Latest Updates
-
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.!
మిమ్మల్ని అవాక్కయ్యేలా చేసే చైనా సీక్రెట్స్
అన్ని రకాల గూడ్స్ లేదా వస్తువులు పొందగలిగే దేశమేదంటే చైనా అని చెప్పవచ్చు. కానీ.. చైనా ప్రొడక్ట్స్ కి గ్యారెంటీ ఉండదని.. మనలో చాలా మంది భావిస్తారు. కానీ.. ఇప్పటికీ చాలామంది చైనీస్ ఐటమ్స్ నే ఇష్టపడతారు. గ్యారెంటీ లేదంటూనే వాటిని కొనేలా మనల్ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి ఆ వస్తువులు.
చైనీస్ ప్రొడక్ట్స్ అన్ని ఇండియన్ మార్కెట్స్ లోనూ, ఇతర దేశాల్లోనూ లభిస్తాయి. అవి క్యాలిటీ బాగోలేకపోయినా.. చాలా డిమాండ్ ఉంటుంది. అలాగే చైనీస్ వస్తువులు ఎక్కువగా అమ్ముడుపోతాయి. అయితే చైనా అందమైన దేశం. సందర్శించాల్సిన ప్రాంతం. కానీ.. ఆ దేశం అందం గురించి చాలా అరుదుగా మాట్లాడుకుంటారు.
చైనీస్ చూడ్డాలనికి చాలా వెరైటీగా ఉంటారు. వాళ్ల పేర్లు కూడా చాలా కొత్తగా ఉంటాయి. కానీ వాళ్లకు బ్రెయిన్ పవర్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ అందరికీ తెలిసే ఉండవచ్చు. అయితే.. మిమ్మల్ని మరింత ఆశ్చర్యపరిచే.. విషయాలు ఉన్నాయి. అవి మిమ్మల్ని ఖచ్చితంగా అవాక్కయ్యేలా చేస్తాయి. వెంటనే చైనా గురించి తెలుసుకోవాలని ఆత్రుతగా ఉందా ? అయితే వెంటనే చదివేయండి..

వర్జినిటీ
చైనాకి చెందిన ఒక అమ్మాయి తన వర్జినిటీ ( కన్యత్వం ) పోగొట్టుకుంటే.. మళ్లీ తిరిగే పొందే అవకాశం చైనాలో ఉందట. ఆ దేశానికి చెందిన చాలామంది మహిళలు చాలా డబ్బులు ఖర్చు పెట్టి.. వాళ్లు పోగొట్టుకున్న వర్జినిటీని సర్జరీ ద్వారా పొందుతారట.

ఎగ్స్
చైనాలో ఎగ్స్ ఎలా ఉడకబెడతారో మీకు తెలుసా ? యూరిన్ లో.. ! వామ్మో అదేంటి అనుకుంటున్నారా ? నిజమే.. 10 ఏళ్లలోపు అబ్బాయిల యూరిన్ ని స్కూల్ టాయిలెట్స్ లో కలెక్ట్ చేసి, ఎగ్స్ ఉడకబెట్టడానికి ఉపయోగిస్తారట. ఇలా యూరిన్ ఎగ్స్ ఉడకబెట్టి తీసుకుంటే.. ఆరోగ్యానికి చాలా మంచిదని చైనీస్ నమ్ముతారట.

ఎక్కడైనా నిద్రపోవచ్చు
చైనీస్ మధ్యాహ్నం నిద్రలేకుండా అస్సలు ఉండలేరు. అందుకే మధ్యాహ్నం భోజనం తర్వాత ఏదో ప్లేస్ లో నిద్రపోతారు. ఒకవేళ ఎక్కడా ప్లేస్ లేకపోతే.. వీధుల్లో కూడా నిద్రపోతారు. అంతేకాదు స్కూల్స్ లో కూడా.. మధ్యాహ్నం లంచ్ తర్వాత 30 నిమిషాల బ్రేక్ ఉంటుందట నిద్రపోవడానికి.

కుక్కలు
ఇండియాలో కుక్కలను విశ్వాసానికి ప్రతీకగా చెబుతాం. అలాగే వాటిని కొట్టడానికి కూడా ఇష్టపడరు. కానీ చైనాలో డాగ్స్ ఫెస్టివల్ చేసుకుంటారు. ఆ సమయంలో కుక్క మాంసం తింటారు. ఇలా కుక్క మాంసం తినడం వల్ల.. బాడీ హీట్ పెరిగి, గుడ్ లక్ తీసుకురావడమే కాక, ఆరోగ్యకరంగా ఉంటారని నమ్ముతారట.
ఇదెక్కడి నమ్మకమో కదూ..

రెంట్ కి బాయ్ ఫ్రెండ్
న్యూ ఇయర్ సమయానికి చైనా అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేకపోతే.. కళంకంగా భావిస్తారు. కాబట్టి బాయ్ ఫ్రెండ్ ని రెంట్ కి తీసుకుని.. వాళ్ల రిలేటివ్స్ నుంచి ఎలాంటి విమర్శలు లేకుండా చూసుకోవచ్చట.

అనుమతి తర్వాతే పిల్లలు
చైనాలో ప్రభుత్వ అనుమతి లేకుండా.. ఎవరూ పిల్లలను కనడానికి వీలు లేదు. 3 నెలల ముందు ప్రభుత్వ అనుమతి తీసుకుని ప్లాన్ చేసుకోవాలి.

చిన్నారులకు స్ప్లిట్ పాంట్స్
చైనాలో చిన్నపిల్లల ప్యాంట్స్ కి కింది భాగంలో కట్ అయి ఉంటాయి. దీనివల్ల వాళ్లు సులభంగా టాయిలెట్ కి వెళ్లడానికి వీలుగా ఉంటుంది. అలాంటి ప్యాంట్స్ చైనాలోని పిల్లలకు చాలా కామన్ గా ఉపయోగిస్తారు.



Click it and Unblock the Notifications
