Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
స్టార్మీ డేనియల్స్ ఒక పోర్న్ స్టార్ ఆమె మాటలు నమ్మకండి.. వాడొక పంది
ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ (స్టెఫానీ క్లిఫార్డ్) మారిమోగిపోతూ ఉంది. ఆమెతో పాటు మరో అడల్ట్ స్టార్ జెస్సికా డ్రాకే పేరు కూడా ఆ మధ్య బాగా మారుమోగిపోయింది. ట్రంప్.
ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ (స్టెఫానీ క్లిఫార్డ్) మారిమోగిపోతూ ఉంది. ఆమెతో పాటు మరో అడల్ట్ స్టార్ జెస్సికా డ్రాకే పేరు కూడా ఆ మధ్య బాగా మారుమోగిపోయింది. అందుకు కారణం
ట్రంప్‌తో తమకు గతంలో శారీరక సంబంధాలున్నాయని వీరు ఆరోపించడమే.
ఇక తన శారీరక సంబంధం విషయాన్ని బహిర్గతం చేయకుండా ఉండేందుకు అధ్యక్షుడు ట్రంప్ లాయర్ మైఖెల్ కోహెన్ మధ్యవర్తిత్వంతో 1,30,000 అమెరికన్ డాలర్లు తనకు ఆఫర్ చేశారని కూడా స్టార్మీ డేనియల్స్ ఆ మధ్య చెప్పారు.

పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్
అయితే తాజాగా పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ ఒక వ్యాఖ్య చేసింది. తన మాజీ లాయర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓ కీలుబొమ్మగా మారిపోయాడని పోర్న్‌స్టార్ అంది. డేనియల్స్ పోర్న్‌స్టార్ అని, ఆమె మాటల్ని ఎవరు నమ్మవద్దని ట్రంప్ లాయర్ తాజాగా వ్యాఖ్యలు చేయడంతో స్టార్మీ డేనియల్స్ మండిపడ్డారు.

లాయర్ మైఖెల్ అవెనట్టిపై
ప్రణాళికా ప్రకరమే తనపై, తన లాయర్ మైఖెల్ అవెనట్టిపై లేని వదంతులు ప్రచారం చేస్తున్నారని పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ మండిపడ్డారు. స్టార్మీ డేనియల్స్ లాయర్ అవెనట్టి మాట్లాడుతూ.. ట్రంప్ లాయర్ గిలియానీ ఓ పంది అని వ్యాఖ్యానించారు. ట్రంప్‌తో శారీరక సంబంధాలు స్టార్మీ డేనియల్స్ కొనసాగించడం వాస్తవమేనన్న అవెనట్టి, డేవిడ్‌సన్ ఈ నిజాన్ని అవాస్తవంగా చిత్రీకరిండానికి యత్నిస్తున్నారని ఆరోపించారు.

రుడీ గిలియాని స్వయంగా వెల్లడించారు
డేనియల్స్‌తో శారీరక సంబంధం కొనసాగించిన కారణంగా ట్రంప్ ఆమెకు నగదు చెల్లించారని గతంలో న్యూయార్క్ మాజీ మేయర్ రుడీ గిలియాని స్వయంగా వెల్లడించారు. ట్రంప్ తన లాయర్ మైఖేల్ కోహెన్ వద్ద నుంచి పోర్న్ స్టార్‌కు 1,30,000 డాలర్లు చెల్లించినట్లు కూడా గిలియాని తెలిపారు. కానీ ఇప్పుడు ట్రంప్ లాయర్‌గా గిలియానీ మారడంతో మళ్లీ పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ పై విమర్శలు చేస్తున్నాడు.

మరో అడల్ట్ స్టార్ జెస్సికా డ్రాకే
ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో గతంలో తనకు శారీరక సంబంధాలున్నాయని పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ (స్టెఫానీ క్లిఫార్డ్) చెప్పడంతో వారి బంధాన్ని బయటకు వెల్లడిస్తే హత్య చేస్తానంటూ ట్రంప్ నుంచి స్టార్మీ డేనియల్స్‌కు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయట. ఈ విషయాన్ని మరో అడల్ట్ స్టార్ జెస్సికా డ్రాకే ఆ మధ్య వెల్లడించారు. ట్రంప్ వ్యక్తులు కొందరు తనకు తరచుగా కాల్స్ చేసి లైంగిక సంబంధాలను వెల్లడించవద్దని బెదిరించారని 2011లోనే స్టార్మీ డేనియల్స్ తనకు చెప్పినట్లుగా జెస్సికా చెప్పారు.

హోటల్ గదికి వెళ్లాను
ఇక గతంలో జెసికా డ్రాకే కూడా కొన్ని వివరాలు చెప్పింది. ట్రంప్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా, తనతో ఏకాంతంగా గడపాలని ఒత్తిడి చేశారని జెసికా ఆరోపించింది. తనను బలవంతంగా ముద్దు పెట్టారని వెల్లడించింది. 2006లో కాలిఫ్నోరియాలోని లేక్ టాహోయ్ గోల్ఫ్ టోర్నమెంట్ లో తనకు ట్రంప్ పరిచమయ్యారని జెసికా తెలిపింది. తర్వాత ట్రంప్ ఆహ్వానం మేరకు మరో ఇద్దరు మహిళలతో ఆయన హోటల్ గదికి వెళ్లానని వెల్లడించారు.

గట్టిగా కౌగిలించుకున్నారు
"మేము వెళ్లేసరికి ట్రంప్ పైజామా దస్తుల్లో ఉన్నారు. దగ్గరికి వచ్చి ఒక్కొక్కరినీ గట్టిగా కౌగిలించుకున్నారు. మా అనుమతి లేకుండానే ముద్దు పెట్టుకున్నారు. పోర్నోగ్రఫీ గురించి కూడా మాట్లాడారు. అక్కడి నుంచి నా గదికి తిరిగొచ్చాక తాను బసచేసిన హోటల్ గదికి రావాలని మరోసారి ట్రంప్ ఆహ్వానించారు. పార్టీకి రావాలని కూడా కోరారు. "

తిరస్కరించడంతో
"నీకు ఏం కావాలి, ఎంత కావాలని అడిగారు. నేను తిరస్కరించడంతో ట్రంప్ తరపు వ్యక్తి నాకు 10 వేల డాలర్లు ఆఫర్ చేశారు. దీనికి ఒప్పుకుంటే ట్రంప్ వ్యక్తిగత విమానంలో తన ఇంటి నుంచి లాస్ ఏంజెలెస్ తీసుకెళతామని చెప్పార"ని అప్పట్లో జెసికా వివరించారు.

ట్రంప్ గతంలో ఒకసారి స్పందించారు
కాగా
పోర్న్‌స్టార్ స్టోర్మీ డేనియల్స్ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ఒకసారి స్పందించారు. ఆమెతో జరిగిన డీల్ గురించి తనకూ తెలుసని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీటర్‌లో ఆయన వరుస ట్వీట్లు చేశారు. డేనియల్స్‌తో శారీరక సంబంధం కొనసాగించిన కారణంగా ట్రంప్ ఆమెకు నగదు చెల్లించారంటూ న్యూయార్క్ మాజీ మేయర్ రుడీ గిలియాని వెల్లడించిన మరుసటి రోజే ట్రంప్ కూడా ట్వీట్లు చేశారు.

సంపన్నుల మధ్య ఇలాంటివి సాధారణం
‘నా లాయర్‌గా పనిచేసిన కోహెన్ ఆమెకు డబ్బు చెల్లించారు. వారిద్దరి మధ్య రహస్యంగా జరిగిన ఒప్పందం ఇది. ప్రైవేట్ ఒప్పందాలను బయటపెట్టాల్సిన అవసరం ఎవరికీ లేదు. సంపన్నుల మధ్య ఇలాంటివి సాధారణంగా జరుగుతుంటాయి. అంతేగానీ ఆమె ఆరోపిస్తున్నట్లు ఎలాంటి లైంగిక సంబంధం లేదు.' అంటూ ట్రంప్ ఆ మధ్య ట్వీట్లు చేశారు. మొత్తానికి పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ (స్టెఫానీ క్లిఫార్డ్) మరో అడల్ట్ స్టార్ జెస్సికా డ్రాకేల వల్ల తరచుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్తల్లోకి ఎక్కుతూనే ఉన్నారు.



Click it and Unblock the Notifications











