Latest Updates
-
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్‌డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.! -
ముఖం ఉబ్బిందా? మెడ నల్లబడిందా? ఫ్యాటీ లివర్ కు ఇవే తొలి సంకేతాలు!
అందానికి కళ్ళజోడు అడ్డు కాదు..! మీ ఫేస్ కట్ ను బట్టి కళ్ళ జోడు ఎంపిక..!
అందం సంగతి ఎలావున్నా అసలు కళ్ళు కనిపించాలంటే కళ్ళద్దాలు తప్పదు. చత్వారమో, తలనొప్పో వచ్చి డాక్టర్ దగ్గరకి వెడితే కళ్ళజోడు రాసిస్తాడు. అందులో అందం వెతుక్కోవడంలో అర్థం లేదుకానీ, నూటికి 99 శాతం కళ్ళజోడు కొనుక్కోవడానికి ఎన్నో తంటాలు పడుతుండటం మనం చూస్తూనే ఉంటాం. ఏ ఫ్రేము ముఖానికి సూటవుతుందా అని అదిమార్చి అదీ, అది మార్చి ఇదీ పెట్టుకుని చూసేసుకుంటూ ఉంటారు. కాబట్టి కళ్ళజోడు గురించి చెప్పక తప్పదు.
ప్రస్తుత ట్రెండ్ కాలి గోళ్లకు వేసే నెయిల్ పాలిష్ నుంచి తల్లో క్లిప్పుల వరకూ ఫ్యాషనబుల్ గా కనిపించే వస్తువులకే ఎక్కవ ఓటేస్తోంది నేటితరం. అయితే కంప్యూటర్ పై పనిచేయడమో, టీవీలు ఎక్కువగా చూడటమో కారణమేదైతేనేం... ప్రతి ఒక్కరికీ ఇప్పుడు కళ్ల జోళ్లు కామనైపోయాయి. కానీ అందానికి కళ్ళ జోళ్లు అడ్డు' అనేకునే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడున్నది కళ్లద్దాలతోనే ఫ్యాషన్ స్రుష్టించే కాలం.
కళ్ళజోడు ధరించేవారు ఎలాంటిది కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా మూడు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి కళ్ళజోడు బాగా కనిపించేదిగా ఉండాలి. రెండోది కళ్ళజోడు పెట్టుకోవడం వల్ల అందం పెరగాలి గానీ తగ్గిపోకూడదు. మూడు, ప్రస్తుత ట్రెండ్‌ను అనుసరించి కళ్ళజోడును, ముఖం సైజ్ ను బట్టి ఫ్రేమ్ ఎంపిక చేసుకోవాలి. దీనితోపాటు మీ ముఖాకృతిని బట్టి సెలక్షన్ ఉండాలి.

గుండ్రటి ముఖం:
బాగా గుండ్రంగా ఉన్న ముఖం సన్నగా, పొడవుగా కనబడాలంటే మొనతేలిన వెడల్పు తక్కువ ఫ్రేమ్ ఉన్న కళ్ళజోడును ధరించాలి .

కోల ముఖం:
చక్కటి ముఖమంటే కోలముఖమే అంటారు కదా. ఈ ముఖం ఉన్నవాళ్లు ఎలాంటి ఫ్రేమ్ ఉన్న కళ్ళజోడునైనా పెట్టుకోవచ్చు. అయితే వీరు కోలగా ఉన్న ఫ్రేమును వాడకపోవడమే మంచిది.

దీర్ఘచతుర్రసాకారపు ముఖం:
ఇలాంటి ముఖం ఉన్నవారు చిన్నగా మరింత, చక్కగా కనబడాలంటే దీర్ఘచతుర్రస లేదా చదరపు ఫ్రేమ్ ఉన్న కళ్ళజోడును ఎంచుకోవాలి.

చదరపు ముఖం:
ఇటువంటి ముఖాకౄఎతి కలవారు తమ ముఖం పొడవుగా కనబడాలంటే వెడల్పు తక్కువ, కోలగా చిన్నగా ఉన్న ఫ్రేమ్ కళ్ళజోడును ధరించాలి.

ముఖం వజ్రంలా ఉంటే:
వజ్రాకృతి ఆకారంలో ముఖాన్ని కలిగి ఉండేవారు చాలా అరుదు. వీరికి రిమ్‌లెస్ ఫ్రేములు, లేదా కోలగా ఉండే ఫ్రేములు బావుంటాయి.

పిరమిడ్ ఆకారం:
ఇది కూడా డైమండ్ లాగనే చాలా తక్కువ మందికి ఉండే ఫేస్ కట్. ఈ ఫేస్ కట్ ఉండే వాళ్లకు నుదురు సన్నగా ఉంటుంది. అందువల్ల మిగిలిన ముఖం మొత్తం వెడల్పుగా కనిపిస్తుంది. ఇలాంటి ఆకారం ఉన్నవాళ్లు క్యాట్ ఐ షేప్ ఉన్న కళ్లద్దాలు ధరిస్తే అందంగా ఉంటారు .

త్రిభుజాకారం:
త్రిభుజాకారపు ఫేస్ కట్ రెండు రకాలున్నాయి. ఒకటి నుదురు వెడల్పుగా ఉండి గడ్డం సన్నగా ఉండేవి. రెండు నుదురు వెడల్పు తక్కువగా ఉండి గడ్డం వెడల్పుగా ఉండేవి. నుదురు వెడల్పుగా ఉండేవాళ్లు పైన సన్నగా కింద వెడల్పుగా ఉండే రకం ఫ్రేములు తీసుకుంటే బాగుంటారు. ఇలాంటి వాళ్లు రిమ్ లెన్ కళ్లద్దాలు వాడితే చాలా బాగుంటుంది. ఫేస్ కట్ బాగా కనిపిస్తుంది. అదే నుదురు సన్నగా ఉండి గడ్డం వెడల్పుగా ఉండేవారైతే క్యాట్ ఐ షేప్ లాంటి పైభాగం వెడల్పుగా, కింది భాగం సన్నగా ఉండే రకాలు ఎంపిక చేసుకుంటే ఫేస్ కట్ సమానంగా కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications
