స్త్రీ వక్షోజాన్ని శివ లింగంగా భావించి పూజించాడు.. మహాభక్తుడు

Written By:
Subscribe to Boldsky

మహా శివరాత్రి రోజునా ఒక్కొక్కరు ఒక్కోరకంగా శివుణ్ని పూజిస్తారు. శివుడు ఎంత కరుణామయుడు అంత కోపంతో కూడా రగిపోతాడు. పురాణాల్లో చాలా కథల్లో మనం శివుడి ఆగ్రహం ఏమిటో చూసి ఉంటాం. వేళకు పూజ చేయకుంటే ఎక్కడ శివుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తోందని ఒక మహా భక్తుడు తన పక్కన నిద్రిస్తున్న స్త్రీ వక్షోజాన్నే శివలింగంగా భావించి పూజించాడట.

ఈ కథ జరిగింది ఎక్కడో కాదు... పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలోనే. ఆచంటలో రామేశ్వరుడు చాలా మందికి తెలిసి ఉంటాడు. అక్కడ దేవుడు వెలవడంపై చాలా కథనాలున్నాయి. అందులో ఒకటి మీరూ తెలుసుకోండి.

శివపార్వతులు శృంగారంలో

శివపార్వతులు శృంగారంలో

అప్పుడు తారకాసుర సంహారం జరిగింది. తర్వాత శివపార్వతులు శృంగారంలో తేలిపోతున్నారు. ఆ సమయంలో ముని దంపతులైన పుష్పసుందరుడు, పుష్పసుందరి శివుడి దర్శనం కోసం ఆ ప్రదేశానికి వచ్చారు. శివపార్వతులిద్దరూ ఏకాంతంలో ఉండడాన్ని వారు గమనించారు. తర్వాత వారిద్దరూ చేసుకునే రాసలీలను కళ్లారా చూశారు.

శివుడికి కోపం వచ్చింది

శివుడికి కోపం వచ్చింది

తాను, తన భార్య ఏకాంతంగా ఉన్నప్పుడు రావడమేకాకుండా, తామిద్దరినీ అలా చూస్తూ ఉండిపోవడంపై శివుడికి కోపం వచ్చింది. వెంటనే ఆ ముని దంపతులను శపించాడు. వారిద్దరూ చిన్నపిల్లలుగా మార్చాడు. మీరిద్దరూ మళ్లీ బ్రహ్మచర్యాన్ని పాటించి, తర్వాత శివసాయుజ్యాన్ని పొందండి అంటూ శపించాడు.

ఒడయనంబిగానూ పుట్టాడు

ఒడయనంబిగానూ పుట్టాడు

శాపగ్రస్తులయిన ఆ ముని దంపతులలో పురుషుడైన పుష్పసుందరుడు భూలోకంలో బ్రాహ్మణ ఇంట ఒడయనంబిగానూ పుట్టాడు. పుష్పసుందరుడి భార్య పుష్పసుందరి మార్తాండపురంలో కళావంతుల ఇంట పరమనాచిగాను జన్మించింది.

కాశీకి ఒడయనంబి

కాశీకి ఒడయనంబి

అయితే కాశీవిశ్వనాధుని సన్నిధిలో మహాశివరాత్రి ఉపవాస జాగరణ, పూజలు నిర్వహించడానికి కాశీ నగరానికి బయలు దేరాడు ఒడయనంబి. వెళ్తూవెళ్తూ అలిసిపోయిన అతను ఒక గ్రామంలో విశ్రాంతి తీసుకుందామనుకున్నాడు.

వేశ్య ఇంట్లో

వేశ్య ఇంట్లో

ఒడయనంబికి ఒక వేశ్య ఇంటిలో ఆతిథ్యం లభించింది. అయితే ఒడయనంబి అన్ని విషయాలు మరిచిపోయి ఆ వేశ్య అందానికి దాసోహం అయ్యాడు. ఆ సౌందర్యరాశిని అనుభవిస్తూ ఇంట్లోనే ఉండిపోయాడు. ఆమెతో ఆనందంగా గడుపుతూ ఉన్నాడు.

దైవభక్తి మళ్లీ నిద్ర లేచింది

దైవభక్తి మళ్లీ నిద్ర లేచింది

ఒక రోజు రాత్రి ఆ ఊరి దేవాలయం నుంచి శివపంచాక్షరీ జపం వినపడింది. దాంతో మళ్లీ ఒడయనంబిలోని దైవభక్తి మళ్లీ నిద్ర లేచింది. ఆ రోజు శివరాత్రి అని భక్తులంతా జాగరణ చేస్తున్నారని తెలుసుకున్నాడు. తర్వాత తన ప్రయాణలో ఏర్పడిన అవాంతరాలను గుర్తుకు తెచ్చుకున్నాడు.

వేశ్య వల్ల అక్కడికి వెళ్లలేకపోయాడు

వేశ్య వల్ల అక్కడికి వెళ్లలేకపోయాడు

వాస్తవానికి ఆ సమయంలో ఒడయనంబి కాశీలో ఉండాల్సి ఉంది. కానీ వేశ్య వల్ల అక్కడికి వెళ్లలేకపోయాడు. అప్పటికే సమయం మించిపోయింది. ఏమి చేయాలో ఒడయనంబికి అర్థం కాలేదు. పరమేశ్వరా.. నన్ను క్షమించు నాకు నువ్వే ఏదైనా దారి చూపు అని వేడుకున్నాడు.

వివస్త్రగా మారిన వేశ్యపై పడింది

వివస్త్రగా మారిన వేశ్యపై పడింది

ఇంట్లో శివలింగం అన్నా లేదు పూజ చేద్దామంటే అని వేశ్య ఇంట్లో అంత తిరిగాడు. చివరకు అతని కన్ను వివస్త్రగా మారిన వేశ్యపై పడింది. ఆమె వక్షోజాన్ని చూశాడు. వక్షోజాన్నే శివలింగంగా భావించి పూజ చేశాడు. ఆ ఇల్లు మొత్తం కూడా కైలాసంలాగా మారిపోయింది.

శివుణ్ని ఆరాధించాడు

శివుణ్ని ఆరాధించాడు

వేశ్య కోసం తీసుకొచ్చిన పూలను ఆమె వక్షోజంపై అంటే అతను శివలింగంగా భావించే దేవుడికి అలంకరించాడు. ఆ రాత్రి మొత్తం అలాగే పూజలు చేశాడు. వేశ్య పక్కన ఉన్న కూడా ఆమెపైకి మనస్సు మళ్లకుండా శివుణ్ని ఆరాధించాడు. రాత్రంతా అలా పూజించి పడిపోయాడు.

శివుడు ప్రత్యక్షమయ్యాడు

శివుడు ప్రత్యక్షమయ్యాడు

శివుడు ఒడయనంబి భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. నాకు మోక్షము ప్రాసాదించు అని ఒడయనంబి అనగానే అతన్ని కోరికను తీర్చాడు శివుడు.

శివ సాయుజ్యాన్ని..

శివ సాయుజ్యాన్ని..

స్త్రీ పక్కన ఉండీ శివభక్తిని మరువని అతని ఏకాగ్రతకు మెచ్చిన పరమశివుడు వాళ్లిద్దరికీ శివ సాయుజ్యాన్ని ప్రసాదించాడట. అయితే వేశ్యగా ఉన్న ఆమె గత జన్మలో ఒడయనంబి భార్య అని ప్రతీతి.

రామచంద్రుడు అభిషేకించినందువల్లే

రామచంద్రుడు అభిషేకించినందువల్లే

రామేశ్వరుడిగాతర్వాతి కాలంలో, రావణాసురుడ్ని సంహరించిన రాముడు బ్రహ్మ హత్యా మహాపాతకాన్ని పోగొట్టుకునేందుకు పంచారామాలలో శివారాధన జరిపి, దండకారణ్య మార్గంలో వెళ్తూ మార్తాండపురం (ఆచంట) వచ్చాడట.

శివలింగం తారసపడింది

శివలింగం తారసపడింది

అక్కడ శివలింగం ఆయనకు తారసపడింది. ఆ లింగాన్ని అభిషేకించగానే ఆయనకు పాప విమోచన అయ్యిందట. రామచంద్రుడు అభిషేకించినందువల్ల ఈ స్వామిని రామేశ్వరుడిగా పిలుస్తారు.

మహిళలపై కృప ఎక్కువ

మహిళలపై కృప ఎక్కువ

ఆచంటలో స్త్రీ స్తనాగ్రాన లింగోద్భవ కాలంలో వెలసినందువల్ల మహిళలపై స్వామివారి కృప అపారంగా ఉంటుందట. స్త్రీ వ్యాధులు, వివాహాలు, దాంపత్య సమస్యలు, సంతానలేమి వంటివాటితో బాధపడే మహిళలకు ఇక్కడ మంచి జరుగుతుందట.శివరాత్రి సమయంలో ఇక్కడ ఐదురోజుల పాటు వేడుకలు జరుగుతాయి.

English summary

mystery behind the rameswara swamy temple achanta

mystery behind the rameswara swamy temple achanta
Subscribe Newsletter