Latest Updates
-
అన్నం,చపాతీ,బగారా రైస్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..రెస్టారెంట్ స్టైల్ పుదీనా చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బటర్ మష్రూమ్ మసాలా.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఇన్స్టాగ్రామ్లో మీ పిల్లలు సేఫేనా? హనీట్రాప్ ముఠాల వలలో పడకుండా కాపాడుకోండిలా! -
సహజీవనం తర్వాత విడిపోతే అత్యాచారమా? సుప్రీంకోర్టు తీర్పుతో షాకింగ్ నిజాలు! -
భార్యను భర్తకు దూరంగా ఉండాలట! ఫ్యామిలీ కోర్టు వింత తీర్పుపై హైకోర్టు షాకింగ్ రియాక్షన్ -
పసుపు, తేనె కలిపి తీసుకుంటే శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..ఆ సమస్యకు కూడా ఇదే పవర్ ఫుల్ మెడిసిన్! -
హైదరాబాద్లో వాతావరణం మారుతోంది! గర్భిణులు, పసిబిడ్డల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
సమ్మర్ కూల్ డెజర్ట్..మజా వచ్చే మామిడి పాయసం..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే పెసర రొట్టె..బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎందులో అయినా సూపర్! -
పంచదార లేకుండానే అమృతం లాంటి సొరకాయ పాయసం..గిన్నెలు గిన్నెలు లేపేయడం గ్యారెంటీ!
ఇండియాలో కంపల్సరీ చూడాల్సిన న్యాచురల్ వండర్స్..!!
ఇండియా అంటేనే ఓ అద్భుతం. అనేక పురాణ కథలు, శిల్పాలు, శిల్ప కళలు, గొప్ప దేవాలయాలు, నదులు, అద్భుతమైన ప్రకృతి అందాలకు ప్రతీక. అలాగే సైన్స్, ఆచారాలు, సంప్రదాయాలకు నిలయం భారతావని. ఇక మన శాస్త్రాలు చెప్పే ప్రతి విషయంలోనూ.. పరమార్థం ఉంటుంది.
ఇండియాలోని పురాతన ఆలయాల్లో దాగున్న అంతుచిక్కని రహస్యాలు
అయితే.. గుళ్లు, గోపురాలను మనుషులు నిర్మిస్తారు కాబట్టి.. అవి అంతటి ఆశ్చర్యాన్ని కలిగించకపోవచ్చు. కానీ.. కొన్ని ఆలయాలు, ప్రదేశాలు, టూరిస్ట్ ప్రాంతాలు.. ప్రకృతికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. అవన్నీ.. సహజంగా, ఎవరి ప్రమేయం లేకుండా.. పుట్టుకొచ్చాయి. వాటిని చూస్తే.. ఎవరైనా వండర్ అవ్వాల్సిందే.
ఇండియా గొప్పతనాన్ని వివరించే ఆసక్తికర విషయాలు
అలాంటి అద్భుతమైన వండర్స్.. అదేనండి.. న్యాచురల్ వండర్స్ గురించి గతంలో ఎప్పుడూ కనీ వినీ ఉండరు. అంతేకాదు.. ఈ న్యాచురల్ వండర్స్ అన్నీ మన ఇండియాలోనే ఉండటం మరింత విశేషం. మరి ఆ న్యాచురల్ వండర్స్ గురించి చూడాలనుందా.. అయితే.. మీరే ఓ లుక్కేయండి..

ఐస్ శివలింగం
అమర్ నాథ్ గుహల్లో ఉన్న ప్రవిత్ర ప్రాంతం ఐస్ శివలింగం కొలువైన ఆలయం. గుహలోపల ఐస్ తో శివలింగం ఏర్పడింది. ఈ శివలింగం ఆకారం ప్రతి ఏడాది మే నుంచి ఆగస్ట్ వరకు మాత్రమే ఉంటుంది. అత్యంత ఎక్కువ సందర్శకులు వచ్చే పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి.

బెరడు బ్రిడ్జ్
ప్రపంచంలో అత్యంత సహజంగా ఏర్పడిన సందర్శన ప్రాంతం ఇది. మేఘాలయకు సమీపంలో ఉన్న చిరపుంజిలో రెండు పెద్ద చెట్ల బెరడుతో.. బ్రిడ్జ్ ఏర్పడింది. ఈ వంతెన ఎవరైనా నిర్మించారా అన్నట్టు ఉంటుంది. కానీ.. ఇది కూడా న్యాచురల్ వండరే. ఈ బ్రిడ్జ్ ని చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఉపయోగిస్తారు.

బ్యాలెన్సింగ్ రాక్
తమిళనాడులోని మహాబలిపురంలో ఈ బ్యాలెన్సింగ్ రాక్ అందరినీ ఆకట్టుకుంటుంది. దీన్ని శ్రీకృష్ణుడి వెన్నముద్ద అని కూడా పిలుస్తారు. ఇక్కడ గుహలో శివాలయం ఉంటుంది. అలాగే బీచ్ కి సమీపంలో.. ఈ రాయి ఉంది. దీన్ని చూస్తే.. పడిపోతుందేమో అనిపిస్తుంది. కానీ పడిపోదు. అందుకే.. ఇది న్యాచురల్ వండర్ అయింది.

హాట్ వాటర్ స్ప్రింగ్స్
హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లు జిల్లాలో ఉంది.. మణికరన్ పుణ్యక్షేత్రం. ఇక్కడ వేడి నీళ్లు ఎగిరిపడుతూ ఉంటాయి. అదే ఇక్కడ ఫేమస్. ఇది కూడా న్యాచురల్ గా ఏర్పడిన వండర్.

అయస్కాంతపు కొండ
ఈ మ్యాగ్నెటిక్ హిట్.. లఢక్ కి దగ్గరలో ఉంది. శ్రీనగర్ నేషనల్ హైవేకి సమీపంలో ఉంది. కార్ లో ప్రయాణించేవాళ్లకు ఇది చక్కటి పర్యాటక ప్రాంతం. ఈ కొండ అయస్కాంత తత్వాన్ని కలిగి ఉండటం విశేషం.

బొర్రా కేవ్స్
బొర్రా కేవ్స్ కూడా చాలా సహజంగా ఏర్పడినవే. ఇవి విశాఖపట్నంలోని అనంతగిరి కొండలు, అరకులోయలో ఉన్నాయి. ఇండియాలోనే అత్యంత లోతైన గుహలు ఇవి. 80 మీటర్ల లోతులో ఉంటాయి.

చిర్ భట్టి
ఇది.. చాలా న్యాచురల్ గా జరిగే.. విషయం. అంటే.. బన్ని గ్రాస్ లాండ్స్ లోని కుచ్ అనే ప్రాంతంలో రాత్రి అయ్యిందంటే చాలు.. వివరించలేని విధంగా.. లైట్లు కనిపిస్తాయి. ఇవి.. దయ్యాల రూపంలో కనిపిస్తాయని నమ్మకం ఉంది. ఈ లైట్స్ రెడ్, ఎల్లో, బ్లూ కలర్స్ లో ఏర్పడతాయట. ఇండియాలోని ఇదో న్యాచురల్ వండర్.



Click it and Unblock the Notifications