Latest Updates
-
బ్యాంక్ బెంచ్ స్టూడెంట్,4 సార్లు ఫెయిల్ అయినా కూడా.. ఈ మేడం ఎందరికో ఆదర్శం! -
ఫిల్టర్స్, మేకప్‌తో పనే లేదు.. నేచురల్ గ్లోయింగ్ స్కిన్ కోసం యోగా సూత్రాలు.! -
కోయంబత్తూర్ అన్నపూర్ణ హోటల్ స్టైల్ వెజ్ కుర్మా..పూరీ,ఇడ్లీ,చపాతీ,పలావ్ లోకి కేక! -
జూన్ 17-23 వార ఫలాలు: ఈ రాశుల వారికి అదృష్టం, ధనయోగం.. మీ రాశి ఉందా? -
పురుషుల్లో వంధ్యత్వం.. వీర్యకణాల సంఖ్యను పెంచే యోగాసనాలివే.! -
జూన్ 17 గ్రహాల సంచారం: ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టం, జాక్ పాట్ మీదే! -
బుధవారం గణపతి, విష్ణు పూజతో జ్ఞానం, ఐశ్వర్యం.. ఈ మంత్రం పఠిస్తే చాలు.! -
కార్తీక మాసం ఎందుకు అత్యంత పవిత్రమైనదిప్రతి సోమవారం దీపం ఎందుకు వెలిగించాలి? -
నేడు ఆకాశంలో అద్భుతం: బుధ గ్రహం దర్శనం.. ఈ రాశుల వారికి ఊహించని లాభాలు! -
మిథున, కర్కాటక, కన్యా రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - బుధవారం, 17 జూన్ 2026
మీ అరచేతిని చూస్తే...మీ భవిష్యత్ ఇలా ...తెలిసిపోతుంది..!!
మీ సామర్ధ్యం,ఆరోగ్యం, అదృష్టం, వివాహం తదితర విషయాలని మీ అర చేతిలో రేఖలని చూసి తెలుసుకోవచ్చు.
హస్త సాముద్రికం తెలిసున్నవారు అర చేతిలో ఉన్న ఈ గీతలని పరిశీలించి వ్యక్తి యొక్క ఈవితం గురించి చెప్తుంటారు.కుడి చేహ్తి వాటం వాళ్ళకి అర చేతిలో విధి రాత ఉంటుందనీ, కుడి చేస్తి గీతలు మీ ప్రయత్నాలు దాని వల్ల లభించే సాఫల్యతనీ సూచిస్తాయి. ఎడమ చేతి వాటం వారికి ఇది రివర్స్.
ఇండియా, చైనా, ఈజిప్ట్ తదితర దేశాల్లో హస్త సాముద్రికం బాగా ప్రాచుర్యం పొందిది.చాలా మంది ఈ కళలో ఆరితేరుతున్నారు.అర చేతి గీతలు ఒక్కోసారి మాయమవ్వడం లేదా మారడం జరుగుతుందా అని చాలా సంవత్సరాలనుండీ వేధిస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం అవును అని చెప్పవచ్చు.

మీ అరచేయి అనేక మార్పులకి లోనవుతూ ఉంటుంది.ఇది అనేక కారణాల వల్ల జరగచ్చు.
ఇలా మార్పు చెందుతూ ఉండే గీతలని "మార్కింగ్స్" అంటారు.క్రింద మేము ఇచ్చిన 7 గీతలని మీ ఎడమ చేతిలో చూసి మీ జీవితం గ్రించి మరింత తెలుసుకోండి. మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.

లైఫ్ లైన్ లేదా జీవన రేఖ:
ఈ గీత మనిషి యొక్క తేజస్సునీ, సామర్ధ్యాన్నీ తెలియచేస్తుంది.అలాగే మీ ఆరోగ్యం, మీరు నివాసముండే ప్రాంతం లో జరిగే మార్పుని కూడా సూచిస్తుంది.ఈ గీత మందంగా ఉండే ఆరోగ్యవంతులనీ, గీతలు విడిపోయి ఉంటే మీరు చాలా సెన్సిటివ్ అనీ ప్రతీ దానికీ ఒత్తిడికి గురౌతారని సంకేతం.ఇది మీ అనారోగ్యాన్ని, దెబ్బలని కూడా సూచిస్తుంది.

వివాహ రేఖ:
హస్త సాముద్రికంలో ఈ రేఖ గురించి ఎకువగా మాట్లాదుతారు.ప్రస్తుత మీ లవ్ లైఫ్ తరువాత ఎలా ఉండ బోతోందో ఈ రేఖ నిర్ణయిస్తుంది.అనేక రేఖలు చిన్న చిన్నవి కనుక ఉంటే మీ ప్రేమ ఒక వైపు నుండే అనీ, ఈ రేఖలు విడిపోయి ఉంటే మీ వివాహం కూడా విచ్చిన్నమవుతందని గుర్తు.ఈ గీతలు ఒక దానిని ఒకటి క్రాస్ చేస్తూ ఉంటే సరైన భాగస్వామి కొరకు వెతుకుతున్నారని అర్ధం.మీ అరచేతిలో ఈ రేఖ లేకపోతే కంగారు పడద్దు.పెళ్ళి ఆలోచన మీ మెదడులో ప్రస్తుతానికి లేదని అర్ధం.

హెడ్ లైన్:
ఈ గీత మీ తెలివితేటలనీ, ఆలోచనా విధానాన్నీ తెలియచేస్తుంది.ఈ గీత కనుక మీ లైఫ్ లైంతో కలిస్తే మీరు ఆలోచనల్లో సమతుల్యత కలిగి ఉంటారని సంకేతం.ఈ గీతలు పొడుగ్గా వ్యాపించి ఉంటే మీరు ఇతరుల వల్ల కంట్రోల్ చెయ్యబడతారనీ, వారే మీ కొరకు నిర్ణయాలు తీసుకుంటారనీ అర్ధం. రెండు లేదా అంతకు మించి హెడ్ లైన్స్ ఉంటే మీకు సృజనాత్మకత ఎక్కువనీ,మీరొక ప్రత్యేక వ్యక్తి అని సంకేతం.

అదృష్ట రేఖ:
ఈ గీత మీ తలరాతని గురించి చెప్తుంది.గీత కనుక ప్రస్ఫుటంగా ఉంటే మీ జీవితం అనుకోని మలుపు తిరుగుతుందనీ, అదే కనుక సన్నగా ఉంటే మీరు ఒకరి మాట వినవలసిన స్థితిలో ఉంటారనీ గుర్తు.ఇవే కనుక రెండు లేదా అంతకు మించి ఉంటే మీరు తెలివైన వారూ మరియూ ప్రముఖులవుతారని సంకేతం.

మనీ లైన్:
మీ ఉంగరం వేలి కింద ప్రారంభమయ్యేదే మనీ లైన్.గీత చిన్నగా ఉంతే మీకు డబ్బు మీద పెద్ద వ్యామోహం లేదనీ, అదే ఆ గీత పెద్దగా ఉంటే మీకు డబ్బు చాలా ముఖ్యమనీ, మీరు బాగా పొదుపరనీ గుర్తు.ఇవే గీతలు ఎక్కువ మొత్తంలో అర చేతిలో ఉంటే దుబారా చేస్తారని సంకేతం.

చేతికున్న బ్రేస్‌లెట్ల సంఖ్య:
మీ ముంజేతి మీద ఎక్కువ కంకణాల లాంటి గీతలున్నాయంటే డబ్బు ఉందనీ అదే మొత్తంలో మీకు డబ్బు వస్తుందనీ గుర్తు.అంటే మీ ముంజేతి మీద ఎన్ని లైన్ల కంకణాలు ఉంటే అంత డబ్బని గుర్తు.

హ్యాపీనెస్ లైన్:
అర చేతిలో చేప ఆకారంలో గీతలున్న చేతులు చాలా అరుదుగా ఉంటాయి.ఎడమ చేతిలో కనుక ఈ గీతలుంటే సంతోషమూ, చేసే పనులలో సాఫల్యత.



Click it and Unblock the Notifications