Latest Updates
-
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.!
మీకు అదృష్టం తీసుకొచ్చే అద్భుతమైన వాస్తు చిట్కాలు
వాస్తు శాస్త్రాన్ని మీరు నమ్ముతారా ? మరైతే ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలో తెలుసుకోవాలనే ఆసక్తి మీలో ఉందా ? అయితే మీకు ఈ ఆర్టికల్ ఉపయోగపడినట్టే. ఈ కింది విషయాలన్నీ తెలుసుకోవాల్సిందే.
వాస్తు శాస్త్రం మన అదృష్టాన్ని తెలుపుతుంది. వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించినట్లైతే, అవి ఖచ్చితంగా మీకు అదృష్టం తీసుకొస్తాయని నమ్మవచ్చు. ఈ వాస్తు నియమాలను పాటించడంలో కొంత మంది చాలా ఫర్ఫెక్ట్ గా అనుసరిస్తుంటారు.
ఈ వాస్తు నియమాలను పాటించడం వల్ల ప్రేమ, డబ్బు, అదృష్టం , మంచి ఆరోగ్యం పొందుతారని చాలా మంది నమ్ముతుంటారు. మరి మీరు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? చిన్న చిన్న వాస్తు నియమాలు పాటించి మీ అదృష్టాన్ని పరిక్షించుకోండి. ముఖ్యంగా వాస్తు శాస్త్రంలో స్థలం ప్రముఖ పాత్రవహిస్తుంది. సరైన స్థలంలో సరైన వస్తువులను అమర్చడం చాలా ముఖ్యమైనది.

మొక్కలు నాటడం
ఈ సంవత్సరం ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు , ఇంట్లో ఒక ఆరోగ్యకరమైన మొక్కను నాటడం వల్ల మంచి జరుగుతుంది. ఇంట్లో ఒక కార్నర్ లో ఇండోర్ మొక్కలు అమర్చుకోవచ్చు. పాట్ లో క్రింది బాగంలో షైనింగ్ కాయిన్స్, బ్లూ కలర్స్ బబుల్స్ వేయడం వల్ల లక్ తో పాటు, ఇంటి అందం, అదృష్టం పెరుగుతుంది.

సన్ ఫ్లవర్
ఇంట్లో వాళ్లతో సత్ససంబంధాలు, ప్రేమ కోల్పోతున్నట్లైతే, వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకుంటే మంచి జరుగుతుంది. సన్ ఫ్లవర్ అండ్ డ్యాండలైన్ చాలా పవర్ ఫుల్ ప్లాంట్స్. వీటి వల్ల ఇంట్లో వారి మద్య సఖ్యత ఏర్పడుతుంది. ఒకరితో ఒకరు ప్రేమగా ఉంటారు.

ఫెంగ్ షుయ్ కాయిన్స్
వాస్తు ప్రకారం మూడు కాయిన్స్ ఉన్నాయి. ఇవి ఇంటిలోపలికి, జీవితంలోకి అదృష్టం తీసుకొస్తాయి. ఇలాంటి మొక్కలను ఇంటి ద్వారం ఎదురుగా నాటుకోవచ్చు. ఈ మూడు కాయిన్స్ ను ఫౌంటైన్ లో వేసి ఉంచాలి. అంతే కాదు ఫౌంటైన్ వాటర్ కింద పడకుండా చూసుకోవాలి.

అక్వేరియం
కొందరికి అదృష్టం తీసుకొచ్చేది మరొకటి ఉంది. అదే అక్వేరియమ్. ముఖ్యంగా గోల్డెన్ ఫిష్, ఇది మీ జీవితానికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. గోల్డ్ ఫిష్ ను ఇంటి ఎంట్రన్స్ లో , లేదా కొద్దిగా ముందరి భాగంలో ఎడమవైపు అమర్చుకోవచ్చు. ఎనిమిది బ్లాక్ ఫిస్ వాటి మద్యలో ఒక గోల్డ్ ఫిష్ ఉంచడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.

లైట్స్ ఎప్పుడూ మెరవాలి
ఇంట్లో ఎప్పుడూ లైట్స్ వెలుగుతుండాలి. అలా చేసినప్పుడే అదృష్టం వరిస్తుంది. అందుకోసం ఇంట్లోనే కాదు, ఇంటి ముందు బాగంలో కూడా మంచి బ్రౌట్ గా ఉండే లైట్స్ ను అమర్చుకోవాలి .

సెంట్ క్యాండిల్స్
సెంట్ క్యాండిల్స్ ఇంట్లో మంచి వాసన కలిగి ఉంటుంది . అలాగే అదృష్టాన్నికూడా తీసుకొస్తుంది. తులసి, క్యాండిల్స్ ను డోర్ దగ్గర వెలిగించుకోవచ్చు. స్వీట్ స్మెల్ ఆరోమా మరింత ఎఫెక్ట్ ను కలిగిస్తుంది.

మంచి జరగాలని కోరుకోవాలి
ఎప్పుడూ మనకు మంచి జరగాలని కోరుకోవడం వల్ల దాని వల్ల మనకు ఎనర్జి లెవల్స్ పెరుగుతాయి. ప్రశాంతత ఏర్పడుతుంది. మరి అదృష్టం పొందాలంటే గుడ్ లక్ చెప్పుకోక తప్పదు.



Click it and Unblock the Notifications
