Latest Updates
-
కోల్కతా ఫేమస్ టాంగ్రా' డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.!
పడకగదిలో మాట్లాడకూడని మాటలు
పడక గదిలో మీరు చేసే కొన్ని పనుల వల్ల మూడ్ పాడయ్యి మీ భాగస్వామితో మీ బంధం దెబ్బ తినే ప్రమాదం ఉంది.కోపం కలిగించే కొన్ని పదాలని పడకగదిలో వాడకపోవడమే మంచిది.
మీరు పడకగదిలో శృంగారంలో పాల్గొనేటప్పుడు ఆ సంతోష తరంగాలని ఆనందించాలే తప్ప పిచ్చి ప్రేలాపనలతో ఆ ఆనందాన్ని పాడు చేసుకోకూడదు. కొన్ని మాటల వల్ల మీ ఇద్దరి ఆనందం ఆవిరవుతుంది.
కానీ కొంతమంది మగవారిలో తగినంత మెచ్యూరిటీ లేకపోవడం వల్ల పెళ్ళైన కొత్తలో పడకగదిలో మీ ఇద్దరి ఆనందానికి భంగం కలిగించే మాటలు మాట్లాడుతూ ఉంటారు.
పడకగదిలో శృంగారంలో ఆనందించేటప్పుడు ఆమెతో అసలు ఏ మాటలు మాట్లాడకూడదో చూడండి.

నీకు ఇదే మొదటి అనుభవమా అని అడగటం:
శృంగారంలో పాల్గొనేటప్పుడు అడిగే ఈ ప్రశ్న అత్యంత చెత్త ప్రశ్న.ఒకవేళ తమకి గతానుభవం ఉన్నా కానీ గతాన్ని మాట్లాడటానికి ఎవ్వరూ ఇష్టపడరు.

వావ్, నువ్వు నా మాజీ ప్రేయసి కంటే నయం:
మీ ప్రస్తుత భాగస్వామి ని మాజీ ప్రేయసితో పోల్చడం వల్ల మీరు ఆమె హృదయాన్ని గెలుచుకోలేరని తెలుసుకోండి.

మా ఫ్రెండ్ గెస్ కరెక్టే సుమా:
కొంతమంది మగవారు తమ పడకగది విషయాలని స్నేహితులతో పంచుకుంటారు.కానీ మీరు ఆ విషయాన్ని ఆమెకి చెపితే అసౌకర్యంగా ఫీలవుతుంది.

నిన్ను నగ్నం గా చూస్తే ఫన్నీ గా ఉన్నావు:
ఎవరినైనా వారి రూపం గురించి జోకులేసి నవ్వడం అంత హేయమైన చర్య ఇంకోటి లేదు.ఇలా చేస్తే మీకు ఎప్పటికీ ఆమె దగ్గర గౌరవం దొరకదు.

నువ్వు బాగా లావు:
మీ భాగస్వామి లావైనా కానీ ఆమెని ఎగతాళి చేస్తూ ఆమె మొహం మీదే ఆ మాట చెప్పకండి.మీ చెంప పగలచ్చు లేదా మీ పడకగది ఆనందం ఆవిరైపోవచ్చు.

పడకగదిలో ఆమె అక్క చెళ్ళెళ్ళ గురించిన మాటలు:
మీరు మీ భాగస్వామి సోదరికి ఎంత క్లోజైనా కానీ మీరు మీ భాగస్వామితో మంచం మీదున్నప్పుడు అసలు వాళ్ళ గురించి ఎత్తద్దు. ఆమె మీ ఇద్దరినీ అనుమానించే ప్రమాదం ఉంది.

పోర్న్ సినిమాలలో లాంటి అరుపులు:
మీరు కనుక శృంగారంలో పాల్గొన్నప్పుడు "ఎస్, ఎస్" అంటూ అరిచారంటే మీరు ఎక్కువగా పోర్న్ చూస్తారనీ ఆ సినిమాలలో నటీ నటులని అనుకరిస్తున్నారనీ అనుకునే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications
