శృంగార సామర్థ్యం పెంచుకోవడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఏం చేస్తారో తెలుసా?

Written By:
Subscribe to Boldsky

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రపంచంలోని చాలా మందికి తెలుసు. మనదేశ ప్రధాని, రాష్ట్రపతి పేర్లు అయినా మరిచిపోతామోగానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పేరు మాత్రం మనలో చాలా మందికి గుర్తు ఉంటుంది. రోజూ ఏదో ఒక సాహసం ప్రదర్శిస్తూ ఆయన వార్తల్లో నిలుస్తుంటారు. ఇలాంటి దేశ అధ్యక్షులు చాలా అరుదుగా ఉంటారు.

గడ్డకట్టే చల్లటి నీటిలో స్నానం

గడ్డకట్టే చల్లటి నీటిలో స్నానం

ఈ మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తన సాహసాన్ని మళ్లీ ఒకసారి చూపించాడు. సాహసాలతో పాటు ఆయన తన ఆరోగ్యంపై కూడా ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు. 65 ఏళ్ల వయస్సులోనూ పుతిన్ మైనస్ 5 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న గడ్డకట్టే చల్లటి నీటిలో స్నానం చేశారు.

ప్రత్యేకత చాటుకున్నారు

ప్రత్యేకత చాటుకున్నారు

గతనెలలో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో ఆయన అలా మైనస్‌ డిగ్రీల చల్లటి నీటిలో స్నానం చేశారు. ఆయన స్నానం చేస్తున్న సమయంలో సెలిగర్‌ సరస్సులోని నీళ్లు గడ్డకట్టి ఉన్నాయి. అయినా ఆయన ఆ నీళ్లలో స్నానం చేసి ప్రత్యేకత చాటుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. తన విశ్వాసం కోసం ఇలా స్నానం చెయ్యడం అనేది మంచి విషయమే.

రక్తంతో స్నానం చేస్తాడంట

రక్తంతో స్నానం చేస్తాడంట

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మరో రకంగా కూడా స్నానం చేస్తాడంట. అది చాలా కొద్ది మందికి తెలిసిన విషయం. ఈయన ఈ వయస్సులో కూడా బలిష్టంగా కనిపించడానికి రోజూ వ్యాయామం చేస్తుంటాడు. అలాగే ఆయన తరచుగా రక్తంతో స్నానం చేస్తాడంట. ఈ విషయంపై ఇంటర్నేషనల్ మీడియాలో ప్రధానంగా కథనాలు కూడా వచ్చాయి.

దుప్పి కొమ్ముల నుంచి తీసిన రక్తంలో

దుప్పి కొమ్ముల నుంచి తీసిన రక్తంలో

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ దుప్పి కొమ్ముల నుంచి తీసిన రక్తంలో స్నానం చేస్తారని టాక్ ఉంది. అలా చేయడం వల్ల శరీరంలోని ఎముకలు, కండరాలు, నడుము, కీళ్లు బలంగా తయారవుతాయని ఆయన నమ్మకం అట.

లైంగిక శక్తి పెరుగుతుందని

లైంగిక శక్తి పెరుగుతుందని

అలాగే లైంగిక శక్తి కూడా బాగా పెరుగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ నమ్మకం. దుప్పి రక్తంతో స్నానం చేస్తే చాలా రోగాలు నయం అవుతాయని పుతిన్ నమ్ముతాడట.

అల్తాయ్‌ పర్వత ప్రాంతాలకు

అల్తాయ్‌ పర్వత ప్రాంతాలకు

అందుకే పుతిన్‌ తరచుగా రష్యాలోని అల్తాయ్‌ పర్వత ప్రాంతాలకు వెళతారట. ఇటీవల ఆయన అక్కడికి వెళ్లినప్పుడు అధికారులు 70 కిలోల దుప్పి కొమ్ములను విరిచి అందులో నుంచి రక్తం తీసి స్నానానికి సిద్ధం చేశారట.

గంటల తరబడి స్నానం

గంటల తరబడి స్నానం

రక్తంతో నిండి ఉన్న టబ్ లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పడుకుని గంటల తరబడి స్నానం చేశారట. ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన మీడియాల్లో అనేక కథనాలు కూడా వచ్చాయి.

అక్కడ ఉండే వారి నమ్మకం

అక్కడ ఉండే వారి నమ్మకం

దుప్పి, ముఖ్యంగా మరల్‌ లేదా రెడ్‌ దుప్పి కొమ్ముల నుంచి తీసిన రక్తంలో స్నానం చేస్తే ఆరోగ్యం బాగా ఉంటుందని రష్యాలో కొంతమంది నమ్మకం. త్వరగా ముసలివారు కారని, అలాగే శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనేంత శక్తి వస్తుందని రష్యాలో ఉండేవారు నమ్ముతారు.

స్నానం చెయ్యడం వల్ల

స్నానం చెయ్యడం వల్ల

దుప్పి కొమ్ముల నుంచి తీసిన రక్తంతో స్నానం చెయ్యడం వల్ల టెస్టోస్టెరేన్‌ పెరుగుతుందని అనుకుంటారు. ఇలా నమ్మి దుప్తి రక్తంతో స్నానం చేసేవారు ఇప్పటికీ రష్యాలో చాలామంది ఉన్నారు.

లైంగిక పటుత్వాన్ని పెంచే మందుల్లో

లైంగిక పటుత్వాన్ని పెంచే మందుల్లో

ఇందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. లైంగిక పటుత్వాన్ని పెంచే మందుల్లో దుప్పి రక్తం వాడుతూ ఉంటారు. అలాగే నిమోనియా, ఆస్తమా, ఆస్టియోపొరోసిస్, ప్లూరిసీలాంటి జబ్బులకు, వెన్నుముక సమస్యలకు దుప్పి రక్తాన్ని వాడుతుంటారు. దీన్ని ఆధారంగా చేసుకుని రష్యన్లు దుప్పి రక్తంతో స్నానం చేస్తుంటారు.

పుతిన్ కు ఈ విషయం అలా తెలిసింది

పుతిన్ కు ఈ విషయం అలా తెలిసింది

ఇక వ్లాదిమీర్‌ పుతిన్‌ తన మిత్రుడైన అప్పటి దేశ ప్రధాన మంత్రి దిమిత్రి మెద్వదెవ్‌ ద్వారా దుప్పి కొమ్ముల రక్తం గురించి తెలుసుకున్నాడ. దుప్పి కొమ్ముల రక్తంలో మంచి ఔషధ గుణాలుంటాయని మెద్వదెవ్ వివరించారట.

మెద్వదెవ్‌ కూడా

మెద్వదెవ్‌ కూడా

మెద్వదెవ్‌ కూడా దుప్పి రక్తంతో స్నానం చేస్తారని టాక్. ఇక పుతిన్ మెద్వదెవ్ చెప్పిన తర్వాత ఇది నిజమా కాదా అని కొందరు డాక్టర్లను కూడా అడిగారట. మరల్‌ బ్లడ్‌ వైద్య నిపుణుడు అలెగ్జాండర్‌ జుకోవ్‌ను కలుసుకుని దుప్పి రక్తంతో వచ్చే ప్రయోజనాలు తెలుసుకున్నాడట.

తెలిసిన ప్రముఖులకు కూడా చెబుతాడు

తెలిసిన ప్రముఖులకు కూడా చెబుతాడు

వ్లాదిమిర్‌ పుతిన్‌ ఒక్కడే ఇలా దుప్పి రక్తంతో స్నానం చేయడమే కాకుండా తనకు తెలిసిన ప్రముఖులకు కూడా చెప్పి వారు ఇలా చేశాడంట. ఇటలీ మాజీ ప్రధాన మంత్రి సిల్వియో బెర్లూస్కీ ఆ మధ్య సైబీరియా పర్యటనకు వచ్చినప్పుడు ఆయన కూడా దుప్పి కొమ్ముల రక్త రహస్యం గురించి పుతిన్‌ చెప్పారట. బెర్లూస్కీ మాంచి సెక్స్ కోరికలున్న వ్యక్తి.

ఎక్కువ డిమాండ్

ఎక్కువ డిమాండ్

రష్యాలో దుప్పి కొమ్ముల నుంచి తీసిన పది మిల్లీలీటర్ల రక్తం ధర వంద డాలర్ల వరకు ఉంటుందట. రష్యాలో ఈ రక్తంతో కోట్లలో వ్యాపారం జరుగుతోంది. కేవలం పది మిల్లీలీటర్ల రక్తమే వంద డాలర్లు విలువచేస్తుందట.

తాగుతారంట కూడా

తాగుతారంట కూడా

ఈ రక్తంతో కొందరు స్నానం చేస్తే మరికొందరు దీన్ని సేవిస్తుంటారట. లైంగిక సామర్థ్యం కోసం అలా మూగ జీవాలను చంపడం ఏమిటని చాలా మంది ప్రజలు మండిపడుతున్నారు.

ImageSource:http://www.dailymail.co.uk/news/article-4707444/Putin-bathes-blood-cut-severed-deer-antlers.html

http://www.financialexpress.com/photos/business-gallery/1021434/russias-vladimir-putin-strips-off-to-his-bathing-trunks-takes-dip-in-icy-lake-to-mark-orthodox-epiphany-see-photos/5/

English summary

horrifying things you need to know about vladimir putin

horrifying things you need to know about vladimir putin
Subscribe Newsletter