Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
జాబ్ కోల్పోవడానికి కారణమయ్యే.. బ్యాడ్ హ్యాబిట్స్..!!
మీరు ఉద్యోగం చేస్తున్నారా ? అయితే ఆఫీస్ లో కొన్ని నియమాలు కంపల్సరీ పాటించాలి. కొన్ని అలవాట్లు ఉండాలి. కానీ.. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, ఏ చిన్న పొరపాటు చేసినా.. మీరు చేస్తున్న జాబ్ కోల్పోవాల్సి వస్తుంది.
జాబ్ పోగొట్టుకోవాలని ఎవరు కోరుకుంటారు. ముఖ్యంగా.. ఆదాయం పొందడానికి అదే దారి అయినప్పుడు.. జాబ్ ని కోల్పోకూడదనే ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ కొన్ని కారణాలు, పొరపాట్ల వల్ల మీరు మీ జాబ్ ని కోల్పోవాల్సి వస్తుంది.

ఎలాంటి సందేహం లేకుండా.. ప్రతి ఒక్కరూ జాబ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే.. వర్క్ చేసేటప్పుడు కొన్నింటిని లైట్ గా తీసుకుంటే.. మీరు జాబ్ కోల్పోయే ఛాన్స్ ఉంది.
ఇవాళ్ల ఎంప్లాయిస్ ఆఫీస్ చేయకూడని విషయాలను, దూరంగా ఉండాల్సిన పనులను వివరించబోతున్నాం. ఒకవేళ మీరు ఈ పనులను, పొరపాట్లను ఆఫీస్ లో చేస్తే.. మీరు జాబ్ కోల్పోవాల్సి వస్తుంది.

టీంలో కలవకపోవడం
రోజులో ఎక్కువ సమయం గడిపేది ఆఫీస్ లోనే. ఒకవేళ మనం తోటి ఉద్యోగులతో కలిసిపోకపోతే.. ఎక్కువ రోజులు ఆ జాబ్ లో ఉండలేరు. ఇలాంటి ప్రవర్తన మీ చుట్టు ఉన్నవాళ్లలో ఆసక్తిని కోల్పోయేలా చేస్తుంది. దీనివల్ల మీరు జాబ్ కోల్పోవడానికి కారణమవుతుంది.

యాక్టివిటీస్ లో పాల్గొనకపోవడం
కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు.. యాక్టివిటీస్ అనౌన్స్ చేస్తారు. అయితే.. ఇలాంటప్పుడు ప్రాజెక్ట్ సక్సెస్ చేస్తామని ఆసక్తి చూపకపోవడం, ముందుకురాకపోవడం వంటి అలవాట్ల వల్ల.. మీరు జాబ్ కోల్పోవాల్సి వస్తుంది.

ఆఫీస్ ఇంటర్నెట్
ఆఫీస్ ఇంటర్నెట్ లో జాబ్ పోర్టల్స్ బ్రౌజ్ చేయడం వల్ల పెద్ద సమస్యగా మారుతుంది. ఇలాంటి మిస్టేక్స్ మీరు జాబ్ కోల్పోయేలా చేస్తుంది.

ఆన్ లైన్ మూవీస్
ఒకవేళ వర్క్ లో బోర్ గా ఫీలయినప్పుడు.. సినిమా చూడాలి అనిపించి చూడటం లేదా డౌన్ లోడ్ చేయడం వంటి అలవాట్లు.. మిమ్మల్ని సమస్యల్లో పడేస్తాయి. మీరు మూవీ డౌన్ లోడ్ చేశారని.. ఐటీ వాళ్లకు ఎప్పుడో ఒకసారి తెలిసిపోయి.. మీరు జాబ్ కోల్పోయేలా చేయవచ్చు.

లేటుగా రావడం, త్వరగా వెళ్లడం
ఎప్పుడో ఒకసారి లేటుగా వచ్చి.. త్వరగా వెళ్తే సమస్య ఉండదు. కానీ.. ప్రతిరోజూ అలాగే రావడం, వెళ్లడం జరిగిందంటే.. మీరు ఖచ్చితంగా జాబ్ కోల్పోవడానికి కారణమవుతుంది.

డెడ్ లైన్స్
కొత్త ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు.. చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. టైంకి డెలివర్ చేయాలని ఒత్తిడి ఉంటుంది. ఒకవేళ డెడ్ లైన్ ప్రతిసారీ మిస్ అవుతున్నారంటే..మీరు ఖచ్చితంగా జాబ్ కోల్పోవాల్సి వస్తుంది.

బాస్ కూతురితో డేటింగ్
ఒకవేళ మీకు మీ బాస్ కూతురితో ఎఫైర్ ఉండటం లేదా.. మీ బాస్ కి ఫేవరేట్ అయిన వాళ్లతో.. డేటింగ్ వంటి పనులు.. మీకు ప్రమాదాన్ని తీసుకొస్తాయి. కాబట్టి ఇలాంటి టెన్షన్స్ లేకుండా.. వర్క్ పై కాన్సంట్రేట్ చేయడం మంచిది.

తోటి ఉద్యోగులతో ఫైట్
సమస్యలు తీసుకొచ్చే వాళ్లను ఎవరూ భరించలేరు. కాబట్టి.. వర్క్ ప్లేస్ లో అనవసర గొడవలకు దూరంగా ఉండండి. మీపై చాలా తీవ్రమైన యాక్షన్స్ తీసుకోకుండా జాగ్రత్త పడండి.

చెడు ప్రవర్తన
ఎక్కువగా నెగటివ్ ఫీలింగ్స్, మీ తోటి ఉద్యోగులతో అనవసర చర్చలు.. మీపై వ్యతిరేకతకు కారణమవుతాయి. మిమ్మల్ని.. గుర్తించేలా చేస్తాయి. కాబట్టి.. మీరు జాగ్రత్తగా మసలుకోవాలి. చెడు ప్రవర్తనకు దూరంగా ఉండాలి.

సోషల్ సైట్స్
ఆన్ లైన్ లో ఎక్కువగా గడపడం, వర్క్ ప్లేస్ లో రిలాక్స్డ్ గా ఉండటం, వర్క్ ప్లేస్ లో.. సోషల్ వర్కింగ్ సైట్స్ లో అప్ డేట్స్ ఇవ్వడం వంటి అలవాట్లు.. మీరు జాబ్ కోల్పోయేలా చేస్తుంది.



Click it and Unblock the Notifications
