Latest Updates
-
దారుణమైన ఆచారం: పేరుకే కోడలు..ఇంట్లో ఎవరికి దొరికితే వాళ్లు కాపురం చేస్తారు..మామ,మరిది కూడా! -
మందులతో పనిలేని బెస్ట్ డిటాక్స్ డ్రింక్.. అల్సర్‌ను పోగొట్టే కమ్మనైన తమలపాకు రసం.! -
రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ దొన్నె బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి -
మెనోపాజ్ తర్వాత మహిళల్లో అనారోగ్యానికి కారణాలివే.. ఈ భాగాలపైనే ఎక్కువ ఎఫెక్ట్.! -
దిశను మార్చుకోనున్న సూరీడు.. ఈ మూడు రాశుల వారికి నెలరోజుల పాటు గడ్డు కాలమే.! -
లంబోదరుడికి ప్రీతికరమైన బెల్లం పాల తాలికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి.! -
సెప్టెంబర్ 11 రాత్రి 7 గంటల తర్వాత..వృషభం, సింహం, వృశ్చిక రాశులకు లాటరీ తగిలినంత అదృష్టం! -
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.! -
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా!
భార్యాభర్తలు ఎట్టిపరిస్థితుల్లో శృంగారం చేయకూడని ప్రదేశాలు..!
ఈ శాస్త్రాల ప్రకారం భార్యాభర్తలు కొన్ని ప్రదేశాల్లో సన్నిహితంగా ఉండకూడని, కొన్ని ప్రాంతాలను శృంగారానికి నిషేధించారు. అయితే భార్యాభర్తలు ఎట్టిపరిస్థితుల్లో సన్నిహితంగా ఉండకూడని ప్రదేశాలేంటో చూద్దం..
బిజీ బిజీ లైఫ్ స్టైల్ కారణంగా.. భార్యాభర్తలు ఎప్పుడు, ఎక్కడ సమయం, ఒంటరితనం దొరికితే.. అప్పుడు సరదాగా, సరసాలలో మునిగిపోతారు. సన్నిహితంగా ఉంటారు. ఆఫీసులు, పిల్లల స్కూల్స్, ఇంట్లో పనులు అంటూ చాలా బిజీగా, తీరిక లేకుండా గడిపే భార్యాభర్తలు.. ఏమాత్రం సందర్భం దొరికినా.. వెంటనే మూడ్ లోకి వచ్చేస్తారు. ఎక్కడ ఉన్నాం అనే విషయాన్ని మరచిపోయి.. రొమాన్స్ చేస్తారు.

చరిత్రలో రొమాన్స్, లవ్ గురించి ప్రస్తావించినట్టు మనకు తెలియకపోయినా.. అంతకు ముందు మన శాస్త్రాలు, మన సాధువుల సమయంలో.. వీటి గురించి బాగా ప్రస్తావించారు. అంతెందుకు మన దేవాలయాల్లో శిల్పాలను అడిగితే చెబుతాయి.. మన శాస్త్రాల్లో శృంగారానికి ఉన్న ప్రాధాన్యాత !
హిందుత్వం ప్రకారం మన దేవుళ్ల మనషుల మనుగడను పెంచడానికి ఈ శృంగారాన్ని ఎక్స్ పాండ్ చేసినట్టు తెలుస్తుంది. అసలు శృంగారం గురించి మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి ? పురాతన రుషుల జీవితాల్లో కూడా శృంగారం భాగమేనా ? అంటే అవునని కొన్ని శాస్త్రాలు వివరిస్తున్నాయి.
అంతేకాదు.. ఈ శాస్త్రాల ప్రకారం భార్యాభర్తలు కొన్ని ప్రదేశాల్లో సన్నిహితంగా ఉండకూడని, కొన్ని ప్రాంతాలను శృంగారానికి నిషేధించారు. అయితే భార్యాభర్తలు ఎట్టిపరిస్థితుల్లో సన్నిహితంగా ఉండకూడని ప్రదేశాలేంటో చూద్దం..

రుషులు
సెక్సువల్ రిలేషన్స్ పవిత్రమైన పద్ధతి ద్వారా జీవితాన్ని వ్యాప్తి చేసుకోవడం అని.. రుషులు నమ్మేవాళ్లు. అయితే.. పవిత్రంగా.. వాళ్లు లైంగిక సంబంధాలను కలిగి ఉండేవాళ్లు.

నియమాలు
పురాతన గ్రంథాలు, ఇతర శాస్త్రాలు, గొప్ప వ్యక్తుల ప్రకారం.. శృంగారం ప్రాధాన్యత, అవసరం, సమయం వంటి నియమాలను చాలా క్లియర్ గా వివరించారు. చాలా పవిత్రమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవాలని సూచించారు.

పరిణామాలు
ఎలాంటి అహింస జరగకుండా.. ఇద్దరి మధ్య సంబంధం చాలా పవిత్రంగా ఉండాలని.. కొన్ని నియమాలు వివరించారు. అప్పుడే.. వాటి వల్ల ఎదురయ్యే పరిణామాలు అనుకూలంగా ఉంటాయి.

శారీరక సంబంధాలు
శాస్త్రాల ప్రకారం.. నదుల పక్కన ప్రేమ, రొమాన్స్ వంటివి యుద్ధాలకు దారితీస్తాయట. రుషి పరషరా, సత్యవతి మధ్య నది పక్క సంబంధం.. మహాభారత యుద్ధానికి దారితీసిందని శాస్త్రాలు చెబుతున్నాయి.

శక్తిసామర్థ్యాలు
శాస్త్రాల్లో చెప్పినట్టు, రుషులు వివరించినట్టు.. కొన్ని ప్రదేశాల్లో భార్యాభర్తలు రొమాన్స్ చేయకూడదట. ఈ ప్రదేశాల్లో సన్నిహితంగా ఉండే.. విశ్వ శక్తులపై నెగటివ్ ప్రభావం ఉంటుంది.

పవిత్రమైన అగ్ని
భక్తికి సంబంధించిన, ఏదైనా దైవకార్యానికి సంబంధించిన అగ్ని లేదా హోం జరుగుతున్న దగ్గర భార్యాభర్తలు శారీరక సంబంధం, సాన్నిహిత్యం ఏర్పరచుకోకూడదు.

గౌరవప్రదమైన వ్యక్తులు
బ్రాహ్మణులు లేదా ఇతర ఎవరైనా గొప్ప గౌరవప్రదమైన వ్యక్తులకు సమీపంలో ఎట్టిపరిస్థితుల్లో శారీరకంగా సాన్నిహిత్యంగా ఉండకూడదని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి.

వ్యాధితో బాధపడే వ్యక్తికి సమీపంలో
వ్యాధితో బాధపడుతున్న లేదా అనారోగ్యంతో మంచానపడిన వ్యక్తికి సమీపంలో ఎట్టిపరిస్థితుల్లో భార్యాభర్తలు రొమాన్స్ చేయకూడదు. ఒకవేళ ఆ వ్యక్తి.. మరణానికి దగ్గరలో ఉండి.. ఆ వ్యక్తి..మీరు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు లైంగిక బంధానికి దూరంగా ఉండటం మంచిది.

పిల్లలు
శాస్త్రాల ప్రకారం.. శిశువు, పిల్లలు ఉన్నప్పుడు వాళ్లకు సమీపంలో.. రొమాన్స్ చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఇది చాలా పెద్ద పాపం.

నదుల పక్కన
నీళ్లు ప్రవహించే ప్రాంతంలో లేదా నదుల పక్కన శృంగారం ఏమాత్రం మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. నీటి ప్రవాహం వల్ల వచ్చే శబ్ధం.. రొమాన్స్ చేస్తున్న భార్యాభర్తల చెవుల్లో పడితే.. చాలా అపవిత్రంగా భావిస్తారు.

దేవాలయం
దేవాలయాలకు ఎదురుగా లేదా దేవాలయాల పక్కన ఇళ్లను నిర్మించరు. అలాగే పడకగది ఎట్టిపరిస్థితుల్లో ఆలయ ముఖమై నిర్మించరాదు. దేవాలయానికి సమీపంలో శృంగారం చేయడం శాస్త్రాల ప్రకారం.. నిషేధం.

బానిస ఇంట్లో
శాస్త్రాల ప్రకారం బానిస ఉండే ప్రదేశాల్లో కానీ, సమీపంలో గానీ ఎట్టిపరిస్థితుల్లో శృంగారం చేయకూడదు.

ఇతరుల ఇంట్లో
ఇతరుల ఇంటికి భార్యాభర్తలు వెళ్లినప్పుడు.. శారీరకంగా సన్నిహితం ఎట్టిపరిస్థితుల్లో కాకూడదు.

స్మశానం
శాస్త్రాల ప్రకారం.. స్మశానాలకు దగ్గర ప్రదేశాల్లో ఎట్టిపరిస్థితుల్లో భార్యాభర్తలు శృంగారం చేయకూడదు.

డెడ్ బాడీ
శాస్త్రాల ప్రకారం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత.. ఒకవేళ అతని శవంను ఇంట్లోకి తీసుకొస్తే.. అదే ఇంట్లో.. ఎలాంటి పరిస్థితుల్లో శృంగారం చేయకూడదు.



Click it and Unblock the Notifications
