Latest Updates
-
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.!
కాకులను చూసైనా బుద్ధి తెచ్చుకోండి, సిగ్గుతో ఇక నుంచి ఆ పని చేయకండి
ఫ్రాన్స్ లో ఇలా మనుషులు చెప్పే మాటలు వినే కాకులున్నాయి. అవి చేసే మేలు కూడా చాలానే ఉంది. అవి చెత్తాచెదారాన్ని మొత్తం తీసేసి పార్క్ ను శుభ్రం చేస్తున్నాయి. కాకులను చూసైనా బుద్ధి తెచ్చుకోండి.
కాకులు అంటే కొందరికీ అసహ్యం. కొందరికి ఇష్టం. హిందూ సంప్రదాయం ప్రకారం అయితే పిండాలు పెట్టేటప్పుడు కాకులకు ప్రాధాన్యం ఎక్కువే ఉంటుంది. కాకులకు సంబంధించి కథలు కూడా చాలానే ఉన్నాయి. కొన్ని కాకులు మనం చెప్పినట్లుగానే వింటాయి కూడా. మనం ఏం చెబితే ఆ పని కూడా చేస్తాయి.

మనుషులు చెప్పే మాటలు వింటాయి
ఫ్రాన్స్ లో ఇలా మనుషులు చెప్పే మాటలు వినే కాకులున్నాయి. అవి చేసే మేలు కూడా చాలానే ఉంది. అవి చెత్తాచెదారాన్ని మొత్తం తీసేసి పార్క్ ను శుభ్రం చేస్తున్నాయి. అలా చేస్తూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి ఆ ఆరు కాకులు.

ఎక్కడంటే అక్కడ పడేస్తారు
సాధారణంగా ఎవరైనా పార్క్ కు వెళ్తే ఏవేవో తిను బండారాలు తిని వాటి వ్యర్థాలు మొత్తం ఎక్కడంటే అక్కడ పడేస్తారు. అలాగే కొందరు సిగరెట్స్ తాగి వాటిని కూడా అక్కడే పడేస్తారు. ఇలాంటి వ్యర్థాలను మొత్తం తీసి చెత్తబుట్టలో పారేసి పరిశుభ్రత పాటిస్తున్నాయి కాకులు.

వర్కర్స్ కు బదులుగా కాకులు
ఫ్రాన్స్ లో ఒక థీమ్ పార్క్ లో ఇలా కాకులు స్వచ్ఛందంగా పని చేస్తున్నాయి. ఇలా చెత్త ఏరివేస్తున్నందుకు కాకులకు తినడానికి నగెట్స్ అందిస్తున్నారు పార్క్ అధికారులు. వర్కర్స్ కు బదులుగా కాకులతో పని చేయించుకుంటున్నారు.

కాకులకు బంపర్ ఆఫర్
కాకులు వ్యర్థాలను తీసుకెళ్లి ఒక డబ్బాలో వేయగానే వాటికి తినడానికి నగెట్స్ బయటకు వస్తాయి. దీంతో కాకులు కూడా ఆ పని బాగా హుషారుగా చేస్తున్నాయి. ఈ ఆరు కాకులు ఇలా చేయడానికి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అయితే పార్క్ కు వచ్చిన వారు కాకులను చూసైనా కనీసం బుద్ధి తెచ్చుకోవాలని, కాస్త సిగ్గు తెచ్చుకుని ఇక నుంచి పార్కుల్లో చెత్తను వేసే పని చేయకండి అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు పార్క్ అధికారులు.
అయితే కాకుల తెలివిని ఉపయోగించుకుని పని చేయించుకోవడం అనేది ఇదేమీ ఫస్ట్ టైమ్ కాదు. ఇలా గతంలో కూడా చాలా చోట్ల కాకులను పనులు చేయించుకునేందుకు ఉపయోగించుకున్నారు.



Click it and Unblock the Notifications
