Latest Updates
-
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా?
రాహుల్ గాంధీకి కన్ను గీటడంతో బెస్ట్ అవార్డ్, నెటిజన్ల కామెంట్స్, ప్రియా వారియర్ స్పందించింది
రాహుల్ పార్లమెంట్ లో కన్ను కొట్టిన రోజును ప్రపంచ ఆలింగనం రోజుగా ప్రకటించాలంటూ కొందరు నెటిజన్లు వ్యగంగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు రాహుల్ గాంధీ ఎక్కడంటే అక్కడ కన్ను కొడుతున్నారు.
తాజాగా లోక్‌సభ లో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అప్పుడు సభలో రాహుల్ గాంధీ బాగా హైలెట్ అయ్యారు. మొదట ఆయన సీరియస్ స్పీచ్ తో అందరినీ మంత్ర ముగ్దుల్ని చేసేశాడు. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని కౌగిలించుకోవడం.. ఆ తర్వాత తన సీట్ లో కూర్చొని తన పార్టీ సభ్యులను చూస్తూ కన్ను కొట్టడం అందరికీ తెలిసిందే. రాహుల్ చేష్టలకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా చిరునవ్వులు చిందించాడు.

సోషల్ మీడియలో వైరల్
ఈ సంఘటలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ అయిపోతున్నాయి. ఇక రాహుల్ కన్ను గీటిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. రాహుల్ జీ.. కన్నుకొట్టడంలో మీకు సాటిలేరు ఎవ్వరూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
కన్నుగీటి
కొన్ని రోజుల క్రితం ప్రియా ప్రకాశ్ వారియర్ కూడా ఇలా కన్నుగీటి కుర్రకారును మొత్తం మాయలో పడేసింది. అప్పుడు జనాలంతా కొన్ని రోజులు ప్రియా ప్రకాశ్ వారియర్ నే ఫాలో అయ్యారు. ఓవర్ నైట్ లో క్రేజ్ సంపాదించిన ప్రియా ప్రకాశ్ వారియర్ కు ఇప్పుడు రాహుల్ పోటీ వచ్చాడు.
రాహుల్ గాంధీని పోల్చుతూ
దీంతో ప్రియా వారియర్ తో రాహుల్ గాంధీని పోల్చుతూ పోస్ట్ లు చేస్తున్నారు. వీటిపై కామెంట్స్ కూడా ఒక రేంజ్ లో వస్తున్నాయి. దీంతో మళ్లీ ప్రియా ప్రకాశ్ వారియర్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది.
రాహుల్ గాంధీ కన్నుకొట్టే సీన్ చూశా
ఇక ప్రియా ప్రకాశ్ వారియర్ దీనిపై స్పందించింది. " కళాశాల నుంచి ఇంటి వచ్చిన వెంటనే మా అమ్మగారు నాకు ఈ విషయం చెప్పారు. తర్వాత టీవీలో నేను లోక్‌సభలో రాహుల్ గాంధీ కన్నుకొట్టే సీన్ చూశాను. ఇక తర్వాత సోషల్ మీడియాలో చూస్తే అంతటా నా పేరు, రాహుల్ గాంధీ పేరు మారిమోగిపోతుంది. రాహుల్ గాంధీగారితో నన్ను పోల్చడం నాకు ఎంతో సంతోషం."
మళ్లీ ఇప్పుడు రాహుల్ గాంధీ సర్ వల్ల
"అంత స్థాయి ఉన్న వ్యక్తితో నన్ను పోల్చి పోస్ట్ లు చేయడం నాకు ఎంతో ఆనందం ఇస్తుంది. నేను నటించిన మొదటి చిత్రంలో ఇలా కన్నుగీటే సీన్ నాకు ఎంతో పాపులారిటీ తెచ్చిపెట్టింది. మళ్లీ ఇప్పుడు రాహుల్ గాంధీ సర్ వల్ల నాకు ఆ పాపులారిటీ వచ్చింది. నిజంగా నేను ఈ రోజును అస్సలు మరిచిపోను. " అంటూ ప్రియాప్రకాశ్ వారియర్ తన అభిప్రాయాన్ని చెప్పింది.
వీడియోలను మిక్స్ చేసి పోస్ట్ చేస్తున్నారు
రాహుల్ గాంధీ, ప్రియాప్రకాశ్ వారియర్ లలో ఎవరూ బాగా కన్నుకొట్టారని పోస్ట్ లు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ప్రియా ప్రకాశ్ వారియర్, రాహుల్ గాంధీ కన్ను కొట్టే వీడియోలను మిక్స్ చేసి పోస్ట్ చేస్తున్నారు. అయితే కొందరు రాహుల్ గాంధీని పొగుడుతూ కామెంట్స్ చేయగా, మరికొందరు పప్పు కీ ఝప్పీ, హగ్‌ప్లొమసీ అనే హ్యాష్ ట్యాగ్ లను జతచేసి ట్వీట్స్ చేస్తున్నారు.
ప్రపంచ ఆలింగనం రోజు
ఇక రాహుల్ పార్లమెంట్ లో కన్ను కొట్టిన రోజును ప్రపంచ ఆలింగనం రోజుగా ప్రకటించాలంటూ కొందరు నెటిజన్లు వ్యగంగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు రాహుల్ గాంధీ ఎక్కడంటే అక్కడ కన్ను కొడుతున్నారు.. సోనియా గాంధీగారు మీరు మీ కొడుకున్నికాస్త జాగ్రత్తగా చూసుకోండి అని అంటున్నారు.
రాహుల్ గాంధీకి మేల్ కేటగిరీలో బెస్ట్ అవార్డ్ ఇవ్వాలి
ఇక కాంగ్రెస్ ఐటీ వింగ్ ఇన్ చార్జి దివ్య స్పందన ప్రియా ప్రకాశ్ వారియర్ వీడియో బాగా చూపించినట్లుంది అందుకే రాహుల్ పార్లమెంట్ లో కన్నుకొడుతున్నాడని కొందరు కామెంట్స్ చేశారు. హగ్ ఇవ్వడంలో మున్నాభాయ్ ని, కన్నుకొట్టడంలో ప్రియావారియర్ మించిపోయావ్ అంంటూ కామెంట్స్ చేశారు.కన్నుగీటడంతో రాహుల్ గాంధీకి మేల్ కేటగిరీలో బెస్ట్ అవార్డ్ ఇవ్వాలని కొందరు కామెంట్స్ చేశారు. ఇలా రాహుల్ కన్ను కొట్టి సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా పరోక్షంగా ప్రియా ప్రకాశ్ వారియర్ ను కూడా ఇందులోకి లాగారు.



Click it and Unblock the Notifications
