Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 2017 మీకు ఎలా ఉండబోతోంది ?
కొత్త సంవత్సరం తలుపు తడుతుండటంతో.. ప్రతి ఒక్కరూ.. కొత్త ఏడాది ఎలా ఉంటుంది, ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది.
న్యూమరాలజీ ఈ మధ్య చాలా పాపులర్ అయింది. న్యూమరాలజీ ప్రకారం అంచనాలు నిజాలుగా మారుతుండటం వల్ల.. దీనికి ఇంపార్టెన్స్ పెరుగుతోంది. కొత్త సంవత్సరం తలుపు తడుతుండటంతో.. ప్రతి ఒక్కరూ.. కొత్త ఏడాది ఎలా ఉంటుంది, ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది.
అయితే మీరు పుట్టిన డేట్ ఆధారంగా.. మీకు 2017 ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మీ నెంబర్ డిసైడ్ అవుతుంది. మీ కెరీర్ లో గ్రోత్ ఉంటుందా ? మీ వ్యక్తిత్వం ఈ సారి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనేది తెలుసుకోవచ్చు. మీ న్యూమరాలజీ నెంబర్ ని మీరు పుట్టిన డేట్ నుంచి ఎంచుకోవాలి. మరి మీ నెంబర్ ఏం చెబుతోందో చూద్దామా..

నెంబర్ 1
1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వాళ్లది న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 1. వీళ్ల బ్లడ్ లోనే లీడర్ షిప్ ఉంటుంది. మీరు మీ చిన్ననాటి స్నేహితులు లేదా బాగా తెలిసిన అమ్మాయి ప్రేమలో పడతారు. మీరు ఏమాత్రం కాంప్రమైజ్ అవరు. కానీ పార్ట్ నర్ కోసం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది.

నెంబర్ 2
2, 11, 20, 29 డేట్ లలో పుట్టిన వాళ్ల సంఖ్య 2. మీరు చాలా సెన్సిటివ్ గా, మూడీగా ఉంటారు. శారీరకంగా కంటే ఎమోషనల్ ఎక్కువ కనెక్ట్ అవుతారు. చాలా ఎక్కువగా మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి.

నెంబర్ 3
3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వాళ్ల సంఖ్య 3. వీళ్లకు ఏమాత్రం భయం ఉండదు. లక్ష్యంతో ఉంటారు. మీ మనసు చెప్పినట్టు ఫాలో అవుతారు. అయితే మనల్ని ప్రేమించే వాళ్ల కోసం రూల్స్ ని చక్కదిద్దుకుంటే మంచిది.

నెంబర్ 4
4, 13, 22, 31 తేదీలలో పుట్టిన వాళ్ల సంఖ్య 4. వీళ్ల స్వభావమే చాలా సరసంగా ఉంటుంది. ప్రేమలో మీరు ఏం కోరుకుంటున్నారో.. మీరే అనలైజ్ చేసుకోవాలి. వైవాహిక బంధం కాకుండా.. ఇతరులతో ఎన్ని రిలేషన్స్ ఉన్నా.. మీ భాగస్వామికి విశ్వాసంగా ఉంటారు.

నెంబర్ 5
5, 14, 23 తేదీలలో పుట్టిన వాళ్ల సంఖ్య 5. వీళ్లు చాలా విభిన్నంగా ఉంటారు. అన్ని విషయాల్లో ప్రయోగాలు చేస్తారు. ప్రేమలో కూడా. చాలా జాలీగా ఉంటారు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మీతోనే ఉండేవాళ్లు భాగస్వామిగా కావాలని కోరుకుంటారు.

నెంబర్ 6
6, 15, 24 తేదీలలో పుట్టిన వాళ్ల సంఖ్య 6. మీ ప్రేమ కోసం చావడానికైనా సిద్ధమవుతారు. ప్రేమకోసం మీ త్యాగాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. మీ భాగస్వామిపై చూపించే ప్రేమ, ఆప్యాయత వల్ల.. మీరు ప్రతి ఒక్కరికీ ఫేవరేట్ గా మారుతారు.

నెంబర్ 7
7, 16, 25 తేదీలలో పుట్టిన వాళ్ల సంఖ్య 7. వీళ్లు క్రియేటివ్ గా, ఆలోచనా శక్తి కలిగి ఉంటారు. అన్ని రకాలుగా పర్ఫెక్ట్ గా ఉండేవాళ్లను పార్ట్ నర్ గా కావాలని కోరుకుంటారు. కానీ ఇది సాధ్యంకాదు. మనందరిలో ఏదో ఒక లోపం ఉంటుంది.

నెంబర్ 8
8, 17, 26 తేదీలలో పుట్టిన వాళ్ల సంఖ్య 8. వీళ్లు చాలా నమ్మకస్తులు, ప్రేమ కలిగిన వాళ్లు. కొన్నిసార్ల ప్రేమ, పెళ్లి బంధంలో బాధపడతారు. ఎందుకంటే.. మీరు ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేస్తారు. మీ మనసుని అర్థం చేసుకునే వాళ్లను ఎంచుకోండి. అలాగే మీ మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

నెంబర్ 9
9, 18, 27 తేదీలలో పుట్టిన వాళ్ల సంఖ్య 9. వీళ్లు చాలా ఎమోషనల్ గా, త్వరగా హర్ట్ అయ్యే మనస్తత్వం కలిగి ఉంటారు. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ బాధపడతారు. వీళ్లు భాగస్వామితో సున్నితంగా వ్యవహరిస్తేనే.. హ్యాపీగా ఉంటుందని భావిస్తారు.



Click it and Unblock the Notifications
