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.! -
ముఖం ఉబ్బిందా? మెడ నల్లబడిందా? ఫ్యాటీ లివర్ కు ఇవే తొలి సంకేతాలు!
మీరు ఆశ్చర్యపోయే భయంకరమైన ఫేస్ టాటూలు.. !!
ఒకప్పుడు పచ్చబొట్టుగా పిలిచేవాళ్లం. దీనికి కాలంతో పాటు పేరు మారింది. అదే టాటూ. ఒకప్పుడు పచ్చబొట్టు అంటే.. కేవలం ఆడవాళ్లు తమ ముఖంపై బొట్టులా వేయించుకునేవాళ్లు. అలాగే చేతులపై వేయించుకునేవాళ్లు. ఆ తర్వాత మగవాళ్లు తమ ప్రేయసి పేర్లను రాయించుకునేవాళ్లు. ఆ తర్వాత దీని స్థానం చెస్ట్ అంటే గుండె దాగా వెళ్లింది. మరి ఇప్పుడు ?
టాటూగా పిలిచే పచ్చబొట్టుని ఇప్పుడు అక్కడ ఇక్కడ అని కాదు.. శరీరమంతా పొడిపించుకుంటున్నారు. ఇదో ట్రెండ్ గా మారింది. అయితే.. ఏదో పేరు లేదా చిత్రం లేదా ఏదైనా గుర్తుగా వేయించుకుంటే సరి. కానీ.. ప్రస్తుతం ఫేస్ టాటూల మోజు పెరిగిపోతోంది. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా ? నిజమే ముఖమంతా టాటూ పొడిపించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ అయింది.
ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు, అభిరుచి ఉంటుంది. కొన్ని ఫన్నీగా ఉంటే.. మరి కొన్ని షాకింగ్ గా ఉంటాయి. ఇక్కడ చూడబోయే ఫేస్ టాటూలను చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. చాలా భయంకరమైన, మునుపెన్నడూ చూడని.. ఫేస్ టాటూలను మీకోసం పరిచయం చేయబోతున్నాం. వీటిని చూసి వండరే అవుతారో ? షాకే అవుతారో మీ ఛాయిస్.. !!

జోంబీ బాయ్
జోంబీ బాయ్ గా ఫేమస్ అయిన రిక్ జెనెస్ట్ ఫేస్ టాటూ చూడండి. మేల్ మోడల్ గా ఫ్యాషన్ మ్యాగజైన్స్ పై మెరిసే ఇతను భయంకరమైన బాడీ ఆర్ట్ తో ఫ్యాన్స్ ని కంగారుపెడుతున్నాడు.
Image Courtesy

మైఖేల్ కార్టర్
మైఖేల్ కార్టర్ వివాదాస్పద టాటూలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. తన నుదురు భాగంపై స్వస్తిక్, జీసస్ వంటి గుర్తులతో టాటూ పొడిపించుకుని అందరినీ షాక్ కి గురిచేస్తున్నాడు.
Image Courtesy

ఖాంప్రసంగ్ థమ్మవోంగ్
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఇతను.. తన ముఖంపై భయంకరమైన టాటూ వేయించుకున్నాడు.
Image Courtesy

రోల్సన్
రోల్సన్ వేయించుకున్న టాటూ చాలా క్రేజీగా ఉంది కదూ. టాటూయిస్ట్ తన పేరుని తన గాల్ ఫ్రెండ్ ముఖంపై టాటూ రూపంలో వేశాడు. అది కూడా తాము మొదటిసారి కలిసినప్పుడు.
Image Courtesy

జాసన్ బర్నమ్
అందరూ ముఖంపై పొడిపించుకుని భయపెడుతుంటే... జాసన్ బర్నమ్ తన ఐబాల్ పై భయంకరమైన టాటూ వేయించుకున్నాడు. ఇతను.. ఏదో కేసులో అరెస్ట్ అయి.. జైల్లో ఉన్నాడు.
Image Courtesy

విన్ లాస్
విన్ లాస్ వరల్డ్ ఫేమస్ అవడానికి చాలా ఆరాటపడుతున్నాడు. అందుకే.. ముఖమంతా రకరకాల పదాలతో టాటూ వేయించుకోవడమే కాకుండా.. చెస్ట్ పై కూడా ఏదో గుర్తు వేయించుకున్నాడు.
Image Courtesy

క్రిస్టీన్ సెచ్రిస్ట్
ఇది చూశారా ? తన ముఖానికి సగ భాగం చిన్న పిల్లాడి టాటూ వేయించుకున్నాడు. ఇది ఏదో సరదాగా వేయించుకున్నది కాదు. తన కొడుకు మరణించడంతో.. సంతాపం తెలుపుతూ.. ఇలా టాటూ వేయించుకున్నాడు. తన బిడ్డపై ఉన్న ప్రేమను చాలా కొత్తగా ఎక్స్ ప్రెస్ చేశాడు కదూ..
Image Courtesy



Click it and Unblock the Notifications
