Latest Updates
-
అదే పనిగా స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారా.. డ్రై ఐ సిండ్రోమ్కి దారి తీసే లక్షణాలివే.! -
ఈ నెగిటివ్ ఆలోచనలతో శరీరంలో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసా.? -
పెళ్లయిన తర్వాత ఎన్నేళ్లకు విడాకుల ముప్పు ఎక్కువ? ఈ నిజాలు తెలుసుకోండి! -
జూన్ 19: ఈ రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం.. ధనలాభం, కెరీర్లో ఊహించని మార్పులు! -
వంటగదిలో వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఇక మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే.! -
గజకేసరి రాజయోగం: నేడు ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. అదృష్టం మీదే! -
దంతాల నుంచి తరచూ రక్తస్రావం.. ఈ ఐదు తప్పులు చేస్తున్నారేమో.! -
ఆది శంకరాచార్యుడు 32 సంవత్సరాలలో చేసిన పనిఒక్క మనిషి హిందూధర్మాన్ని ఎలా రక్షించాడు -
జూన్ 21 వేసవి అయనాంతం: ఈ రాశుల వారికి అదృష్టం, కెరీర్లో ఊహించని మార్పులు! -
తోపుడు బండి స్టైల్ పుదీనా కొత్తిమీర చట్నీ..దోసెలు,ఇడ్లీలు ఎన్ని తింటారో మీకే తెలీదు!
పురుషుల్లో పుట్టు మచ్చల పవర్.!? ఎక్కడ పుట్టుమచ్చలుంటే ఎలాంటి భవిష్యత్ ఉంటుంది..?
చేతి గీతలు, పుట్టు మచ్చలు చూసి జాతకాన్ని చెబుతారు జోతిష్యులు. వీటిని మూఢ నమ్మకాలని కొట్టిపారేసే వారు ఉన్నారు. నమ్మే వాళ్లు మరికొందరు... వీటి ద్వార మేం చెప్పేది ఒక్కటే నమ్మడం నమ్మక పోవడం మీఇష్టం.
చేతి గీతలు, పుట్టు మచ్చలు చూసి జాతకాన్ని చెబుతారు జోతిష్యులు. వీటిని మూఢ నమ్మకాలని కొట్టిపారేసే వారు ఉన్నారు. నమ్మే వాళ్లు మరికొందరు... వీటి ద్వార మేం చెప్పేది ఒక్కటే నమ్మడం నమ్మక పోవడం మీఇష్టం.

కానీ మంచి జరుగుతుందంటే నమ్మండి అది ఓ పాజిటివ్ ఆటిట్యూడ్ ను ఇస్తుంది. చెడు అంటే ఆ విషయాల పట్ల కాస్త ముందు జాగ్రత్తగా ఉండి వాటిని సరిదిద్దుకోండి. సో ఇప్పుడు బాడీ లో ఉండే పుట్టుమచ్చల ఆధారంగా మనకు కలిగే ప్రయోజనాల గురించి తెల్సుకుందాం.

పుట్టుమచ్చల మీద వెంట్రుకలు ఉన్న వారు
పుట్టుమచ్చల మీద వెంట్రుకలు ఉన్న వారు ధనవంతులు, కీర్తివంతులు అవుతారట.

పురుషులకు రెండు కనుబొమల మధ్య పుట్టుమచ్చలు ఉంటే
పురుషులకు రెండు కనుబొమల మధ్య పుట్టుమచ్చలు ఉంటే ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడవుతాడు. బంధుప్రియుడవుతాడు. భోగములందు ఆసక్తి కలిగివుంటాడు. సువాసన ద్రవ్యముల పట్ల ప్రేమకలిగి వుంటాడని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

తలలో పుట్టుమచ్చలు కలిగిన పురుషునికి
తలలో పుట్టుమచ్చలు కలిగిన పురుషునికి గర్వము ఎక్కువ . వారు ప్రతి అంశాన్ని విమర్శనాత్మకం గా గమనిస్తారు . మంచి ఆశాభావం గలవారు , రాజకీయ , సామాజిక అంశాలలో మంచి శ్రద్ధ కలిగి ఉంటారు .
పురుషుల నుదుటి మీద ఉంటే మంచి కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు. ఆర్థిక స్వతంత్రం ఉంటుంది. రాజకీయాల్లో రాణిస్తారు.

పురుషుల నుదుటి కింది భాగంలో ఉంటే
పురుషుల నుదుటి కింది భాగంలో ఉంటే మంచి లక్ష్యాన్ని, ఏకాగ్రతను కలిగి ఉంటారు. 40 ఏళ్ల తర్వాత విజయం సాధిస్తారు. కనుబొమ్మపై ఉంటే కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. కొంతమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈర్ష్య ఉండదు.

పురుషుల ముక్కుపై ఉంటే
పురుషుల ముక్కుపై ఉంటే కొంత మందిలో క్రమశిక్షణ లోపిస్తుంది. చెవికి చెందిన ఏ భాగము లో ఉన్నా ధనం కనిపిస్తూ ఉంటుంది .సమాజం లో గౌరవం తో కూడిన గుర్తింపు ఉంటుంది .

పెదవిపై ఉంటే
పెదవిపై ఉంటే కొన్నిసార్లు మీ బంధువులు, స్నేహితుల విషయంలో మీకు ఈర్ష్య కలుగుతుంది. బుగ్గపై ఉంటే రాజకీయాల్లో రాణిస్తారు. స్థిరాస్తులు గడిస్తారు.

నాలుకపై ఉంటే
నాలుకపై ఉంటే మీరు మంచి తెలివితేటలు, విద్యను కలిగి ఉంటారు. గడ్డంపై ఉంటే ఆడ , మగ వారిలో భిన్నంగా ఫలితాలు ఉంటాయి.

పురుషులల్లో గడ్డం మధ్యలో పుట్టు మచ్చ ఉన్న
పురుషులల్లో గడ్డం మధ్యలో పుట్టు మచ్చ ఉన్న మగవారు ఉదారగుణము కలిగి ఉంటారు . ఆడ వారికి భక్తిభావం మెండు. మంచి అదృష్టవంతులవుతారు .

భుజంపై ఉంటే
భుజంపై ఉంటే మర్యాదస్తులుగా ఉంటారు. కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. ఆనందకరమైన దాంపత్య జీవితం కొనసాగిస్తారు. మోచేయిపై ఉంటే మీ జీవితంలోని లక్ష్యాలను చేరుకోవడంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు.

ఎడమ చంక భాగంలో
ఎడమ చంక భాగంలో ఉంటే మీ ప్రారంభ జీవితంలో కొంత ఒడిదుడుకులున్నా తర్వాత నెమ్మదిగా సర్దుకుంటాయి. కుడి చంక భాగంలో ఉంటే భద్రత విషయంలో మీరు చాలా మెళకువగా ఉంటారు. మెడ భాగంలో ఉంటే కొన్ని సమయాల్లో మీకు దురదృష్టం తప్పదు. ఇతరులు మిమ్మల్ని మోసగించేందుకు ప్రయత్నిస్తారు.

కుడి కనుబొమ మీద మచ్చ
కుడి కనుబొమ మీద మచ్చ ఉన్నవారికి వివాహము త్వరిత గతిన అవుతుంది. కుడి కంటి రెప్పపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే సంపదలను కలిగి ఉంటాడు. వాహన సౌఖ్యము లభిస్తుంది. మొత్తమ్మీద ముఖానికి కుడి వైపున పుట్టుమచ్చలు కలిగిన పురుషులు అదృష్టవంతులుగా ఉంటారు. ఎడమవైపు పుట్టుమచ్చలు ఉంటే ఫలితాలు మిశ్రమము గా ఉంటాయి .

శరీరం ముందు భాగంలో ఉంటే
శరీరం ముందు భాగంలో ఉంటే ఆకస్మిక ధన లాభం. శరీరం వెనుక భాగంలో ఉంటే మీరు కష్టపడి పని చేసినా ఆ పేరు ఇతరులకు దక్కుతుంది.



Click it and Unblock the Notifications