Latest Updates
-
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.!
ప్రపంచంలో అత్యంత హాస్యాస్పద 7 ఫోబియాలు
మనందరికీ సాధారణంగా ఏదో ఒక భయం ఉంటుంది.మీకు కూడా ఫలానాది అంటే భయం ఉందంటే, కంగ్రాట్స్, మీకూ ఒక ఫోబియా ఉన్నట్లే.అసలు ఫోబియా అంటే ఏమిటి??
ఇది ఆందోళన కి సబంధించిన ఒక రకమైన రుగ్మత.ఫలానా వస్తువంటేనో లేదా పరిస్థితంటేనో భయం ఉండి వాటిని తప్పించుకుని తిరిగే భయాన్నే ఫోబియా అంటారు.కానీ మీరు భయపడే వస్తువో లేదా ఇంకో దానివల్లో ఎదురయ్యే ప్రమాదం కంటే మీకుండే భయమే ఎక్కువగా ఉంటుంది.
ఈ ఫోబియాలు ఎవరికుంటాయి??నూటికి తొంభై శాతం మందికి కనీసం ఒకటి లేదా రెండు అణచుకోలేని ఫోబియాలుంటాయి.చిన్న చిన్న ఫోబియాలున్నవారు తాము దేనికి భయపడుతున్నారో వాటిని ఎదుర్కోవడం ద్వారా ఆ ఫోబియా నుండి బయటపడే సాధన చెయ్యాలి.ఈ ఫోబియాని కనుక జయించలేకపోతే ఇది మరింత పెరిగి సమస్యలకి దారితీస్తుందని నిపుణుల అభిప్రాయం.
కొన్ని భయంకరమైన ఫోబియాలతో పాటుగా హాస్యాస్పదంగా అనిపించే ఫోబియాలతో కూడా బాధపడేవారుంటారు. ఈరోజు ఆర్టికిల్‌లో ప్రపంచంలోనే ఏడు హాస్యాస్పద ఫోబియాలని మీ ముందు ఉంచుతోంది బోల్డ్‌స్కై.మరి ఆ ఫన్నీ ఫోబియాలేమిటో మీరూ చూడండి.ఇది చదివాకా మీరు ఉక్కిరిబిక్కిరయ్యి బిగ్గరగా నవ్వెస్తారు కూడా.

ఆర్చిబుటైరో ఫోబియా:
నోట్లో పీనట్ బటర్ అతుక్కుంటుందన్న భయం ఇది.చాలా మంది పిల్లలలో ఇది ఉంటుంది.ఈ భయం మరీ ఎక్కువయిపోతే పీనట్ బటర్ ని చూస్తూనే భయపడేంతగా సమస్య ముదురుతుంది.

బారోఫోబియా:
మీరు నేల మీద నిలబడితే మీరు స్థిరంగా ఎలా నిల్చోగలుగుతున్నారు??గురుత్వాకర్షణ శక్తి వల్ల కదా. కానీ ఈ ప్రపంచంలో కొంత మంది ఈ గురుత్వాకర్షణ శక్తి అంటే ఫోబియా ఉన్నవారున్నారు.

నియో ఫోబియా:
మనందరికీ జీవితంలో కొత్త కొత్త వాటిని ప్రయత్నించి చూడటం ఇష్టం కదా. కానీ ఈ ఫోబియా ఉన్నవారికి మాత్రం అది అస్సలు నచ్చదు.అసలు వీరికి జీవితంలో కొత్తవి వేటినీ అంగీకరించరు.బుర్రలో కొత్త ఆలోచనలని కూడా ఈ ఫోబియా ఉన్న కొంతమంది స్వాగతించలేరు.

యూఫోబియా:
ఈ ఫోబియా ఉన్నవారు వారి చుట్టూ ఒక గిరిగీసుకుని ఒంటరిగా బ్రతికెస్తుంటారు.శుభ వార్తలు వినాలంటే భయం.అందువల్ల ఎవ్వరితో కలిసి జీవించడానికి కూడా ఇష్టపడరు.

హిప్పోపోటమో మోనోస్ట్రో్‌సెస్క్వీ్‌పెడాలో ఫోబియా:
పలకటానికే ఈ పదం భారీగా లేదూ??ఎంత పెద్ద పదమో కదా.ఈ ఫోబియా ఉన్నవారిని ఊహించుకోండి. వీరికి పెద్ద పెద్ద పదాలంటే భయం.

లోగిజోమెకానోఫోబియా:
వినడానికే హాస్యాస్పదంగా ఉండే ఫోబియాలలో ఇదే అత్యంత హాస్యాస్పదమైనది.ఈ ఫోబియా ఉన్నవారికి కంప్యూటర్లంటే భయం.మీకే కనుక ఈ ఫోబియా ఉంటే అసలు ఈ వెబ్సైట్లోకి మీరు ఎలా వచ్చారు, ఏమి చేస్తునారు??

గ్లోబోఫోబియా:
ఇది ఇంకొక రకమైన భయం, ఈ భయం ఉన్నవారికి బెలూన్లంటే భయం. వినడానికి హాస్యాస్పదంగా లేదూ??అసలు బెలూన్లంటే భయపడేవారిని ఊహించుకోవడం కష్టం. అంచేత మేము చెప్పేదేమిటంటే రకరకాల మనస్తత్వాలు,ఫోబియాలున్న అనేక మంది మనుష్యులుంటారు అని.



Click it and Unblock the Notifications
