Latest Updates
-
తలస్నానం చేసిన ప్రతిసారీ జుట్టు రాలిపోతోందా? దీనికి పరిష్కారం ఏంటో తెలుసా? -
కీళ్ల నొప్పులకు చెక్,ఎముకలకు బలాన్నిచ్చే రుచికరమైన మటన్ పాయా కర్రీ..ఇంట్లోనే ఈజీగా వండేయండిలా.. -
ఎలాంటి మెషీన్ లేకుండానే ఇంట్లోనే స్వచ్ఛమైన వేరుశెనగ నూనె..ఎలా చేయాలో చూడండి.. -
అరేయ్ మామా.. మీ బెస్ట్ ఫ్రెండ్ కి పంపించడానికి అదిరిపోయే ఫ్రెండ్ షిప్ డే విషెస్, కోట్స్,స్టేటస్ లు.. -
నెలసరి ఆలస్యమవుతోందా? కారణం ఒత్తిడి మాత్రమే కాదు..ఈ నిజాలు తెలుసుకోండి! -
వీకెండ్ స్పెషల్: రొటీన్ కు భిన్నంగా ఆంధ్రా స్టైల్ కరివేపాకు తొక్కు చికెన్.. టేస్ట్ చేస్తే వదలరు! -
బుధుడి అరుదైన నక్షత్ర సంచారం..5 రాశుల వారు కుబేరులు కావడం ఖాయం! -
త్వరగా ప్రెగ్నెన్సీ రావాలంటే భార్యాభర్తలు తప్పక చేయాల్సిన 5 పనులు -
మైదా,చక్కెర లేకుండా ఆరోగ్యకరమైన రాగి బూరెలు.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే! -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ హై ప్రొటీన్ జొన్న గుగ్గిళ్లు తినాల్సిందే..ఈజీగా చేసుకోండిలా..
బంగారానికి సంబంధించి కొన్ని వింతైన మరియుఆసక్తికర విశేషాలు
"బంగారం!" ఈ పేరే చాలు మీ కళ్ళల్లో మెరుపు తేవడానికి, ముఖ్యం గా మీరు ఆడవాళ్ళయితే తప్పకుండా మీ కళ్ళల్లో మెరుపు రావడం ఖాయం ఈ పేరు వినగానే.ప్రపంచ వ్యాప్తం గా ఈ లోహాన్ని ఆభరణాల తయారీలో వాడతారు.బంగారం అంటే హోదా, అంతస్తు,విలాసానికి ప్రతీక.మీ మెడలో బంగారం తో చేసిన ఒక ఆభరణాన్ని ధరిస్తే ఎంత బాగుంటారో కదా.
సన్నని లాకెట్టు, దీనికి జతగా చెవి పోగులు మీ అందాన్ని ఇనుమడింపచేస్తాయి.ప్రపంచ వ్యాప్తం గా ఉన్న స్వర్ణకారులందరూ రకరకాల డిజైన్లలో ఆభరణాలు రూపొందిస్తూ మగువల మనసు దోచుకుంటున్నారు.
చాలా మందికి బంగారం అంటే తమ ఆర్ధిక పరిస్థితి బాగోలేనప్పుడు ఆదుకునే ఆపన్న హస్తం గా భావిస్తారు.ఇవీ బంగారానికి సంబంధించిన కొన్ని సాధారణ విషయాలు.ఇవే కాకుండా బంగారానికి సంబంధించి 8 వింతలున్నాయని తెలుసా మీకు??
"గోల్డ్" అనే పదం పురాతన ఆంగ్ల పదమైన "గిఓలూ" అనే పదం నుండి పుట్టింది.ఈ మాట కి అర్ధం పసుపు రంగు అని.బంగారానికి సంబంధించిన నిజాలలో ఇది కూడా ఒకటి అని తెలుసుకుంటే ఆసక్తికరంగా ఉంటుంది కదూ??ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి ఉన్న కరెన్సీ విలువ మీకు తెలుసు.కానీ ప్రపంచం లోని ప్రజలందరూ మనకి లభ్యమయ్యే బంగారంలో కేవలం 20 శాతం మాత్రమే ఉపయోగిస్తున్నారని తెలుసా??
మిగతా 80 శాతం భూమి పొరల్లో కప్పబడి వెలికితీయడానికి అసాధ్యంగా ఉంది.ఇవే కాకుండా బంగారానికి సంబంధించిన ఇంకా అనేక విషయాలు మీకు తెలీనివి ఉన్నాయి.
బంగారానికి సంబంధించి కింద ఇచ్చిన 8 నిజాలు మీరు తప్పక తెలుసుకోవాల్సినవి.అబ్బురపరిచే ఈ విషయాలు తెలుసుకోవడానికి రెడీయా మరి??

1.బంగారం కరుగుతుంది:
చాలా మంది బంగారు ఆభరణాలని శుభసూచకం గా భావించి ఎల్లప్పుడూ ధరిస్తుంటారు.కానీ మీరు నిత్యం ఆభరణాలు ధరిస్తుంటే సంవత్సరానికి 6 మిల్లీ గ్రాములు కరిగిపోతుందని మీకు తెలుసా??

2.ఆర్ఠరైటిస్ ట్రీట్‌మెంట్:
రసాయినిక క్రియ ద్వారా బంగారాన్ని ద్రవ రూపం లోకి మార్చి రుమటాయిడ్ ఆర్ధరైటిస్ తో బాధపడే వారి నరాల్లోకి ఎక్కిస్తారు.ఇలా చేయడం వల్ల రోగం తగ్గే అవకాశం దాదాపు 70 శాతం ఉంది.బంగారాన్ని గురించిన ఇది ఒక అధ్భుత నిజం కదూ.

3.అతి అరుదుగా దొరికే లోహం:
బంగరానికి సంబంధించిన ఇతర విషయాలు తెలుసుకునే ముందు ఇది భూమి మీద అత్యంత అరుదుగా లభించే లోహాలలో ఒకటి అని తెలుసుకోండి.ఎందుకో తెలుసా?? ఐదు క్యారెట్ల వజ్రాన్ని కనుగొనడం కంటే ఒక ఔన్సు బంగారాన్ని కనిపెట్టడం కష్టం.

4.బరువైన లోహం:
మీరు కంఠాభరణాన్ని లేదా చెవి పోగులు ధరించినప్పుడు బరువుగా అనిపించాయా??అనిపించి ఉండకపోవచ్చు.కానీ ఒక క్యూబిక్ అడుగు బంగారం సగం టన్ను బరువుతో సమానం.ప్రపంచం లో దొరికిన అతి పెద్ద బంగారు కడ్డీ దాదాపు 250 కేజీలు ఉంది.

5.సముద్ర గర్భం లో లభ్యమవుతుంది:
ఒక క్యూబిక్ మైలు మహాసముద్రంలో 25 టన్నుల బంగారం ఉంటుందని తెలుసా??భూమి మీద ఉన్న అన్ని మహా సాగరాలలో దాదాపు బిలియన్ టన్నుల బంగారం ఉంటుంది.కానీ సాగరగర్భం లోకి ప్రవేశించడం దుర్లభం.బంగారానికి సంబంధించిన 8 అధ్భుత నిజాలలో ఇది కూడా ఒకటి.

6.బంగారాన్ని తినచ్చని తెలుసా??
బంగారానికి సంబంధించిన 8 అధ్భుత నిజాలలో ఇది చాలా వింత అయిన నిజం.బంగారం తినదగిన పదార్ధం.ప్రపంచం నలుమూలలా ఉన్న విలాసవంతమైన రెస్టారెంట్లు కంటికింపుగా ఉండటం కోసం బంగారపు రేకులు వేసి రుచి కరమైన పదార్ధాలని తయారు చేస్తాయి.

7.విరివిగా లభ్యమవుతుంది
ప్రపంచమంతా అనేక రకాల జంతువులూ, మొక్కలూ ఉన్నాయి.కానీ బంగారం మాత్రం అన్ని చోట్లా ఒకేలాగ ఉంటుంది.భూమి మీద ఉన్న 7 ఖండాలలోనూ ఈ లోహం దొరుకుందంటే మీరు నమ్మగలరా??

8.బంగారం ఇతర గ్రహాలకి సబంధించిన లోహం
బంగారానికి సంబంధించిన 8 నిజాలు ముగించేముందు ఈ నిజాన్ని అస్సలు విస్మరించకూడదు.బంగారం మన భూమికి చెందిన లోహం కాదంటే మీరు నమ్మగలరా??అవును, ఇది భూమి మీద మొదట లభించలేదు. దాదాపు 200 మిలియన్ సంవత్సరాల క్రితం తోకచుక్కలతో పాటు ఈ లోహం భూమి మీదకొచ్చింది.
మీరు మరింత లోతుగా పరిశొధించే కొద్దీ బంగారానికి సంబంధించి మరిన్ని విస్మయకర విషయాలు తెలుస్తాయి.మీరు బంగారాన్ని మీ శరీరం మీద ధరిస్తారు కదా?? కానీ మీ శరీరంలో ఉన్న రక్తం లో సుమారు 0.2 మిల్లిగ్రాముల బంగారం ఉంటుందంటే నమ్ముతారా??
బంగారం లేకుండా జీవితాన్ని ఊహించుకోవడం అసాధ్యం కదా??



Click it and Unblock the Notifications