Latest Updates
-
సమ్మర్ స్పెషల్..ఎలాంటి కృత్రిమ రంగులు లేని స్వచ్ఛమైన రాజస్థానీ మట్కా కుల్ఫీ..టేస్ట్ కేక! -
డెలులు డేటింగ్ అంటే ఏంటీ?..డేటింగ్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న కొత్త ట్రెండ్ ఇదే! -
బ్రెడ్ లేకుండానే బ్రెడ్ పకోడీ..టీ టైమ్లో దీని మజాయే వేరు..జస్ట్ 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలంటే.. -
అచ్చం బేకరీ రుచితో.. ఇంట్లోనే శాండ్ విచ్ చేసుకోండిలా..పైన కరకరలాడుతూ, లోపల మెత్తగా.. -
డెహ్రాడూన్ స్పెషల్ మటన్ భుట్వా..నెక్స్ట్ లెవల్ టేస్ట్! -
పప్పు నానబెట్టే పనే లేదు..మిగిలిపోయిన బ్రెడ్ తో 15 నిమిషాల్లో కరకరలాడే వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
April 2026 Festivals: హనుమాన్ జయంతి నుండి అక్షయ తృతీయ వరకు..ఏప్రిల్ నెల పండుగల పూర్తి జాబితా! -
ముంబై స్పెషల్ బటాటా పోహా.. ఉదయం పూట నోరూరించే, కడుపు నింపే అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్! -
ఈరోజు రాశి ఫలాలు (28.03.26): శనివారం నాడు మీ అదృష్టం ఎలా ఉండబోతోంది? -
అచ్చం హోటల్ స్టైల్ సాంబార్ కావాలా? అయితే ఈ మసాలాను ఇంట్లోనే చేసుకోండి!
ఇంటర్వ్యూలో సక్సెస్ అవడానికి మీ రాశిని బట్టి ఫాలో అవ్వాల్సిన టిప్స్..!
చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, బాధ్యతలు.. ఇలా జీవితమంతా.. ఒక సైకిల్ గా ఉంటుంది. అయితే.. ప్రతి స్టెప్ లోనూ సక్సెస్ అయినప్పుడే.. మన తల్లిదండ్రులు, మనం, మన పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు, సక్సెస్ ఫుల్ లైఫ్ అందుకుంటారు. అయితే సక్సెస్ కి మొదటిమెట్టు ఉద్యోగం. అది సంపాదించినప్పుడు కలిగే ఆనందం అన్నింటిలోకి గొప్పది.
మీ రాశి ప్రకారం మీరు ఎంచుకోవాల్సిన కెరీర్ ఏంటి ?
చదువు పూర్తి అయిన తర్వాత ఉద్యోగం సంపాదించాలనే పట్టుదల ఉన్నప్పటికీ.. కొంతమంది త్వరగా పొందలేకపోతారు. వాళ్ల బ్యాక్ గ్రౌండ్, చదువు, కమ్యునికేషన్ స్కిల్స్ తో పాటు, ఇంటర్వ్యూని ఎదుర్కొనే శక్తి.. చాలా కీలక పాత్ర పోషిస్తాయి. చాలా మందికి ఇంటర్వ్యూ అంటే చాలా భయపడతారు. అందుకే కొంతమంది ఇంటర్వ్యూని ఫేస్ చేయలేక కోర్సులు, క్లాసులు అంటూ.. కాలం నెట్టుకొస్తారు.
కానీ ఇంటర్య్వూలో సక్సెస్ అయినప్పుడు అనుకున్నదానికంటే.. ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు. ఎలాంటి కోర్సులో జాయిన్ అవ్వాలన్నా.. జాబ్ మారాలన్నా.. ఇంటర్య్వూ కంపలర్సరీ. అది ఒక్కో స్థాయిని బట్టి ఒక్కోలా ఉంటుంది. చిన్న ఉద్యోగం అయితే.. కన్వర్జేషన్ చాలా సింపుల్ గా ఉంటుంది. అదే కొంచెం స్థాయి పెరిగిన తర్వాత.. ఇద్దరు ముగ్గురు ఇంటర్య్వూవర్స్ మీట్ అయి క్వశ్చన్ చేస్తారు.
మీ రాశి ప్రకారం మీరు ఏ వయసులో సక్సెస్ అవుతారు ?
అన్ని రాశులను స్టడీ చేసిన తర్వాత.. ఏ రాశి వాళ్లు ఏ విషయాలను హైలైట్ చేయడం వల్ల ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారనేది తెలిసింది. ఇంటర్య్వూలో అడిగే ప్రశ్నలతో పాటు, మీరు చెప్పే విధానం, మీరు చూపించాల్సిన టాలెంట్ కూడా చాలా ముఖ్యం. కాబట్టి.. మీ రాశిని బట్టి మీరు ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం..

మేషరాశి
మీ అభిరుచులు, మీ ఇష్టాలే మీకు ఆస్తులు. కాబట్టి ఇంటర్వ్యూ సమయంలో కూడా అదే బయటపెట్టండి. అలాగే ఇంటర్వ్యూలో సమాధానం చెప్పేటప్పుడు మరీ ఎక్కువగా అరవకుండా జాగ్రత్త పడాలి.

వృషభ రాశి
పట్టుదల, నిలకడ స్వభావం, హార్డ్ వర్క్ మీకు కలిసొచ్చే విషయాలు. కానీ భయం లేకుండా వ్యవహరించడం వల్ల వాతావరణం మీకు వ్యతిరేకంగా మారుతుంది. కాబట్టి ఇంటర్వ్యూలో లక్ష్యంపై ఫోకస్ పెట్టి, ఆసక్తిగా సమాధానం చెప్పడం వల్ల సక్సెస్ సొంతం చేసుకుంటారు.

మిధున రాశి
ఎనర్జీ, సమయానుకూలం, తెలివిగా ఉండటం, వేగంగా సమాధానం చెప్పడం వంటి విషయాలు గుర్తుపెట్టుకుంటే.. సక్సెస్ మీ సొంతమవుతుంది. కానీ మీరు విశ్రాంతి లేకపోవడం వల్ల మీ అనుకూలతను కూడా నాశనం చేస్తుంది. కేవలం మీరు మీలా వ్యవహరించడం వల్ల ఇంటర్వ్యూ ఫేస్ చేయడం మీకు చాలా సులభమవుతుంది.

కర్కాటక రాశి
కోపం, విరుద్ధం, మార్గం తప్పడం వల్ల మీ రోజుని కోల్పోతారు. మీరు రూపొందించిన విషయాలు, మీ ప్రయోగాలు.. మీ బలం. కాబట్టి వాటిని, మీకు ఆసక్తి ఉన్న విషయాలను ఇంటర్వ్యూవర్ కి చెప్పడం వల్ల సక్సెస్ మీ సొంతమవుతుంది.

సింహ రాశి
అత్యుత్సాహం, కాన్ఫిడెన్స్ మీలో స్థిరమైన విషయాలు. మీ అభిప్రాయాలను ఇతరులతో చెప్పడం మానేయాలి. సరైన పద్ధతిలో ప్రవర్తించడం వల్ల మీరు సక్సెస్ అవుతారు.

కన్యా రాశి
మీరు చాలా పర్ఫెక్ట్. మంచి ఇమ్యాజినేషన్ కలిగినవాళ్లు. కొన్నిసార్లు మీ అచీవ్ మెంట్స్ ని కూడా నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఇంటర్వ్యూ సమయంలో.. మీ స్కిల్స్ ని, అచీవ్ మెంట్స్ ని ఖచ్చితంగా వివరించాలి. అప్పుడే మీపై అభిప్రాయం కుదురుతుంది.

తులా రాశి
ప్రస్తుతం కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం చాలా అవసరం. అలాగే మీ చిరునవ్వు, సందర్భానుకూలంగా వ్యవహరించే నైపుణ్యం, ఆకర్షణ, స్థిరమైన తత్వం మీకు బాగా కలిసొస్తాయి. కానీ కొన్నిసార్లు మిమ్మల్ని స్థిరబుద్ధిలేని చంచలమైన వాళ్లుగా భావిస్తారు. కాబట్టి మీరేంటో, మీ నైపుణ్యం ఏంటో నిరూపించుకోవాలి.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి రాశివాళ్లు చాలా ప్రతిష్టాత్మకమైనవాళ్లు. నిరంతరం శ్రమించడం, పట్టుదల కలిగి ఉంటారు. అయితే ఇంటర్వ్యూలో కూడా దీన్నే చూపించకూడదు. ఫ్లెక్సిబుల్ గా ఉంటూ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం వల్ల.. ఇంటర్య్వూలో విజయం మీ సొంతమవుతుంది.

ధనస్సు రాశి
మీ తెలివితేటలు, మీ ఆలోచనలను ప్రతిష్టాత్మకంగా ఎలా బయటపెట్టాలనేది నేర్చుకోవడం వల్ల మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు.

మకర రాశి
రేషనల్, లాజికల్, క్లియర్ హెడెడ్ మైండ్ తో పాటు, అద్భుతమైన ఏకాగ్రత మీ సొంతం. ఇంటర్వ్యూ సమయంలో.. ప్రాక్టికల్ గా ఉండటం, పాజిటివ్ మైండ్ తో ఉండటం వల్ల సులభంగా పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు.

కుంభరాశి
పాత సమస్యలకు కొత్త పరిష్కారంవైపు ఆలోచించే లక్షణం.. ఉద్యోగులను ఆకట్టుకుంటుంది. అయితే మీ అత్యుత్సాహం, ఓవర్ కాన్ఫిడెన్స్ మీపై బ్యాడ్ ఇంప్రెషన్ పడేలా చేస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి
ఆత్మశక్తి, అత్యుత్సాహం మీ లక్షణాలను నెరవేరుస్తాయి. కానీ ఆందోళన, భయం మీ రోజుని నాశనం చేస్తాయి. కాబట్టి మీలా ఉండటం వల్ల ఇంటర్వ్యూలో విజయం సాధింవచ్చు.



Click it and Unblock the Notifications











