Latest Updates
-
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.!
వింత ఆచారం !! ఆ గుళ్లో దొంగతనం నేరం కాదు !! ఎందుకు ?
సాధారణంగా గుళ్లు అంటే.. చాలా పకడ్బంధీగా ఉంటాయి. రెండు మూడు తాళాలు వేసి.. నగలన్నింటినీ భద్రపరిచే బాధ్యతను ఆలయ అధికారి లేదా పూజారికి అప్పగిస్తారు. దేవుడికి సంబంధించిన ప్రతి విలువైన వస్తువును పదిలపరిచేలా జాగ్రత్త వహిస్తారు. కానీ ఇప్పుడు చెప్పబోయేది వింటే ఆశ్చర్యపోతారు. ఆ గుళ్లో దొంగతనం చేస్తేనే అమ్మవారి అనుగ్రహం పొందుతారట. ఇదెక్కడి విడ్డూరం అనుకుంటున్నారా ?
ఇండియాలోని పురాతన ఆలయాల్లో దాగున్న అంతుచిక్కని రహస్యాలు
మామూలుగా ఏదైనా దొంగతనం, అపచారం చేస్తే.. ఆ దేవి ఆగ్రహానికి గురవుతారని శపిస్తుంటారు. కానీ ఆ గుడికి వచ్చిన వాళ్ల కోరికలు తీరాలంటే మాత్రం.. ఖచ్చితంగా దొంగతనం చేయాల్సిందేనట. ఎందుకంటే అదే ఆచారం. అక్కడ దొంగతనం నేరం కానేకాదట. ఈ ప్రపంచంలో ఎక్కడైనా దొంగతనం అంటే పెద్ద నేరం. కానీ అక్కడ అంతా రివర్స్.

ఆ వింత ఆలయం ఎక్కడో లేదు. మన ఇండియాలోనే. ఉత్తరాఖండ్ లో రూర్కీ జిల్లాలో చూడియాల గ్రామంలో ఉంది చూడామణి ఆలయం. పిల్లలు లేని వాళ్లు ఈ ఆలయాన్ని సందర్శిస్తే.. పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. పిల్లలు కావాలని కోరుకునే తల్లిదండ్రులు ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి. అలాగే దొంగతనం చేయాలి. దొంగతనం అంటే.. నగలు కాదు.. ఒక చెక్క బొమ్మను అమ్మవారి పాదాలపై ఉంచుతారు. దాన్ని ఎవరైతే అపహరిస్తారో వాళ్లు ఆరోగ్యవంతమైన బిడ్డ జన్మిస్తాడని ఆలయ పూజారులు చెబుతారు.
సోమనాథ్ ఆలయంలోకి హిందువులకు మాత్రమే ఎంట్రీ..!! ఎందుకు ?
పెళ్లైన తర్వాత చాలాకాలం పిల్లలు కాని వాళ్లు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఏడాది మొత్తం తెరిచి ఉండే ఈ ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. చెక్క బొమ్మను అపహరించిన తర్వాత పిల్లలు పుట్టగానే.. మళ్లీ ఆలయానికి వచ్చి ఆ బొమ్మను అక్కడే పెట్టాలి. దాంతోపాటు మరో బొమ్మను కూడా అమ్మవారికి సమర్పించాలి.

ఈ ఆలయంలో ఉన్న వింత ఆచారం వెనక ఒక పురాణ కథ ఉంది. లాంధౌరా రాజు అడవిలో వేటకు వెళ్లాడు. అప్పుడు చూడామణి ఆలయం కనిపించి.. అమ్మవారిని తనకు బిడ్డను ప్రసాదించమని కోరాడు. అప్పుడు అమ్మవారు మాయమై.. చెక్క బొమ్మ రూపంలో రాజుకి అర్పించింది. ఆ రాజు ఆ బొమ్మను తీసుకెళ్లి పూజలు చేశాడు. ఏడాది తర్వాత రాజా, రాణికి ఒక బిడ్డ జన్మించారు. ఆ తర్వాత చూడామణి ఆలయానికి వచ్చి ఆ రాజు చెక్క బొమ్మను తిరిగి అమ్మవారికి సమర్పించారట. అలా.. ఈ సంప్రదాయంలో ఆచరణలో ఉంది.



Click it and Unblock the Notifications
