Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
విద్యార్థినిపై ఏడు నెలలుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు లైంగిక దాడి చేస్తూనే ఉన్నారు
బిహార్‌లోని ఛప్రా జిల్లా పర్సాఘడ్‌లోని ఓ స్కూల్‌లో బాధిత ఆమె పదోతరగతి చదువుతోంది. గతేడాది డిసెంబర్‌లో ఓ కేసులో బాలిక తండ్రి జైలు పాలయ్యాడు. విద్యార్థినిపై ఏడు నెలలుగా విద్యార్థులు లైంగిక దాడి
ఎక్కడైనా విద్యార్థులు తప్పు చేస్తూ టీచర్లు సరిదిద్దుతారు. కానీ విద్యార్థులతో సహా టీచర్లు కూడా కలిసి తప్పు చేయడం చూశారా? అలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు ఉపాధ్యాయులు. విద్యార్థులతో కలిసి ఒక విద్యార్థినిపై తరచు అత్యాచారం చేసి నరకం చూపించారు.

స్కూల్ కు వెళ్లాలంటే నరకం
పదో తరగతి చదివే ఓ బాలికకు స్కూల్ కు వెళ్లాలంటే నరకంలా అనిపించేది. ఇలాంటి దారుణం ఎక్కడా జరిగి ఉండదేమో. స్కూల్ ప్రిన్సిపాల్, ఇద్దరు ఉపాధ్యాయులు, విద్యార్థులు సహా ఏకంగా 18 మంది ఏడు నెలలుగా విద్యార్థినినీ అత్యాచారం చేశారు. ఆ విద్యార్థిని ఆ మృగాళ్ల దాడిని తట్టుకోలేక చివరకు ధైర్యం చేసింది. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది.

నువ్వు ఏమి ఆందోళన చెందకు
బిహార్‌లోని ఛప్రా జిల్లా పర్సాఘడ్‌లోని ఓ స్కూల్‌లో బాధిత ఆమె పదోతరగతి చదువుతోంది. గతేడాది డిసెంబర్‌లో ఓ కేసులో బాలిక తండ్రి జైలు పాలయ్యాడు. ఈ క్రమంలో ఆమెకు ఒక క్లాస్‌మేట్ దగ్గరయ్యాడు. మీ నాన్న జైలుకు వెళ్లాడని నువ్వు ఏమి ఆందోళన చెందకు, ధైర్యంగా ఉండు అంటూ ఆమెను రోజూ ఓదార్చాడు.

అత్యాచారానికి పాల్పడ్డారు
దీంతో ఆ విద్యార్థిని అతన్ని నమ్మింది. తర్వాత ఒక రోజు ఆ విద్యార్థినిపై అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అతను వీడియో తీశాడు. ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్ప వద్దని ఆమెను బెదిరించాడు.చెబితే వీడియో బయటపెడతా అన్నాడు. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడిన విద్యార్థి సహకారంతో ఐదుగురు విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు.ఆ బాలిక ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్స్‌పాల్ కు చెబితే అతను ఆమెకు న్యాయం చేయకుండా మరో ఇద్దరు ఉపాధ్యాయులతో సహా విద్యార్థినిపై లైంగిక దాడి చేశాడు.

ఆమెను బ్లాక్ మెయిల్ చేసి
ఇక ఈ విషయం క్లాస్ లో మరికొందరు విద్యార్థులకు తెలిసింది. దీంతో వారంతా ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఆ మరికొందరు విద్యార్థులు అప్పటి నుంచి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ ఏడు నెలలుగా ఆమెపై లైంగిక దాడి చేస్తూనే ఉన్నారు.

జైలు నుంచి తండ్రి
అయితే ఈ మధ్యే ఆమె తండ్రి జైలు నుంచి విడుదల అయ్యాడు. జరిగిన దారుణాన్ని తండ్రికి చెప్పుకుని కూతురు విలపించింది. దీంతో ఎక్మా పోలీస్ స్టేషన్ లో తండ్రి సాయంతో బాధితురాలు ఫిర్యాదు చేసింది. మొత్తం 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సత్వర న్యాయం జరిగేలా చూస్తాం
ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్, టీచర్ బాలీజీ, ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాధిత బాలికను వైద్యపరీక్షల నిమిత్తం అధికారులు ఆస్పత్రికి తరలించారు. బాధితురాలికి సత్వర న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications
